కరోనా సెకండ్ వేవ్ టెన్షన్.. అలర్ట్ అయిన తెలంగాణ
22-02-202122-02-2021 22:29:47 IST
2021-02-22T16:59:47.117Z22-02-2021 2021-02-22T16:59:41.111Z - - 04-03-2021

మహారాష్ట్రలో ప్రస్తుతానికి కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతూ ఉన్నాయి. కేసులు పెరుగుతుండడంతో అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అమరావతి, అకోలా, బుల్దానా, వాషిం, యావత్మాల్ జిల్లాలలో వారం రోజులపాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. నేటి రాత్రి నుంచి మార్చి 1 వరకు ఇది అమల్లో ఉంటుంది. నేటి నుంచి పూణె, నాసిక్ నగరాల్లో రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నారు. శుక్రవారం నాడు పరిస్థితిని సమీక్షించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారు. విద్యాసంస్థలను కూడా ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. గత రెండు వారాల్లో కేసులు 2,500 నుంచి ఏడు వేలకు పెరిగాయి. పరిస్థితి ఇలానే ఉంటే రాష్ట్ర వ్యాప్త లాక్‌డౌన్‌పై ఆలోచిస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. లాక్డౌన్ వద్దనుకుంటే కనుక ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని సీఎం హితవు పలికారు. రానున్న 8-15 రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇలానే పెరిగితే... ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని హెచ్చరించారు. మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్పారు. వైద్యశాఖ అధికారులను అలర్ట్ చేశామని.. మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న జిల్లాలపై దృష్టి సారించామని చెప్పారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచుతామని తెలిపారు. తెలంగాణలో మళ్లీ కేసులు పెరగలేదని.. ఇప్పటికైతే మళ్లీ కర్ఫ్యూ విధించాలనే ఆలోచన లేదని తెలిపారు. కరోనా ఉన్నంత కాలం ప్రజలంతా ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని.. తెలంగాణకు ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా డోసులు వచ్చాయని... దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి, 50 ఏళ్లు దాటిన వారికి త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పారు. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ రాష్ట్ర ప్రభుత్వాలను టెన్షన్ పెడుతూ ఉన్నాయి.

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
12 hours ago

హత్యకు కారణం అమెరికా ప్రయాణమే.. రెండు ప్రాణాలు బలి
14 hours ago

బార్స్ ఇస్తున్నయ్ ఆఫర్స్
03-03-2021

బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్
02-03-2021

కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్వాడీ కార్యకర్త మృతి
01-03-2021

సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.. జాన్సన్ అండ్ జాన్సన్ తీసుకుని వచ్చేసింది
28-02-2021

తిన్నంత బిర్యానీ.. 60 రూపాయలకే
28-02-2021

మార్చి నెలలో 8 రోజులు బ్యాంకులకు సెలవు
27-02-2021

గుండెపోటుతో ఇరాన్ మహిళా ఖైదీ మృతి.. అయినా మళ్లీ ఉరితీశారు.
25-02-2021

అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.. అయినా జనం ఏంటి ఇలా
25-02-2021
ఇంకా