newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం

26-07-202126-07-2021 09:32:53 IST
2021-07-26T04:02:53.356Z26-07-2021 2021-07-26T04:02:46.708Z - - 21-09-2021

మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, వారికి అండగా నిలుస్తూ తోచినంత సహాయం చేయడంలో ముందుంటున్నారు జాతీయ బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మురుగన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఏలూరి బాలచందర్ (భాను). తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన గుండు చండికాంబ మృతి చెందడంతో ఆదివారం ఆయన ప్రత్యేకంగా మృతురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారికి ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చి 5 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించారు. 

ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ తమ మురుగన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆలేరు నియోజక వర్గంలో ఉన్న ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఒక అంబులెన్స్ ని ఉచితంగా నడుపుతున్నట్లు తెలిపారు. త్వరలోనే రాజాపేట మండలానికి సైతం ఒక అంబులెన్స్ ని ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అలాగే యువత కి సైతం తానూ చేయూతని అందిస్తానని, వారి చదువు అర్హతని బట్టి ఉద్యోగ అవకాశాలని కల్పిస్తానని తెలిపారు. కాగా ఏమాత్రం లాభాపేక్ష లేకుండా ప్రజా సేవ చేస్తున్న ఏలూరి బాలచందర్ ని పలువురు అభినందించారు. 

అత్యున్నత మత సంస్థ అధిపతి నరేంద్ర గిరి ఆత్మహత్య

అత్యున్నత మత సంస్థ అధిపతి నరేంద్ర గిరి ఆత్మహత్య

   2 hours ago


ఇమ్మ్యూనిటిని పెంచే కొబ్బరి పాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

ఇమ్మ్యూనిటిని పెంచే కొబ్బరి పాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

   a day ago


హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు..

హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు..

   18-09-2021


సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

   17-09-2021


సైదాబాద్‌ చిన్నారి హత్య కేసు నిందితుడు రాజు ఆత్మహత్య

సైదాబాద్‌ చిన్నారి హత్య కేసు నిందితుడు రాజు ఆత్మహత్య

   16-09-2021


ఆ మానవ మృగం బయటెక్కడో ఉంది.. ఉండకూడదు

ఆ మానవ మృగం బయటెక్కడో ఉంది.. ఉండకూడదు

   16-09-2021


చిన్నారి కుటుంబసభ్యులను పరామర్శించిన పవన్ కల్యాణ్

చిన్నారి కుటుంబసభ్యులను పరామర్శించిన పవన్ కల్యాణ్

   15-09-2021


ముంబై బైకుల్లా జూ లో 2 పెంగ్విన్ పిల్లలు జన్మించారు

ముంబై బైకుల్లా జూ లో 2 పెంగ్విన్ పిల్లలు జన్మించారు

   15-09-2021


చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడి ఆచూకీ చెబితే పది లక్షల నజరానా..

చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడి ఆచూకీ చెబితే పది లక్షల నజరానా..

   14-09-2021


సుప్రీం కోర్టు మెట్లెక్కిన హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనోత్సవ వివాదం..

సుప్రీం కోర్టు మెట్లెక్కిన హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనోత్సవ వివాదం..

   14-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle