డ్రాగన్ ఫ్రూట్ బన్ గయా 'కమలం'
22-01-202122-01-2021 20:32:35 IST
Updated On 22-01-2021 12:44:26 ISTUpdated On 22-01-20212021-01-22T15:02:35.616Z22-01-2021 2021-01-22T07:10:59.670Z - 2021-01-22T07:14:26.487Z - 22-01-2021

భారత్-చైనా దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. బోర్డర్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందా అని టెన్షన్ పడడం మొదలైంది. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. భారత భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకొని వచ్చి అరుణాచల్ ప్రదేశ్‌లో ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించేసింది. శాటిలైట్ ద్వారా అందిన ఫొటోలు ఈ సంచలన విషయాన్ని బయటపెట్టాయి. గతేడాది నవంబర-1,2020న శాటిలైట్ ఈ ఫొటోలను తీసింది. చైనా నిర్మించిన గ్రామంలో 101 ఇళ్లు ఉన్నట్లు శాటిలైట్ ఫొటోలు తెలియజేస్తున్నాయి అరుణాచల్‌లోని సుబాన్సిరి జిల్లాలో తారిచు నది ఒడ్డున చైనా ఈ గ్రామాన్ని నిర్మించింది. ఇదే ప్రాంతంలో ఆగస్ట్ 26-2019న తీసిన మరో ఫొటోలో ఎలాంటి నిర్మాణాలు కనిపించక పోగా.. ఏడాదిలోపే చైనా ఇక్కడ గ్రామాన్ని నిర్మించింది. ఇలాంటి కారణాల వలన చైనాను భారతీయులు పెద్ద ఎత్తున తప్పుబడుతూ ఉన్నారు. చైనా వస్తువుల బహిష్కరణ కూడా మొదలైంది. తాజాగా గుజరాత్ ప్రభుత్వం ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. భారత మార్కెట్లో కనిపిస్తున్న విదేశీ పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి. ఇందులో పోషక విలువలు మెండుగా ఉంటాయన్న ఉద్దేశంతో ఆరోగ్య నిపుణులు వీటిని తినాలని సూచిస్తుండడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ పేరు చైనాను తలపించేలా ఉందంటూ గుజరాత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పండు కమలం పువ్వు ఆకారంలో ఉందంటూ 'కమలం' అని కొత్తగా నామకరణం చేసింది. రాష్ట్రంలో డ్రాగన్ ఫ్రూట్ ను కమలం అని పిలవాలని ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మాట్లాడుతూ, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. ఆ పండుకు డ్రాగన్ ఫ్రూట్ అనే చైనా సంబంధిత పేరు ఉండడం సమంజసంగా లేదని, అందుకే కమలం అనే సంస్కృత నామధేయాన్ని ఖరారు చేశామని చెప్పారు. మరో వైపు చైనాను అడ్డుకోవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొని వచ్చినా కూడా ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోవడం లేదని చెబుతూ ఉన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో అడ్డగోలుగా గ్రామాన్ని నిర్మించిన చైనా తన చర్యను సమర్థించుకున్నది. ‘మా సొంత భూభాగంలో నిర్మాణ కార్యకలాపాలు సాధారణమే' అంటూ చెప్పుకొచ్చింది. కేంద్రం అలసత్వం వల్లే చైనా చొరబడుతున్నదని ఆల్ అరుణాచల్ ప్రదేశ్ స్టూడెంట్స్ యూనియన్ విమర్శించింది.

27 ఏళ్ల తర్వాత రేప్ కేసు.. ఆమె అవసరం అలాంటిది
a day ago

మూడేళ్ల చిన్నారి కిడ్నాప్.. అత్త చెప్పిన రీజన్ వింటే తిట్టిపోస్తారు
07-03-2021

తాళి కట్టే టైంలో పెళ్లి ఆపిన వధువు..రీజన్ కాస్త విడ్డూరమే
07-03-2021

8 ఏళ్ల బాలుడ్ని మింగిన మొసలి.. పొట్టకోసి బయటికి తీశారు
06-03-2021

అదృష్టమంటే అతడిదే.. 24 కోట్ల రూపాయలు లాటరీలో సొంతం..!
06-03-2021

తిమింగలం కక్కుతో మారిన మహిళ తలరాత.. కోట్లు సొంతం
05-03-2021

రోడ్డుపై ఆగి ఊగుతున్న కారు.. లోపలున్న జంటకి ఫైన్
05-03-2021

హైదరాబాద్ కంటే.. కాకినాడ, కరీంనగర్ బెస్ట్ అట
05-03-2021

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
04-03-2021

హత్యకు కారణం అమెరికా ప్రయాణమే.. రెండు ప్రాణాలు బలి
04-03-2021
ఇంకా