newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

దివ్వెల దీపావళిని జాగ్రత్తగా జరుపుకుందాం..

14-11-202014-11-2020 08:32:56 IST
Updated On 14-11-2020 08:36:20 ISTUpdated On 14-11-20202020-11-14T03:02:56.605Z14-11-2020 2020-11-14T03:02:54.037Z - 2020-11-14T03:06:20.881Z - 14-11-2020

దివ్వెల దీపావళిని జాగ్రత్తగా జరుపుకుందాం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంద్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలు దీపావళి సందర్భంగా మామూలు పటాసులకు బదులుగా గ్రీన్ క్రాకర్స్‌ను కాల్చడానికి అనుమతించాయి. మొదట్లో పటాసుల వినియోగాన్ని, అమ్మకాన్ని పూర్తిగా నిషేధించినప్పటికీ ప్రజల నుంచి తీవ్ర నిరసన రావడంతో మధ్యేమార్గంగా దీపావళి రోజు గ్రీన్ క్రాకర్స్‌ను అమ్ముకోవచ్చని, వెలిగించుకోవచ్చని ప్రభుత్వాలు నిబంధనలను కాస్త సడలించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే శనివారం రాత్రి 8 గంటలనుంచి 10 గంటలవరకు మాత్రమే పటాసులు కాల్చుకోవచ్చని అనుమతించింది.

ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం కరోనా మహమ్మారి నేపథ్యంలో దీపావళి వేడుకలను జాగ్రత్తల నడుమ నిర్వహించుకోవాలని కోరుతోంది. దీపావళి అంటేనే టపాసుల సంబరం కావడంతో పర్యావరణ హితమైన గ్రీన్‌ క్రాకర్స్‌ను మాత్రం రెండు గంటల పాటు పరిమితంగా వినియోగించేందుకు అనుమతించింది. 

ఈ సమయంలో మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ పొరుగువారికి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలకు సూచిస్తోంది. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా మెలగాలని పౌరులకు విజ్ఞప్తి చేస్తోంది. వైరస్‌ వ్యాప్తికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ రోజు ప్రజలంతా ఆనందంగా గడిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సుప్రీం కోర్టు ఉత్తర్వులు, ఎన్జీటీ ఆదేశాల ప్రకారం టపాసులు కాల్చడాన్ని, బాణసంచా విక్రయాలను నిషేధించగా కొన్ని చోట్ల నియంత్రించాయి. తాజాగా తెలంగాణ హైకోర్టు కూడా ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. 

దీపావళి రోజు రెండు గంటలు పాటు బాణాసంచా వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అనుమతిలేని బాణాసంచా దుకాణాలు, టపాసుల వినియోగంపై అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్‌ తదితర శాఖలతో సమన్వయంతో పోలీస్‌ శాఖ చర్యలు చేపట్టింది. ఇష్టానుసారంగా తాత్కాలిక దుకాణాలకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయించింది. కాలుష్యం, కరోనా విస్తృతిపై ప్రజలకు అవగాహన పెంచడం ద్వారా స్వచ్చందంగా టపాసుల వినియోగాన్ని తగ్గించుకునేలా చర్యలు చేపట్టింది. 

ఇప్పటికే ఈ దిశగా పోలీస్‌ యంత్రాంగానికి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తగిన ఆదేశాలు ఇచ్చారు. నివాసాల మధ్య భద్రత లేని ప్రాంతాల్లో ఇష్టానుసారంగా టపాసులు విక్రయించకుండా చర్యలు చేపట్టారు. తాత్కాలిక దుకాణాలకు అనుమతులు ఇవ్వరాదని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. రిటైల్, హోల్‌సేల్‌ దుకాణాలు ఏర్పాటు చేసేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని స్థల యజమాని అంగీకారపత్రంతోపాటు అగ్నిమాపక నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. 

ఆంక్షలు ఎందుకు పాటించాలంటే..

శీతాకాలంలో వైరస్‌లు వేగంగా విస్తరించే ప్రమాదం ఉంది. ఈ సమయంలో టపాసులు పేల్చితే కాలుష్యం కారణంగా వైరస్‌ మరింత విస్తరించే ముప్పు ఉంది. వాయుకాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కరోనా బాధితులకు ఇది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ సహా కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో బాణసంచా కాల్చడం, విక్రయాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. 

నవంబరు 30 వరకు బాణాసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. క్రిస్మస్‌ సహా నూతన ఏడాది వేడుకల్లోనూ బాణాసంచా కాల్చేందుకు కేవలం రెండు గంటలు మాత్రమే అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఎన్జీటీ గతవారం 23 రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. 

ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా నవంబరు 10 నుంచి 30 వరకు టపాసులను నిషేధించడంపై ఎన్‌జీటీ చైర్మన్‌ ఆదర్శకుమార్‌ గోయల్‌ ధర్మాసనం రాష్ట్రాల స్పందన కోరింది.

కాలుష్యం నివారణకు బాణాసంచా వినియోగాన్ని నిషేధించాలంటూ కొందరు పర్యావరణ వేత్తలు 2018లో సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చుకునేలా అనుమతించింది. 

టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

   14 hours ago


నివర్ తుపాను ముప్పు తప్పింది.. ఇంకో వాయుగుండం మొదలుకానుంది

నివర్ తుపాను ముప్పు తప్పింది.. ఇంకో వాయుగుండం మొదలుకానుంది

   28-11-2020


ఇంకో రెండు తుపానులు ముంచుకు వస్తున్నాయి.. హెచ్చరించిన వాతావరణ శాఖ

ఇంకో రెండు తుపానులు ముంచుకు వస్తున్నాయి.. హెచ్చరించిన వాతావరణ శాఖ

   27-11-2020


శనివారం నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా

శనివారం నిర్వహించాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా

   27-11-2020


నివర్ తుపాను అప్డేట్.. తిరుపతి సమీపంలో వాయుగుండం

నివర్ తుపాను అప్డేట్.. తిరుపతి సమీపంలో వాయుగుండం

   27-11-2020


పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయిగా..!

పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతున్నాయిగా..!

   27-11-2020


ఏపీని వణికిస్తున్న నివర్..!

ఏపీని వణికిస్తున్న నివర్..!

   27-11-2020


సర్కారు బడిలో ఐఏఎస్ కొడుకు

సర్కారు బడిలో ఐఏఎస్ కొడుకు

   25-11-2020


చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోయింది..!

చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోయింది..!

   25-11-2020


హైదరాబాద్ కు పొంచి ఉన్న వర్షం ముప్పు

హైదరాబాద్ కు పొంచి ఉన్న వర్షం ముప్పు

   25-11-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle