newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స్కూళ్ల ప్లానే వేరు.. ఎంత‌న్నా విద్యావంతులు క‌దా

18-04-202118-04-2021 13:14:27 IST
2021-04-18T07:44:27.334Z18-04-2021 2021-04-18T03:04:30.704Z - - 15-05-2021

స్కూళ్ల ప్లానే వేరు.. ఎంత‌న్నా విద్యావంతులు క‌దా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

క‌ప్పు ముఖ్యం బిగిలూ అనే ఫేమ‌స్ డైలాగ్ ఉంది క‌దా. త‌మిళ్ విజ‌య్ విజిల్ సినిమాలో ఫేమ‌స్ డైలాగ్. అందులో తండ్రి పాత్ర కొడుకు పాత్ర‌తో అంటుంది. క‌ప్పు ముఖ్యం బిగిలూ అని. అలాగే.. తెలంగాణ‌లో స్కూల్స్ యాజ‌మాన్యాలు కూడా మేనేజ్ మెంట్ కి అదే చెబుతోందంట‌. అయితే.. ఇక్క‌డ ఫీజు ముఖ్యం సార్లూ అంటున్నార‌ట‌. వాళ్లేమో.. పిల్ల‌ల పేరేంట్స్ కి అదే డైలాగ్ ని కాస్త మార్చి చెబుతున్నారు. ఫీజు ముఖ్యం పేరెంట్సూ అంటున్నారు.

మ‌రి ఆ మాత్రం తెలివి తేట‌లు లేనిదే వాళ్లు విద్యావంతులు అయ్యారా.. స్కూల్స్ ఓపెన్ చేశారా. చిల్ల‌ర కొట్టుకంటే దారుణంగా బిజినెస్ లు చేస్తున్నారా అనే డైలాగ్ రానే వ‌స్తుంది క‌దా జ‌నం నుంచి. ఇప్పుడు ఆ డైలాగ్ కి కూడా త‌గ్గ‌ట్లే చేస్తున్నాయ‌ట విద్యాసంస్థ‌ల యాజ‌మాన్యాలు. అవ‌న్నీ కాదు. ముందు ఫీజు క‌డ‌తారా క‌ట్టరా అంటున్నార‌ట‌. మా పిల్ల‌లు ఇంట్ల‌నే ఉన్నారు క‌దా.. స్కూల్ కి రాలేదు క‌దా అంటే.. ఫీజు క‌డ‌తారా క‌ట్టరా అంటున్నార‌ట‌. ఎగ్జామ్స్ ర‌ద్దు చేశారు క‌దా అంటే కూడా.. ఫీజు క‌డ‌తారా లేదా అంటున్నార‌ట‌.

టెన్త్ ఎగ్జామ్స్ ర‌ద్దు చేశారు క‌దా అని స్కూల్స్ అంటే.. మీరు ఫీజు క‌ట్టాల్సిందే. లేదంటే.. ఇంట‌ర్న‌ల్ మార్కుల్ని బేస్ చేసుకునే క‌దా టెన్త్ పాస్ చేసేది. మేం మీ పిల్ల‌ల ఇంట‌ర్న‌ల్ మార్క్స్ పైకి పంపం. మీ పిల్ల‌లు పాస్ కారు. మీ పిల్ల‌లు  టెన్త్ క్లాస్ లో పాస్ కావాలి అంటే.. ఫీజు క‌ట్టాల్సిందే అంటున్నార‌ట‌.

ఇక పోతే.. టెన్త్ తో పాటు మిగ‌తా త‌ర‌గ‌తుల విద్యార్థుల్ని కూడా ఫీజు అడుగుతున్నార‌ట‌. అట్టా ఎట్టా అంటే.. ర‌ద్దు చేసింది.. టెన్త్ ఎగ్జామ్స్ మాత్ర‌మే క‌దా. మిగ‌తా త‌ర‌గ‌తుల‌కి ఎగ్జామ్స్ కండ‌క్ట్ చేస్తం. ఎగ్జామ్స్ న‌డిస్తేనే మీ పిల్ల‌లు పాస్ అయ్యి.. నెక్స్ట్ క్లాసుల‌కి ప్ర‌మోట్ అవుతారు. లేదంటే ఈ క‌రోనా ఎన్నేళ్లు ఉంటుందో తెలీదు. అప్ప‌టి దాకా.. మీ పిల్ల‌లు ఉన్న క్లాసులోనే ఉంటారు అని బెదిరిస్తున్నార‌ట‌. ఏది ఏమైనా స‌రే.. ముందు ఫీజు క‌ట్టండి  త‌ర్వాతనే డీటెయిల్స్ అడ‌గండి అని ద‌బాయిస్తున్నార‌ట‌. ఇప్పుడు ప్ర‌తి ఊళ్లోనూ ఇదే ఎవ్వారం హాట్ టాపిక్ అయింది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle