నివర్ తుపాను ముప్పు తప్పింది.. ఇంకో వాయుగుండం మొదలుకానుంది
28-11-202028-11-2020 15:40:59 IST
Updated On 28-11-2020 15:47:25 ISTUpdated On 28-11-20202020-11-28T10:10:59.192Z28-11-2020 2020-11-28T10:10:54.320Z - 2020-11-28T10:17:25.851Z - 28-11-2020

నివర్ తుపాను ముప్పు తప్పిందని ఆనందించే లోపే మరో అల్పపీడనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్, దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయట. ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఇది రాగల 48 గంటల్లో వాయుగుండంగా, ఆపై మరింత బలపడి తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. ఇది పశ్చిమ దిశగా పయనించి డిసెంబరు 2 నాటికి దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకుతుందని చెబుతున్నారు. ఈ తుపాను ప్రభావంతో డిసెంబరు 1, 2 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్, దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో చెదురు మదురు వానలు కురుస్తాయని, అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇటీవలే నివర్ తుపాను ముప్పు తప్పగా.. మరో రెండు తుపానులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. ఇది బలపడి డిసెంబరు 2న తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీన్ని 'బురేవి' అని తుపానుగా నామకరణం చేసే అవకాశం ఉంది. ఇది తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనుంది. మధ్య బంగాళాఖాతంలో డిసెంబరు 5న ఏర్పడే అల్పపీడనం బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారితే దాన్ని 'టకేటి' అని పిలవచ్చు. టకేటి ప్రభావంతో డిసెంబరు 7న దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

పిడకలు అమ్మడం, రేటు కాదు.. దాని రివ్యూ ఇంట్రస్టింగ్
an hour ago

మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!
20-01-2021

అత్తకు గుడి కట్టిన కోడళ్ళు.. ప్రతి నెలా భజనలు, కీర్తనలు
20-01-2021

కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!
18-01-2021

అవినీతి కేసులో సీబీఐ అధికారుల సస్పెండ్..
17-01-2021

ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి
17-01-2021

టీకా వికటిస్తే మాదే బాధ్యత.. పైసా పైసా కట్టేస్తాం
17-01-2021

ఢిల్లీలో 13 ఏళ్ల బాలుడికి హిజ్రాగా శస్త్రచికిత్స..
16-01-2021

తొలి వ్యాక్సిన్ పండగ.. మంత్రి ఈటెలకు నేడే
16-01-2021

ఆన్ లైనా.. ఆఫ్ లైనా.. ఏది బెటర్
15-01-2021
ఇంకా