డబ్బు ముక్కి ముక్కి చెదలు పట్టింది
17-02-202117-02-2021 15:32:12 IST
Updated On 17-02-2021 10:16:06 ISTUpdated On 17-02-20212021-02-17T10:02:12.793Z17-02-2021 2021-02-17T02:29:20.309Z - 2021-02-17T04:46:06.890Z - 17-02-2021

వాళ్ల దగ్గర కాసిన్ని డబ్బులు లేవు. అసలు ఎన్ని డబ్బులున్నయ్ లెక్కే లేదు. డబ్బు బీరువాల్లో ముక్కుతోందంట. పెట్టెల్లో చెదలు పడుతోందంట.. అంటూ అంటుంటాం.. వింటుంటాం కదా.. ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. అయితే.. ఇక్కడ కోట్లకి కోట్ల డబ్బు అయితే కాదు కానీ.. లక్షలకి లక్షల డబ్బు అయితే.. ఎగ్జాక్ట్ గా అందరూ అనుకున్నట్లే జరిగింది. లక్షలకి లక్షల డబ్బు.. ముక్కి ముక్కి మూలిగింది. ఊపిరాడక నీలిగింది. చివరికి ట్రంకు పెట్టెలో మగ్గీ మగ్గీ చెదలు పట్టింది. పాపం ఇప్పుడా డబ్బుల ఓనర్ ముఖ చిత్రం చూస్తే.. ఎలా ఉందో ఏమో కానీ.. డబ్బుల ముఖ చిత్రం చూస్తే మాత్రం.. ఓస్.. డబ్బు పరిస్థితి కూడా ఇదేనా. డబ్బంటే పెద్ద ఇదేం కాదు కదా. అన్ని కాయితాల్లాగే.. కరెన్సీ కూడా ఆఫ్ట్రాల్ కాయితాలే. లేదంటే.. మనమేదో అంత విలువ ఇస్తున్నాం తప్ప.. ఇవి కూడా మామూలు కాయితాలే కదా. ఇలా చెదలు పట్టాయి అంటే.. అంతకు మించి ఏముంది అనే ఫీలింగ్ అయితే కలగక తప్పదు. కొంతమంది మాత్రం.. పాపం ఆ ఓనర్ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తారు. కొంతమందేమో.. హయ్యో.. హయ్యో.. ఎంత డబ్బు చెదలు పట్టింది అని గుండెలు బాదుకుంటారు. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్లది.. అంతకు మించి ఎవరినీ ఏమీ అనడానికి వీళ్లేదు. మరి ఇంతకీ ఈ డబ్బు ఎవరిది.. ఎందుకు చెదలు పట్టింది అని ఆలోచిస్తున్నారా. ఎక్కడో కాదండీ.. మన క్రిష్ణాజిల్లా మైలవరం గ్రామానికి చెందిన జలమయ్య అనే పెద్దాయనది ఈ డబ్బు. పాపం తను కూడా పేద ఫ్యామిలీనే. కానీ.. రూపాయి రూపాయి పోగేసుకుని.. బ్యాంకుల్లో దాచుకోవాలి అనే అవగాహన లేక.. ఆ ఎవ్వారాలు పెద్దగా తెలీక.. ఇంత కష్టపడి దాచుకున్న సొమ్ము.. బ్యాంకుల్లో పెడితే ఏమై పోతుందో అనే భయంతో.. ఇంట్లోనే దాచుకున్నాడు. మాంసం షాప్ నడుపుకుంటూ ఖర్చులు పోను మిగిలిన ప్రతి రూపాయినీ దాచుకునే వాడు జలమయ్య. ఇప్పుడు ఉండేది రేకుల షెడ్డు కావడంతో.. డబ్బు పోగేసుకుని.. పది లక్షలు చేసుకుని.. మంచి ఇల్లు కట్టుకోవాలి అనేది ఆయన చిరకాల కోరిక. రెండేళ్ల నుంచి 5 లక్షలు దాచి పెట్టాడు. కానీ.. ఏదో పనుండి లక్ష రూపాయలు కావాల్సి వచ్చి.. ఆ ట్రంకు పెట్టె తీసి చూస్తే.. ఇదీ పరిస్థితి. మొత్తం చెదలు పట్టింది. చెదలు పట్టడం కాదు.. చెదలు తినేసింది. అక్షరాల 5 లక్షల రూపాయలు వేస్ట్ అయ్యాయి. వందా, ఐదొందలు,, పది ఇరవై అన్ని రకాల నోట్లనీ తినేసింది చెదలు. ఆయన బాధ వర్ణనాతీతం అంటే నమ్మండి.

గుండెపోటుతో ఇరాన్ మహిళా ఖైదీ మృతి.. అయినా మళ్లీ ఉరితీశారు.
25-02-2021

అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.. అయినా జనం ఏంటి ఇలా
25-02-2021

Ghatkesar: కిడ్నాప్ నాటకమాడిన ఘట్కేసర్ బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
24-02-2021

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి.. కేసులో స్కూటీ యజమాని అరెస్ట్
23-02-2021

మూడేళ్ల తర్వాత వచ్చిన భర్త.. భార్యకి ఐదునెలల గర్భం
23-02-2021

ప్రతి పిల్లా చెల్లాయే అనే అనుమానంతో.. డేటింగ్ కి దూరం
23-02-2021

కరోనా సెకండ్ వేవ్ టెన్షన్.. అలర్ట్ అయిన తెలంగాణ
22-02-2021

గన్నవరంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న విమానం..
20-02-2021

ట్రాన్స్ జెండర్లతో ప్రాబ్లమా.. ఈ నెంబర్ కి కాల్ కొట్టండి- సీపీ సజ్జనార్
20-02-2021

ఒక్క ఏడాదిలో అంతమంది హైదరాబాద్ లో ప్రాణాలు కోల్పోయారా
19-02-2021
ఇంకా