newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాటి కాపరికి 9 మంది భార్య‌లు.. ఆస్తి కోసం కాప‌రిపై హ‌త్యాయ‌త్నం

14-04-202114-04-2021 14:11:40 IST
Updated On 16-04-2021 16:10:07 ISTUpdated On 16-04-20212021-04-14T08:41:40.117Z14-04-2021 2021-04-14T08:41:09.507Z - 2021-04-16T10:40:07.872Z - 16-04-2021

కాటి కాపరికి 9 మంది భార్య‌లు.. ఆస్తి కోసం కాప‌రిపై హ‌త్యాయ‌త్నం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏంది.. కాటి కాప‌రికి తొమ్మిది మంది భార్య‌లా. ఈ రోజుల్లో ఉద్యోగాలు.. ఎక‌రాల‌కి ఎక‌రాలు ఉన్న వారికి కూడా పెళ్లిళ్లు కాక‌.. పిల్ల‌లు దొర‌క్క‌.. 40 ఏళ్లు దాకా వెయిట్ చేసి.. ఎవ‌రో ఒక‌రు లే అని చేసుకుంటూ.. ముదురు బెండ‌కాయ‌లుగా మారిపోతున్న వాళ్లు ఎంతో మంది. కొన్ని సామాజిక వ‌ర్గాల్లో అయితే.. మ‌రీ దారుణంగా ఉంది ప‌రిస్థితి. క‌న్యాశుల్కం ఇచ్చి మ‌రీ చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి వార్త వింటే ఎంత విడ్డూరంగా ఉంటుందో తెలిసిందే క‌దా. పైగా కాటి కాప‌రి ఆస్తికోసం.. కాటి కాప‌రిపైనే హ‌త్యాయ‌త్నం చేశారు అంటే న‌మ్మేలా ఉందా ఎవ్వారం. న‌మ్మాలి మ‌రి. ఎందుకంటే ఆయ‌న‌కి తొమ్మిది  మంది భార్య‌లే కాదు. 14 మంది పిల్లలు కూడా ఉన్నారు మ‌రి. 

చిత్తూరు జిల్లా మ‌ద‌న ప‌ల్లెలో కుందాన  భాస్క‌ర్ అనే ఫేమ‌స్ ప‌ర్స‌న్ ఉన్నాడు. లోక‌ల్ గా త‌ను ఫేమ‌స్. ఎవ‌రు చ‌చ్చినా.. ఆయ‌న అక్క‌డ ఉండాల్సిందే. ఆయ‌నే చ‌నిపోయిన వారిని ద‌హ‌నం చేస్తుంటాడు. వాళ్లిచ్చిన డ‌బ్బుల‌తోనే బ‌తుకుతుంటాడు. బ‌త‌క‌లేని రోజు.. ఏదో ఒక ప‌ని చేసుకుంటాడు. అదే త‌న ప‌ని. ఇంకా ముఖ్య‌మైన ప‌ని ఏంద‌య్యా అంటే పెళ్లిళ్లు చేసుకోవ‌డం. పెళ్లి చేసుకోవ‌డం కొన్నాళ్ల‌కి వ‌దిలేయ‌డం ఇలా అత‌ను బాగా ఫేమ‌స్ అయ్యాడు. త‌ర్వాత  త‌ర్వాత 8వ భార్య‌ని హ‌త్య చేసి జైలుకి కూడా వెళ్లొచ్చాడు. అప్పుడు కూడా ఓ పెళ్లి చేసుకున్నాడు. మొత్తం తొమ్మిది మంది పెళ్లాలు. ప్ర‌స్తుతం తొమ్మిదో భార్య ద‌గ్గ‌ర ఉంటున్నాడు.

ముగ్గురి ల‌వ్వూ ఒకే అమ్మాయి.. గ్రౌండ్ లో తేల్చుకున్నారు

అయితే.. ఆయ‌న‌కు 8 సెంట్ల ఆస్తి ఉందంట‌. మ‌రి పిల్ల‌లు 14 మంది ఉన్నారు క‌దా. సో.. వాటా కోసం రెండో భార్య కొడుకు డిమాండ్ చేశాడ‌ట‌. అయితే ఆయ‌న ప‌ట్టించుకోలేద‌ట‌. లెక్క చేయ‌లేద‌ట‌. అదే ఆయ‌న ప్రాణం మీదికి తెచ్చింది. అయితే ఇదే విష‌యంపై మాట్లాడేందుకు మ‌ద‌న‌ప‌ల్లె వెళ్లాడ‌ట తండ్రి. త‌న పాత ఇంట్లో ఉన్న తండ్రి విష‌యం తెలిసిన 2వ భార్య కుమారుడు నిల‌దీయ‌డానికి వెళ్లాడు. గొడ‌వ అయింది. అంతే.. క‌త్తితో గొంతు కోశాడు. తండ్రి చ‌నిపోయాడు అని కొడుకు.. కొడుకు ఫ్రెండ్స్ పారిపోయారు. కానీ.. ఆ ద‌గ్గ‌రి ఏరియాలోనే ఉన్న మ‌రో భార్య కొడుకు వ‌చ్చి.. కాపాడాడు. హ‌త్య చేయ‌బోయిన రెండో భార్య కొడుకు మాత్రం ప‌రారీలో ఉన్నాడు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle