newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

త‌న వీర్యంతో త‌నే గ‌ర్భం దాల్చి.. త‌నే క‌న‌బోతున్న మ‌నిషి

19-02-202119-02-2021 10:12:16 IST
Updated On 18-02-2021 16:48:02 ISTUpdated On 18-02-20212021-02-19T04:42:16.997Z18-02-2021 2021-02-18T11:14:44.381Z - 2021-02-18T11:18:02.814Z - 18-02-2021

త‌న వీర్యంతో త‌నే గ‌ర్భం దాల్చి.. త‌నే క‌న‌బోతున్న మ‌నిషి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆక్ ఈజ్ పాక్.. పాక్ ఈజ్ ఆక్ అన్న‌ట్లే.. ఇదేదో పులిహోర వార్త కాదు. ఇది కాస్త క్రేజీ న్యూసే అంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. ఏందేందీ.. త‌న వీర్యంతో త‌నే గ‌ర్భం దాల్చ‌డం ఎక్క‌డైనా కుదురుతుందా. త‌న వీర్యంతో త‌నే గ‌ర్భం దాల్చి.. త‌నే క‌న‌డం అంటే.. ఇంపాజిబుల్.. ఇట్స్ య‌న్ ఇంపాజిబుల్.. నేను బ‌ల్ల‌గుద్ది చెబుతా.. నా ఆస్తి మొత్తం పందెం కాస్తా అంటారు జ‌నాలు. కానీ.. ట్వంటీ ట్వంటీ త‌ర్వాత అన్నీ న‌మ్మాలి. ఇది కూడా అలాగే న‌మ్మాలి. ఎందుకంటే.. ఇది ప‌చ్చి నిజం కాబ‌ట్టి.. అట్టెట్టా అంటారా. 

సింపుల్ అండీ.. ఇది ఓ ట్రాన్స్ జెండ‌ర్ స్టోరీ. గుజ‌రాత్ లోని గోద్రా అనే గ్రామంలోని.. డాక్ట‌ర్ జెస్నూర్ ద‌యారా స్టోరీ ఇది. జెస్నూర్ ద‌యారా అంటే.. ఆడ మ‌నిషా మ‌గ మ‌నిషా అనే విష‌యం మ‌న‌కి వెంట‌నే పేరు చూసి అర్దం కాదు. కానీ.. క్లారిటీ తెచ్చుకోక‌పోతే.. నిజంగా కూడా అర్దం కాదు. ఎందుకంటే.. త‌ను ఓ ఆడ‌.. త‌ను ఓ మ‌గ కాబ‌ట్టి.. మ‌నం ఎటూ తేల్చ‌లేం. ఎందుకంటే.. జెస్నూర్ పుట్టుక‌తోనే మ‌గ‌.. అన్నీ మ‌గ‌ల‌క్ష‌ణాలున్న‌య్ అంతా ఓకే. డాక్ట‌ర్ కోర్స్ కూడా చ‌దువుకున్నాడు.. రాన్ రానూ.. త‌న‌లోని ఆడ‌ల‌క్ష‌ణాలు త‌న‌కి తెలుస్తున్నాయి. స‌మ్ థింగ్ ఏదో జ‌ర‌గ‌బోతుంది.. త‌న శ‌రీర త‌త్వంలో ఏం మార్పులు జ‌ర‌గ‌బోతున్నాయో తెలుసుకున్నాడు. త‌ను మ‌గ నుంచి ఆడ వారిగా మార‌బోతున్నాను అని క్లారిటీ తెచ్చుకున్నాడు. త‌ను ఎలాగూ డాక్ట‌రే క‌దా.. ఇంకా క్లారిటీస్ వ‌చ్చిన‌య్. అందుకే.. త‌న బిడ్డ‌కి త‌నే జ‌న్మ‌నివ్వాలి అని ఫిక్స్ అయ్యాడు.. జెస్నూర్. ఇంకేముంది చెప్పండి. అంతా అర్దం అయ్యే ఉంటుంది క‌దా.

త‌ను ఎలాగూ డాక్ట‌ర్ కాబ‌ట్టి.. అప్పుడు త‌ను మ‌గ కాబ‌ట్టి.. త‌న వీర్యం తీసుకుని స్టోర్ చేసుకున్నాడు జెస్నూర్. త‌ను ఎలాగూ.. ఆడ మ‌నిషిగా మార‌బోతున్నాడు కాబ‌ట్టి.. ట్రాన్స్ జెండ‌ర్ గా మారాడు జెస్నూర్. ఇప్పుడు అత‌ను.. ఆమె అయ్యారు. అత‌నుగా ఉన్న‌ప్పుడు తీసి దాచుకున్న వీర్యాన్ని.. ఆమెగా మారిన త‌ర్వాత‌.. త‌న‌లోకి ప్ర‌వేశింప‌జేసుకున్నారు జెస్నూర్. అంతే ఇక‌.. ఇప్పుడు జెస్నూర్ గ‌ర్భంతో ఉన్నారు.. త్వ‌ర‌లోనే.. మ‌నం ముందుగా చెప్పుకున్న‌ట్లు.. త‌న వీర్యంతో.. త‌నే గ‌ర్భం దాల్చి.. త‌నే కన‌బోతున్నారు జెస్నూర్. జింగ్ జింగ్ ఇది అమేజింగ్ క‌దా. అంతే మరి.

8 ఏళ్ల బాలుడ్ని మింగిన మొసలి.. పొట్ట‌కోసి బ‌య‌టికి తీశారు

8 ఏళ్ల బాలుడ్ని మింగిన మొసలి.. పొట్ట‌కోసి బ‌య‌టికి తీశారు

   9 hours ago


అదృష్టమంటే అతడిదే.. 24 కోట్ల రూపాయలు లాటరీలో సొంతం..!

అదృష్టమంటే అతడిదే.. 24 కోట్ల రూపాయలు లాటరీలో సొంతం..!

   11 hours ago


తిమింగలం కక్కుతో మారిన మహిళ తలరాత.. కోట్లు సొంతం

తిమింగలం కక్కుతో మారిన మహిళ తలరాత.. కోట్లు సొంతం

   05-03-2021


రోడ్డుపై ఆగి ఊగుతున్న కారు.. లోప‌లున్న జంట‌కి ఫైన్

రోడ్డుపై ఆగి ఊగుతున్న కారు.. లోప‌లున్న జంట‌కి ఫైన్

   05-03-2021


హైద‌రాబాద్ కంటే.. కాకినాడ‌, కరీంన‌గ‌ర్ బెస్ట్ అట‌

హైద‌రాబాద్ కంటే.. కాకినాడ‌, కరీంన‌గ‌ర్ బెస్ట్ అట‌

   05-03-2021


కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

   04-03-2021


హ‌త్య‌కు కార‌ణం అమెరికా ప్ర‌యాణమే.. రెండు ప్రాణాలు బ‌లి

హ‌త్య‌కు కార‌ణం అమెరికా ప్ర‌యాణమే.. రెండు ప్రాణాలు బ‌లి

   04-03-2021


బార్స్ ఇస్తున్న‌య్ ఆఫ‌ర్స్

బార్స్ ఇస్తున్న‌య్ ఆఫ‌ర్స్

   03-03-2021


బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్

బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్

   02-03-2021


కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి

కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి

   01-03-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle