newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

37 రోజుల్లో ఒకే అమ్మాయితో 3 విడాకులు..4 పెళ్లిళ్లు, 5వ పెళ్లికి ట్విస్ట్

15-04-202115-04-2021 10:30:10 IST
Updated On 15-04-2021 11:34:12 ISTUpdated On 15-04-20212021-04-15T05:00:10.733Z15-04-2021 2021-04-15T04:59:17.845Z - 2021-04-15T06:04:12.136Z - 15-04-2021

37 రోజుల్లో ఒకే అమ్మాయితో 3 విడాకులు..4 పెళ్లిళ్లు, 5వ పెళ్లికి ట్విస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏందిరా అయ్యా..  ఇదేమ‌న్నా ఇదా.  37 రోజుల్లో 4 పెళ్లిళ్లు చేసుకోవ‌డం అంటే మామూలు విష‌య‌మా చెప్పండి. పైగా మూడు విడాకులు. నాలుగోసారి కూడా విడాకులు తీసుకోవాల‌ని.. ఐదో పెళ్లికి రెడీ అవుతుంటే అంతా అడ్డం తిరిగిందా. ఇదేం క‌త‌రా బాబూ అనుకుంటాం. అట్టెట్టా విడాకులిస్తారు అనే డౌట్ కూడా వ‌స్తుంది. బ‌ట్ ఇట్స్ నాట్ అబౌట్ ఇండియన్ లా. ఇట్స్ అబౌట్ తైవాన్ లా.. సో.. ఆశ్చ‌ర్య‌పోవాల్సింది ఏమీ లేదు.

ఇందులో కూడా ఓ విడ్డూరం ఉంది. మూడు సార్లు విడాకులు తీసుకుని.. నాలుగు సార్లు పెళ్లి చేసుకుంది కూడా ఒకే అమ్మాయి. పెళ్లి చేసుకున్న అమ్మాయికి 8 రోజుల్లో విడాకులు ఇచ్చి.. మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిది రోజుల గ్యాప్ లో మ‌ళ్లీ విడాకులిచ్చి.. మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నాడు. వెంట‌నే 8 రోజుల త‌ర్వాత మ‌ళ్లీ విడాకులిచ్చాడు. వెంట‌నే పెళ్లి చేసుకున్నాడు. ఇలా మూడు సార్లు విడాకులిచ్చి.. నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు. అదే అమ్మాయికి మ‌ళ్లీ విడాకులిచ్చి.. ఐదోసారి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ముందే ప్రిపేర్ అయ్యాడు. కానీ.. ఇక్క‌డో ట్విస్ట్ ఎదురైంది.

ఓ మొగుడు..ఇద్ద‌రు ప్రియులు..బావిలో శవం

తైవాన్ చ‌ట్టం ప్ర‌కారం. పెళ్లి చేసుకున్న వారు ఇద్ద‌రూ ఒప్పుకుంటే విడాకులు వెంట‌నే ఇస్తారు. అలాగే.. పెళ్లి చేసుకున్న వారికి 8 రోజులు పెయిడ్ లీవ్స్ ఇవ్వాలి. అంటే.. 8 రోజులు సెల‌వులు ఇచ్చి.. శాల‌రీ కూడా ఇవ్వాలి అన్న‌మాట‌. అత‌నికి అదే పాయింట్ న‌చ్చింది. పెళ్లి చేసుకుని 8 రోజులు ఎంజాయ్ చేశాడు. జాలీగా తిరిగొచ్చారు. వెంట‌నే సెల‌వులు అయిపోయాయి. ఇంకేం చేయాలో అర్దం కాక‌.. వెంట‌నే విడాకులు తీసుకుని.. మ‌ళ్లీ పెళ్లి చేసుకుని 8 రోజులు సెల‌వుల‌కి అప్లై చేశాడు. మ‌ళ్లీ సెల‌వులు ఇచ్చారు. ఇలా మూడు సార్లు విడాకులు తీసుకుని.. నాలుగు సార్లు అదే అమ్మాయిని పెళ్లి చేసుకుని.. జాలీగా హనీమూన్ ఎంజాయ్ చేశారు. త‌ను పెళ్లి ప‌ని చేస్తున్న బ్యాంకు వారికి కోపం రావ‌డం స్టార్ట్ అయింది. 

ఇక నాలుగోసారి విడాకులు తీసుకుని.. ఐదో సారి పెళ్లి చేసుకోవాల‌ని బ్యాంకుకి సెల‌వుల కోసం అప్లై చేశాడు. బ్యాంకుకి కోపం పెరిగింది. మేం సెల‌వులు ఇవ్వం పో అన్నారు. వెంట‌నే ఈ నిత్య పెళ్లికొడుకు లేబ‌ర్ బ్యూరోని ఆశ్రయించాడు. అదేంట‌య్యా.. అత‌ను రూల్స్ ప్ర‌కారం విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటే ప్రాబ్ల‌మ్ ఏంటి సెల‌వులు ఇవ్వాల్సిందే అనేసింది లేబ‌ర్ బ్యూరో. సెల‌వుల టైంలో శాల‌రీ కూడా ఇవ్వాలి అని చెప్పింది. దీంతో బ్యాంకుకి ఇంకా కోపం పెరిగింది. కోర్టుకెళ్లారు బ్యాంకు వాళ్లు. బ్యాంకు కూడా అదే చెప్పింది. సెల‌వులు ఇవ్వాల్సిందే.. శాల‌రీ ఇవ్వాల్సిందే అని డిసైడ్ చేసింది కోర్టు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle