newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

ట్రాన్స్ జెండ‌ర్ల‌తో ప్రాబ్ల‌మా.. ఈ నెంబ‌ర్ కి కాల్ కొట్టండి- సీపీ స‌జ్జ‌నార్

20-02-202120-02-2021 16:50:33 IST
Updated On 20-02-2021 11:27:35 ISTUpdated On 20-02-20212021-02-20T11:20:33.840Z20-02-2021 2021-02-20T04:58:12.380Z - 2021-02-20T05:57:35.366Z - 20-02-2021

ట్రాన్స్ జెండ‌ర్ల‌తో ప్రాబ్ల‌మా.. ఈ నెంబ‌ర్ కి కాల్ కొట్టండి- సీపీ స‌జ్జ‌నార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ట్రాన్స్ జెండ‌ర్లు అంటే.. పాపం ఏం ప‌నీ దొర‌క‌దాయే.. వాళ్లు మాత్రం ఎలా బ‌త‌కాలి.. ఎవ‌రికి చేత‌నైనంత వారు సాయం చేస్తే.. ట్రాన్స్ జెండ‌ర్లు కూడా వారి బ‌తుకు వారు బ‌తుకుతారు క‌దా. అవమానంగా బ‌తికే వారిని ఆదుకోవాలి క‌దా అనేది జ‌నంలో ఇంటెన్ష‌న్. కాక‌పోతే ఇది ఒక‌ప్ప‌టి మాట‌. కానీ.. ఇప్పుడు అలా కాదు క‌దా. వామ్మో ట్రాన్స్ జెండ‌ర్లు అనుకుంటున్నారు. అప్ప‌ట్లో కాస్త అవమాన‌క‌రంగా దూరం చేసే జ‌నాలు.. ఇప్పుడు భ‌యంతో ప‌రుగులు తీస్తున్నారు. వాళ్ల‌ని దూరం చేసే రోజులు పోయి.. వీళ్లు దూరంగా పారిపోయే టైం వ‌చ్చింది.

ఇలాంటి ఘ‌ట‌న‌లు ప్ర‌తి ఒక్క‌రూ ఫేస్ చేస్తూనే ఉంటారు. వారి హ‌డావిడి కాస్త లిమిట్స్ దాట‌డంతో.. జ‌నాలు భ‌య‌ప‌డే రోజులు వ‌చ్చాయి. అయితే.. ఇక రోడ్ల‌పై న‌లుగురు ట్రాన్స్ జెండ‌ర్లు క‌లిస్తే జ‌రిగే ర‌చ్చ గురించి కూడా అంద‌రికీ తెలిసిందే క‌దా. వాళ్లూ వాళ్లూ గొడ‌వ ప‌డితే.. అక్క‌డ ర‌ణ‌రంగ‌మే. అడ్డుకునే ద‌మ్ము కూడా ఎవ‌రికీ ఉండ‌దు. పోలీసులు కూడా రిస్క్ త‌ప్ప‌దు అని తెలిసే మూవ్ అవుతారు. బోర్డ‌ర్ ఏరియాల్లో ఈ మ‌ధ్య గొడ‌వ‌లు ఎక్కువ‌య్యాయి క‌దా. సిటీలో కూడా.. ఇంతే. మీ ఏరియా మా ఏరియా అంటూ పంచుకుంటూ.. జ‌నాల్ని భ‌య‌పెడుతుంటారు. ఆ ఏరియా వాళ్లు ఈ ఏరియాలోకి వ‌చ్చినా.. ఈ ఏరియా వాళ్లు ఆ ఏరియాలోకి పోయినా అక్క‌డ గొడ‌వ‌లు త‌ప్ప‌వు.. జ‌నం భ‌య‌ప‌డకా త‌ప్ప‌దు. హైద‌రాబాద్ లో ఇలాంటి ఘ‌ట‌నలు ఎప్పుడూ జ‌రుగుతూనే ఉంటాయి.

అందుకే.. సీపీ స‌జ్జ‌నార్ వారితో ప్ర‌త్యేకంగా మీట్ అయ్యారు. వారి లీడ‌ర్ల‌ని.. యాక్టివ్ గా లీడ్ చేసే వారిని ఇన్వైట్ చేశారు. ఏంటి ప‌రిస్థితి ఎలా ఉన్నారు.. అంతా మంచిగానే ఉన్నారా.. గొడ‌వ‌లు ఏమైనా జ‌రుగుతున్నాయా.. ప్రాబ్ల‌మ్స్ ఏమైనా ఉన్నాయా.. మాకు చెప్పండి మేం చూసుకుంటాం అన్నారు సీపీ స‌జ్జ‌నార్. అంతే కాదు. మీరు కూడా జ‌నాన్ని  ఇబ్బంది పెట్ట‌కండి.. ఇబ్బంది పెడితే మీపై కూడా చ‌ర్య‌లు సీరియ‌స్ గానే ఉంటాయి అని వార్న్ చేశారు. ఒక వేళ జ‌నాన్ని ట్రాన్స్ జెండ‌ర్లు ఇబ్బంది పెడితే.. 100 నెంబ‌ర్ కు డ‌య‌ల్ చేయ‌మ‌ని చెప్పారు సీపీ స‌జ్జ‌నార్. అలాగే.. 9490617444 నెంబ‌ర్ కు వాట్సాప్ ద్వారా తెల‌పాలి అని ప్ర‌జ‌ల్ని రిక్వ‌స్ట్ చేశారు సీపీ స‌జ్జ‌నార్. ట్రాన్స్ జెండ‌ర్ల‌తో ప్ర‌జ‌ల‌కు వ‌చ్చే స‌మస్య‌ల కోసం ప్ర‌త్యేక డెస్క్ ఏర్పాటు చేశారు.

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

   12 hours ago


హ‌త్య‌కు కార‌ణం అమెరికా ప్ర‌యాణమే.. రెండు ప్రాణాలు బ‌లి

హ‌త్య‌కు కార‌ణం అమెరికా ప్ర‌యాణమే.. రెండు ప్రాణాలు బ‌లి

   14 hours ago


బార్స్ ఇస్తున్న‌య్ ఆఫ‌ర్స్

బార్స్ ఇస్తున్న‌య్ ఆఫ‌ర్స్

   03-03-2021


బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్

బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్

   02-03-2021


కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి

కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి

   01-03-2021


సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.. జాన్సన్ అండ్ జాన్సన్ తీసుకుని వచ్చేసింది

సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.. జాన్సన్ అండ్ జాన్సన్ తీసుకుని వచ్చేసింది

   28-02-2021


తిన్నంత బిర్యానీ.. 60 రూపాయ‌ల‌కే

తిన్నంత బిర్యానీ.. 60 రూపాయ‌ల‌కే

   28-02-2021


మార్చి నెలలో 8 రోజులు బ్యాంకులకు సెలవు

మార్చి నెలలో 8 రోజులు బ్యాంకులకు సెలవు

   27-02-2021


గుండెపోటుతో ఇరాన్ మహిళా ఖైదీ మృతి.. అయినా మళ్లీ ఉరితీశారు.

గుండెపోటుతో ఇరాన్ మహిళా ఖైదీ మృతి.. అయినా మళ్లీ ఉరితీశారు.

   25-02-2021


అమ్మాయి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.. అయినా జ‌నం ఏంటి ఇలా

అమ్మాయి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.. అయినా జ‌నం ఏంటి ఇలా

   25-02-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle