మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!
20-01-202120-01-2021 13:20:16 IST
Updated On 20-01-2021 13:50:06 ISTUpdated On 20-01-20212021-01-20T07:50:16.642Z20-01-2021 2021-01-20T07:50:11.447Z - 2021-01-20T08:20:06.002Z - 20-01-2021

భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం మొదలైంది. కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్స్ట్స్ విషయంలో కూడా జాగ్రత్తలు చెబుతూ ఉన్నారు. ఇక కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే మందుబాబులు కొద్దిరోజులు ముందుకు దూరమవ్వాల్సిందేనట..! కోవిడ్ టీకా తీసుకోవాలనుకునే వారు 45 రోజుల పాటు మద్యం తీసుకోకూడదని సూచించారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుందని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని భావిస్తున్న వారు కొన్ని వారాల పాటు మద్యానికి దూరంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. నేషనల్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ సుదర్శన్ మాట్లాడుతూ ముప్పై రోజుల వ్యవధిలో టీకా రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుందని.. సెకండ్ డోస్ తీసుకున్న రెండు వారాల తర్వాతనే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మద్యం సేవిస్తే అది రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనకు ఆటంకం కలిగిస్తుందని అన్నారు. అలాగని ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం వ్యాక్సిన్ పూర్తి ప్రయోజనాలు పొందాలంటే మద్యానికి దూరంగా ఉండాలని తెలిపారు. సెకండ్ డోస్ తీసుకున్న రెండు వారాల తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయని ఆధారాలు ఉన్నాయని.. టీకా తీసుకోవాలనుకునే వారు.. ఇప్పటికే తీసుకున్న వారు 45 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండటం మంచిదని చెబుతూ ఉన్నారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు కొందరు వైద్యసిబ్బంది వెనకడుగు వేస్తుండటంపై కేంద్రం స్పందించింది. టీకా గురించి భయపడాల్సిన అవసరం లేదని, పుకార్లను నమ్మవద్దని కోరింది. కరోనా వంటి మహమ్మారికి వ్యాక్సిన్‌తోనే అడ్డుకట్ట వేయగలమని, వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెబుతోంది కేంద్రం. టీకా తీసుకున్న అనంతరం చాలా కొద్దిమందిలోనే సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని, అయితే ఇది సాధారణ విషయమని.. ఒకవేళ తీవ్ర స్థాయిలో ప్రతికూలతలు ఎదురైతే వెంటనే చికిత్స అందించడానికి ప్రతీ సెంటర్లలోనూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని అధికారులు తెలిపారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ వ్యాక్సిన్ తీసుకునే విషయంలోనే రోల్ మోడల్‌గా నిలవాలని.. అర్హులైన ప్రతీ ఒక్కరూ టీకా వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

8 ఏళ్ల బాలుడ్ని మింగిన మొసలి.. పొట్టకోసి బయటికి తీశారు
9 hours ago

అదృష్టమంటే అతడిదే.. 24 కోట్ల రూపాయలు లాటరీలో సొంతం..!
11 hours ago

తిమింగలం కక్కుతో మారిన మహిళ తలరాత.. కోట్లు సొంతం
05-03-2021

రోడ్డుపై ఆగి ఊగుతున్న కారు.. లోపలున్న జంటకి ఫైన్
05-03-2021

హైదరాబాద్ కంటే.. కాకినాడ, కరీంనగర్ బెస్ట్ అట
05-03-2021

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
04-03-2021

హత్యకు కారణం అమెరికా ప్రయాణమే.. రెండు ప్రాణాలు బలి
04-03-2021

బార్స్ ఇస్తున్నయ్ ఆఫర్స్
03-03-2021

బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్
02-03-2021

కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్వాడీ కార్యకర్త మృతి
01-03-2021
ఇంకా