newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

శవాలు గంగపాలు ! బీహార్ తీరానికి కొట్టుకొచ్చిన కోవిడ్ మృతదేహాలు

11-05-202111-05-2021 07:33:47 IST
Updated On 11-05-2021 07:35:48 ISTUpdated On 11-05-20212021-05-11T02:03:47.460Z11-05-2021 2021-05-11T02:03:40.649Z - 2021-05-11T02:05:48.255Z - 11-05-2021

శవాలు గంగపాలు !  బీహార్ తీరానికి కొట్టుకొచ్చిన కోవిడ్  మృతదేహాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాట్నా: కోవిడ్ మహమ్మారి మానవ విలువల్నే మట్టుబెట్టుతోందా? బంధం, బాంధవ్యం అన్న మాటకు చోటు లేకుండా చేస్తోందా? ఎక్కడ చూసినా భారతావని అంతటా కోవిడ్ సృష్టించిన మారణకాండ నుంచి ఉప్పొంగుతున్న ఆవేదనలే. ఒకప్పుడు చావంటే ఊరంతా దుఃఖించేది. ఇప్పుడు ఆ చావుకే సానుభూతి లేకుండా పోయింది. శవాలు రోడ్లపై పడి వున్నా ముక్కు మూసుకొని తన దారి తాను చూసుకుంటోంది నేటి సమాజము. "సిఫార్సు లేనిదే శ్మశానమందు దొరకదు రవంత చోటు" అన్న ఓ కవి మాటలు అక్షర సత్యమే. 

నేటి పరిస్థితికి దుస్థితికి అక్షరాలా అద్దం పడుతున్నాయి. నిజానికి వందలు, వేల సంఖ్యలో సంభవిస్తున్న మరణాల వల్ల మృతదేహాలను కాల్చేందుకు శ్మశానంలోనే చోటు లేదు. అంత్యక్రియల మాట పక్కన పెడితే సామూహిక దహనాలే గుండెలు పిండేస్తున్నాయి. కోవిడ్ మాటెత్తితే భయం. తమవారు కోవిడ్  వచ్చి పోయారంటే మరీ భయం. ఇలాంటి విషాద వలయంలో జనం బిక్కు బిక్కుమంటున్నారు. భీతిల్లిపోతున్నారు. దహనం, ఖననం మాట పక్కనపెట్టి ఇప్పుడు మృతదేహాలను గంగపాలు చేస్తున్నారా? అంత్యక్రియల ఖర్చులు భరించలేక గంగా నదిలోనే పడేస్తున్నారా? తాజాగా మృతదేహాలు కుళ్లిపోయిన దశలో గంగా నదిలో కొట్టుకు పోవడాన్ని ప్రజలు గమనించి అధికారులకు ఫిర్యాదు చేశారు.   

అప్పటికే ఉబ్బిపోయి, కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆ శవాలను బయటికి తీశారు. "మొత్తం 15 మృతదేహాలను బయటికి తీశాం. అప్పటికే అవి భయానక స్థితిలో ఉన్నాయి. ఇవేవీ కూడా ఈ జిల్లా వాసులవి కావు" అన్ని అధికారులు స్పష్టం చేశారు. బీహార్ లోని చౌసా బ్లాకు అభివృద్ధి అధికారి తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని  అనేక జిల్లాలు గంగా నదికి అటూ ఇటు ఉన్నాయని  ఈ మృతదేహాలను నదిలో పడేసి ఉంటారని భావిస్తున్నామని అన్నారు. అయితే  వీరంతా  కోవిడ్  బారినపడి మరణించిన వారేనా ? వారి మృతదేహాలను బంధువులే నదిలో పడవేశారా? అన్న విష్యం స్పష్టం కావడం లేదని అన్నారు. వెలికి తీసిన ఈ మృతదేహాలకు గౌరవప్రదంగా దహన సంస్కారాలు నిర్వహిస్తామని తెలిపారు.   

ఇలా కొట్టుకొచ్చిన మృతదేశాలు వందకు పైనే ఉన్నాయంటూ వచ్చిన కథనాలను అధికారులు కొట్టివేశారు. మృతదేహాలకు శ్మశానవాటికలో అంత్య క్రియలు చేయాలంటే భారీ మొత్తాన్నే డిమాండ్ చేస్తున్నారని, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రంలో అంత్యక్రియలు చేయడానికి అవసరమైన కట్టెలు కరువయ్యాయని లాక్ డౌన్ వల్ల పరిస్థితి మరీ శీక్షించిందని ఓ స్థానికుడు గుండెలు బాదుకున్నాడు. దీని కారణంగా చాలా మంది కోవిడ్ బాధితుల మృతదేహాలను గంగా నదిలోనేపడవేస్తున్నారని తెలిపాడు.  

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

   2 hours ago


చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

   21 hours ago


థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

   13-06-2021


కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

   12-06-2021


పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

   12-06-2021


ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

   11-06-2021


అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

   10-06-2021


ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

   10-06-2021


గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

   10-06-2021


రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

   10-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle