newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

వారికి కరోనా వ్యాక్సిన్ 2022 లోనే..!

15-10-202015-10-2020 15:07:33 IST
2020-10-15T09:37:33.216Z15-10-2020 2020-10-15T09:37:16.587Z - - 21-10-2020

వారికి కరోనా వ్యాక్సిన్ 2022 లోనే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కరోనా వ్యాక్సిన్ 2021లో వచ్చే అవకాశం ఉంది అనే అనుకుందాం..! అయితే ఈ వ్యాక్సిన్ ను ఎప్పుడు ఇస్తారు ఎవరికి ఇస్తారు అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదన్న సంగతి తెలిసిందే. మొదట పిల్లలకు, వయసు పైబడిన వారికి ఇస్తారని చెబుతూ ఉన్నారు. అదే యువతకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలంటే ఎప్పటి వరకూ ఆగాలో తెలుసా..? 2022 సంవత్సరం వరకూ..! 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కరోనా నేపథ్యంలో ఆసక్తికరఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మొదట కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి, అత్యధిక ముప్పు ఉన్నవారికి,  వయసు మీదపడిన వారికి ఇవ్వాలని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న యువతకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇంకాస్త సమయం పట్టొచ్చని చెప్పుకొచ్చారు.  ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని యువతీయువకులు 2022 వరకు వేచి చూడాల్సి ఉంటుందని అన్నారు. కరోనా వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఎన్నో సూచనలు వస్తున్నాయని అన్నారు. 

ఇక కరోనా వ్యాక్సిన్ పై వివిధ ఫార్మా కంపెనీలు ట్రయల్స్ ను చేస్తూ ఉన్నాయి.  జాన్సన్ అండ్ జాన్సన్ కూడా ఆ ప్రయత్నాల్లో ఉండగా  వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అనారోగ్యానికి గురికావడంతో ట్రయల్స్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. తాము నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న ఒకరు అస్వస్థతకు గురయ్యారని కంపెనీ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ పై మూడో దశ పరీక్షలతో పాటు అన్ని క్లినికల్ ట్రయల్స్ ను తాత్కాలికంగా నిలిపివేశామని కంపెనీ  ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 60 వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ కోసం చేపట్టిన ఆన్ లైన్ ఎన్ రోల్ మెంట్ ను సైతం నిలిపివేసినట్లు కంపెనీ ప్రకటించింది. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 200 కేంద్రాల్లో 60 వేల మంది వాలంటీర్లపై మూడో దశ ట్రయల్స్ ను భారీ ఎత్తున నిర్వహించేందుకు సెప్టెంబర్ లో జాన్సన్ అండ్ జాన్సన్ వాలంటీర్ల రిక్రూట్ మెంట్ ను ప్రారంభించింది. వ్యాక్సిన్ ట్రయల్స్ లో నియమ నిబంధనలను పాటిస్తూ తాత్కాలికంగా ట్రయల్స్ ను నిలిపివేశామని, త్వరలోనే ట్రయల్స్ ను తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సంస్థ ప్రతినిధి తెలిపారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle