newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క‌రోనా కాటు.. నిండుతున్న మార్చురీలు.. నేలపైనే డెడ్ బాడీలు

04-04-202104-04-2021 16:42:26 IST
2021-04-04T11:12:26.147Z04-04-2021 2021-04-04T02:58:53.810Z - - 11-04-2021

క‌రోనా కాటు.. నిండుతున్న మార్చురీలు.. నేలపైనే డెడ్ బాడీలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏందేందీ.. ఇది మ‌రీ విడ్డూరం కాక‌పోతే.. అన్ని గ‌నం చావులు ఎక్క‌డున్న‌య్ అనిపిస్తుంది క‌దా. అంతేలే. మ‌నం లైట్ తీసుకున్నం కానీ.. క‌రోనా లైట్ తీసుకోలేదు. మ‌న‌కి భ‌యం త‌గ్గింది కానీ.. క‌రోనా మాత్రం అటాక్ ఆప‌లేదు. ఆ మ‌ధ్య కాస్త చ‌నిపోయిన‌ట్లు న‌టించినా.. ఇప్పుడు ముందుకొచ్చింది క‌రోనా. ఏప్రిల్ ఫూల్స్ నేను రెడీగానే ఉన్నా.. రండి రండి భోంచేస్తా అంటూ అంద‌రినీ తినేస్తోంది. 

ఈ దిక్కుమాలిన క‌రోనా అన్ని దిక్కూల్నీ క‌వ‌ర్ చేస్తోంది క‌దా. ఇది ఎండ‌కి చావ‌డం కాదు.. ఎండ‌కి దీని బ‌లం పెరిగేలా ఉంది. అందుకే.. ఎండాకాలంలో రెచ్చి పోయిన క‌రోనా.. వానా కాలం చ‌లికాలంలో కాస్త కంట్రోల్ అయింది. మ‌ళ్లీ ఎండ‌లు ముద‌ర‌గానే.. ఎటాక్ చేస్తోంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ల‌క్ష కేసుల వ‌ర‌కూ న‌మోదు అవుతున్నాయి. ప‌దుల సంఖ్య‌లో చ‌నిపోతున్నారు జ‌నాలు. చ‌త్తీస్ ఘ‌డ్ లో కూడా దీని ప్ర‌భావం తీవ్రంగానే ఉంది. ఓ ఆస్ప‌త్రిలో అయితే.. 30 మందికి పైనే చనిపోయార‌ట‌. మ‌రి మామూలు ఆస్ప‌త్రిలో 30 మంది చ‌నిపోతే ప‌రిస్థితి ఏంటో ఊహించుకోవ‌చ్చు క‌దా. అందుకే.. ఆ ఆస్ప‌త్రిలో మార్చురీ నిండిపోయి నేల‌పైనే శ‌వాల్ని ఉంచుతున్నార‌ట‌.

మ‌నం మాత్రం.. ద‌ర్జాగా మూతికి మాస్క్ లేకుండా తిరుగుతున్నాం. మూతికి మాస్కున్నంత మాత్రాన క‌రోనా రాకుండా ఆగుతుంది అని కాదు. కాస్త కంట్రోల్ చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ అంతే. అంత‌కు మించి ఇంకేమీ కాదు. కానీ.. ఏం చేస్తాం చెప్పండి. ప‌నికి పోవాల్నాయే.. కొలువుకి పోవాల్నాయే.. కొల్వుకి పోతే బారుకెళ్ల‌క త‌ప్ప‌దాయే.. వీకెండ్ లో సినిమాల‌కీ వెళ్ల‌క త‌ప్ప‌దాయే. చూస్తుంటే క‌రోనాకి క‌డుపు నిండా ఫుడ్డు దొరికేలా ఉంది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle