newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎండ‌లు చ‌ల్లార్చే వానా.. బ‌తుకులు తెల్లార్చే వానా

15-04-202115-04-2021 22:23:08 IST
2021-04-15T16:53:08.460Z15-04-2021 2021-04-15T12:54:15.846Z - - 15-05-2021

ఎండ‌లు చ‌ల్లార్చే వానా.. బ‌తుకులు తెల్లార్చే వానా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఈ వాన త‌గ‌ల‌బ‌డ‌. టైం కి ప‌డ‌మంటే ప‌డ‌దు. కానీ.. వ‌ద్దురు వ‌రుణ దేవా నీకు దండం పెడ‌తం రా బాబూ.. నాల్రోజులు ఆ పైన‌నే ఎక్క‌డో ఒక చోట త‌గ‌ల‌బ‌డు అంటే.. తుర్రు తుర్రున కిందికొస్త‌డు. అంటూ.. తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతున్నారు రైతులు. ఓ ప‌క్క‌నేమో వ‌రికోత‌లు స్టార్ట్ అయ్యాయి. క‌ల్లాల మీద వ‌రి కుప్ప‌లు ఉన్నాయి. అవి త‌డిస్తే.. బ‌తు‌కు ఎండిపోయిన‌ట్లే. ఏం చేస్త‌రు చెప్పండి. కోసే వాళ్లేమో.. నీళ్ల‌లో రాలి పోత‌య్ అని భ‌య‌ప‌డుతున్నారు. కోసినోళ్లేమో.. క‌ల్లాల్లో మొక్క‌లెత్తుత‌య్ అని టెన్ష‌న్ ప‌డుతున్నారు. 

ఇటు మిర్చి రైతులు కూడా అంతే. కోయ‌కుండ ఆప‌లేరు. కోస్తే  కాపాడుకోలేరు. మంచి ఎండ‌ల టైంలో.. కాస్త ఎండితే.. మిర్చికి మంచి రేటు వ‌స్తుంది. కానీ.. త‌డిస్తే.. న‌ల్ల‌బ‌డి తాలు కాయ‌లు పెరిగి.. రైతు నిండా మునిగిపోతాడు. మిర్చి పెట్టుబ‌డుల గురించి తెలిసిందే క‌దా. బ‌తుకులు తెల్లారి పోత‌య్.

ఇక మ‌రో కోణం ఉంది క‌దా. హమ్మ‌య్యా.. మ‌బ్బులు ప‌ట్టింది. హ‌మ్మ‌య్యా వాన‌లు వ‌స్తున్న‌య్. హమ్మ‌య్యా ఇంకాస్త గ‌ట్టిగా ప‌డితే వారం దాకా చ‌ల్ల‌బ‌డి ఉంటుంది. పొగ‌లుగక్కుతున్న భూమి కాస్త చ‌ల్ల‌బ‌డుతుంది. అయినా.. ఈ ఎండ‌లో కాసేపు రెండు జ‌ల్లులు వాన వ‌స్తే ఎంత బాగుంటుందో క‌దా అంటూ.. వానొచ్చే టైంలో డాబా మీదికి వెళ్లి.. ఫోన్ లు ఇంట్లో ప‌డేసి.. మ‌న‌సారా త‌డిసి కూని రాగాలు తీస్తూ.. చిన్న చిన్న స్టెప్పులేస్తూ.. వేడి వేడి ప‌కోడీలు తింటూ రొమాంటిక్ గా ఉంటుంది అని.. ఐస్ క్రీమ్ లు తినే వాళ్లూ ఉన్నారు. 

ఎవ‌రికి మంచిది ఎవ‌రికి చెడుది అనేది వ‌దిలేస్తే.. మ‌రో రెండు రోజులు మాత్రం వాన‌లు ప‌డుతూనే ఉంట‌య్ అంటున్నారు వాతావ‌ర‌ణ శాఖ వాళ్లు. రెండు రోజులుగా ఏపీ తెలంగాణ‌లో మంచి వాన‌లు ప‌డుతున్న‌య్. అయితే ఇంకో రెండు రోజులు వాన‌లు బానే ఉంట‌య్. ఈ వీకెండ్ మొత్తం చ‌ల్ల‌ని పిల్ల గాలుల‌తో పాటు ఈదురు గాలులు కూడా తోలుతుంట‌య్ అంటున్నారు. ఏడ్చేవాళ్లు ఏడ్వాలి.. ఎంజాయ్ చేసేవాళ్లు ఎంజాయ్ చేయాలి. త‌ప్ప‌దు.. త‌ప్ప‌దేముంది చెప్పండి. వానలు మాత్రం గ‌ట్టిగ‌నే ప‌డుతున్న‌య్ క‌దా.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle