newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

12-10-202112-10-2021 10:26:24 IST
Updated On 12-10-2021 10:56:51 ISTUpdated On 12-10-20212021-10-12T04:56:24.539Z12-10-2021 2021-10-12T04:56:17.391Z - 2021-10-12T05:26:51.068Z - 12-10-2021

తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం వైఎస్ జగన్  రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.  తిరుపతి నుంచి తిరుమలకు చేరుకున్న ఆయన సంప్రదాయబద్ధంగా నుదుటున తిరునామం.. పంచెకట్టుతో బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తరువాత ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సీఎం తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య గజరాజులు వెంటరాగా.. వైఎస్‌ జగన్‌ ఆలయానికి చేరుకున్నారు.శ్రీవారి సన్నిధిలో ఆలయ అర్చకులకు పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం జగన్‌ శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్వామి వారి వైభవాన్ని తెలియజేశారు. ఆలయ జీయర్లు శేషవస్త్రంతో వైఎస్‌ జగన్‌ను సత్కరించారు. స్వామివారి దర్శనానంతరం రాష్ట్రానికి అన్ని విధాలా మేలు చేకూరాలని ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఆశీర్వదించాలని శ్రీవారిని సీఎం ప్రార్థించారు. అనంతరం వకుళమాతను, ఆలయ ప్రదక్షిణ చేసి విమాన వేంకటేశ్వరస్వామిని, సబేరా, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ జవహర్‌రెడ్డి స్వామివారి చిత్రపటంతో పాటు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ 2022 డైరీలు, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరిం చారు. అయితే సీఎం జగన్ శ్రీవారి దర్శన సమయంలో సామాన్య భక్తులకు సైతం దర్శనం కల్పించారు. దీంతో శ్రీవారి భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే ఆ నిబంధనలు పాటించాల్సిందే..

ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే ఆ నిబంధనలు పాటించాల్సిందే..

   06-12-2021


జనవరిలో కరోనా కేసులు.. అప్రమత్తంగా లేకుంటే కేసులు పెరుగుతాయి

జనవరిలో కరోనా కేసులు.. అప్రమత్తంగా లేకుంటే కేసులు పెరుగుతాయి

   06-12-2021


వరద బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశం

వరద బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశం

   30-11-2021


తెలంగాణలో కరోనాతో ఒకరు మృతి, కొత్తగా160 కేసులు

తెలంగాణలో కరోనాతో ఒకరు మృతి, కొత్తగా160 కేసులు

   27-11-2021


ఆంధ్ర ప్రదేశ్ నర్సరీ నుండి కోట్లు పెట్టి 200 ఏళ్ల నాటి ఆలివ్ చెట్లను కొన్న అంబానీ

ఆంధ్ర ప్రదేశ్ నర్సరీ నుండి కోట్లు పెట్టి 200 ఏళ్ల నాటి ఆలివ్ చెట్లను కొన్న అంబానీ

   27-11-2021


దక్షిణ కోస్తాకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

దక్షిణ కోస్తాకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

   26-11-2021


15 ఏళ్ల కూతురిపై కన్నేసిన కన్నతండ్రి..  బెదిరించి పలుమార్లు..

15 ఏళ్ల కూతురిపై కన్నేసిన కన్నతండ్రి.. బెదిరించి పలుమార్లు..

   25-11-2021


బెంగళూరు, చెన్నై పరిసర ప్రాంతాలు వర్షం కారణంగా జలమయం

బెంగళూరు, చెన్నై పరిసర ప్రాంతాలు వర్షం కారణంగా జలమయం

   22-11-2021


అమెరికాలో క్రిస్మస్ పరేడ్‌లో జనం మీదకు దూసుకొచ్చిన కారు..

అమెరికాలో క్రిస్మస్ పరేడ్‌లో జనం మీదకు దూసుకొచ్చిన కారు..

   22-11-2021


అనంతపురంలో భారీ వర్షాల కారణంగా భవనం కూలి 4 మంది మృతి

అనంతపురంలో భారీ వర్షాల కారణంగా భవనం కూలి 4 మంది మృతి

   20-11-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle