ప్రాంక్ షో.. అశ్లీల ప్రశ్నలు ఆడవాళ్లను అడుగుతుండడంతో తాట తీస్తున్న పోలీసులు..!
13-01-202113-01-2021 09:10:19 IST
Updated On 13-01-2021 09:25:55 ISTUpdated On 13-01-20212021-01-13T03:40:19.416Z13-01-2021 2021-01-13T03:40:12.949Z - 2021-01-13T03:55:55.917Z - 13-01-2021

ప్రాంక్ వీడియోలు.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాంక్ లు చేసే ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ను కూడా ఇస్తూ ఉంటాయి. కానీ ఇదే ప్రాంక్ షోల కారణంగా ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి. ప్రాంక్ షో కదా ఇష్టమొచ్చిన ప్రశ్నలు వేద్దాం.. ఇష్టమొచ్చినట్లు చేద్దామని అనుకుంటే మన దేశంలో అసలు కుదరదు. అధికారులు, పోలీసులకు తెలిస్తే తాట తీస్తారు. ఇక వ్యూస్ ఎక్కువ వస్తుంటాయి కదా అని అశ్లీల ప్రశ్నలు కూడా వేసే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఆడవారిని అలాంటి ప్రశ్నలు అడగడం.. అశ్లీలమైన ప్రశ్నలు అడగడం చేస్తూ ఉంటారు. ఇలా ప్రాంక్ షో పేరిట అశ్లీల ప్రశ్నల్ని అడిగిన ఓ యూ ట్యూబ్ ఛానల్ ను పోలీసులు పట్టేసుకున్నారు. ఆడవారిని అశ్లీల ప్రశ్నలు అడుగుతూ ఉండడంతో అడ్డంగా బుక్కైంది. ఆ నిర్వాహకుడు సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై టాక్స్ పేరిట ఉన్న ఓ యూ ట్యూబ్ చానల్ ప్రాంక్ చేస్తూ ఉంది. ముందుగా తామే ఎంపిక చేసుకున్న ఓ యువతి ద్వారా అశ్లీల ప్రశ్నలను వేశారు.. ఆమె ఆ విషయాన్ని ఏ మాత్రం దాచుకోకుండా చెప్పేసింది. ఇక అదే ప్రశ్నల్ని మరికొందరి యువతులను అడుగుతూ సమాధానాలు రాబట్టే యత్నం చేస్తూ ఉన్నారు. వీరు అడిగిన ప్రశ్నలు అశ్లీలంగా ఉండడంతో చెన్నై లోని బీసెంట్నగర్లో చిత్రీకరణ సాగుతున్న సమయంలో స్థానికులు అడ్డుకుని.. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఆ 'యూ ట్యూబ్' ఛానల్ అంతా అశ్లీలంతో కూడిన ప్రశ్నలు, సమాధానాలు, షోలు ఉండడంతో పోలీసులు ప్రాంక్ ల నుండి రియాలిటీ ఏంటో చూపించారు. ఆ ఛానల్ నిర్వహిస్తున్న దినేష్ను,యాంకర్ అజీం బాచ్చా, కెమెరామన్ అజయ్బాబులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ యూట్యూబ్ ఛానల్ మీద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ప్రాంక్ వీడియోలు అంటూ యూట్యూబ్ ఛానల్స్ పేరిట చాలా మందిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. హాస్యం తెప్పించే వరకూ ఓకె కానీ.. అది అశ్లీలతకు తావు ఇస్తే మాత్రం పోలీసులు కన్నెర్రజేస్తూ ఉన్నారు.

ఢిల్లీలో 13 ఏళ్ల బాలుడికి హిజ్రాగా శస్త్రచికిత్స..
16 hours ago

తొలి వ్యాక్సిన్ పండగ.. మంత్రి ఈటెలకు నేడే
17 hours ago

ఆన్ లైనా.. ఆఫ్ లైనా.. ఏది బెటర్
15-01-2021

తెలంగాణ ప్రజలకు కంటి మీద కునుకే లేదు
15-01-2021

బర్డ్ ఫ్లూ.. తెలంగాణను కూడా చేరిందా..?
14-01-2021

పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న ఉత్తరాది
14-01-2021

తెలంగాణలో తొలి కరోనా వ్యాక్సిన్ వేయించుకునేది అతడే..!
14-01-2021

భోగి పండుగ అంటే ఏమిటి?
13-01-2021

సిటీ ఖాళీ.. రోడ్లపై జాలీ
12-01-2021

భాగ్యనగరంలో మిడ్ నైట్ దోశ.. కేరాఫ్ అడ్రస్ రామ్ కీ బండి..!
12-01-2021
ఇంకా