చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం.. అనుమానాస్పదంగా మృతి చెందిన కుమార్తె
19-02-202119-02-2021 10:33:20 IST
Updated On 19-02-2021 11:01:55 ISTUpdated On 19-02-20212021-02-19T05:03:20.403Z19-02-2021 2021-02-19T05:03:09.074Z - 2021-02-19T05:31:55.803Z - 19-02-2021

ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇంటీరియర్ డిజైనర్ అయిన శిరిష్మకు హైదరాబాద్ మణికొండలోని ట్రయల్ విల్లాస్‌కు చెందిన గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్‌తో 2016లో వివాహమైంది. గత ఏడాది కాలంగా వీరు గచ్చిబౌలి డీ అడ్రెస్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి ఇంటికొచ్చిన సిద్ధార్థ్ గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్న స్థితిలో కనిపించిన శిరిష్మను చూసి విస్తుపోయాడు. తేరుకుని వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం శిరిష్మ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చలసాని శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శిరిష్మకు, సిద్ధార్థకు పెళ్లయి నాలుగేళ్లు అయినా వారికి ఇంకా సంతానం కలగలేదని కూడా తెలుస్తోంది. ఈ విషయమై భార్యాభర్తలిద్దరూ కొన్నాళ్లుగా ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఎన్ని మందులు వాడినా, ఎందరు డాక్టర్లను కలిసినా ఫలితం లేకపోవడంతో శిరిష్మ మనస్థాపానికి గురయిందని చెబుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయిందని కూడా అంటున్నారు. రాత్రి 7.30గంటల సమయంలో వ్యాపార పనులు ముగించుకుని భర్త సిద్ధార్థ్ ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లో భార్య కోసం వెతకగా గదిలో ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దింపి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తేల్చారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పిల్లలు పుట్టడం లేదన్న మనస్థాపంతో ఆమె మరణించిందా..? లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. శిరిష్మ మరణం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలసాని శ్రీనివాస్ ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నామని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

గుండెపోటుతో ఇరాన్ మహిళా ఖైదీ మృతి.. అయినా మళ్లీ ఉరితీశారు.
25-02-2021

అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.. అయినా జనం ఏంటి ఇలా
25-02-2021

Ghatkesar: కిడ్నాప్ నాటకమాడిన ఘట్కేసర్ బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
24-02-2021

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి.. కేసులో స్కూటీ యజమాని అరెస్ట్
23-02-2021

మూడేళ్ల తర్వాత వచ్చిన భర్త.. భార్యకి ఐదునెలల గర్భం
23-02-2021

ప్రతి పిల్లా చెల్లాయే అనే అనుమానంతో.. డేటింగ్ కి దూరం
23-02-2021

కరోనా సెకండ్ వేవ్ టెన్షన్.. అలర్ట్ అయిన తెలంగాణ
22-02-2021

గన్నవరంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న విమానం..
20-02-2021

ట్రాన్స్ జెండర్లతో ప్రాబ్లమా.. ఈ నెంబర్ కి కాల్ కొట్టండి- సీపీ సజ్జనార్
20-02-2021

ఒక్క ఏడాదిలో అంతమంది హైదరాబాద్ లో ప్రాణాలు కోల్పోయారా
19-02-2021
ఇంకా