newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

26-09-202026-09-2020 13:06:09 IST
2020-09-26T07:36:09.728Z26-09-2020 2020-09-26T07:34:09.961Z - - 20-10-2020

నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వ డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో నెగిటివ్‌ మార్కుల విధానానికి స్వస్తి పలుకుతూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఈ విధానాన్ని గత ప్రభుత్వం 2016లో అమల్లోకి తీసుకువచ్చింది. దీనిప్రకారం ఒక తప్పు సమాధానానికి 13 వంతు మార్కులు తగ్గిస్తున్నారు. దీనివల్ల ఉద్యోగులు సకాలంలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందలేకపోతున్నారు. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ విధానాన్ని రద్దు చేశారు. 

ఇకపై ఏపీపీఎస్‌సీ నిర్వహించే డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో నెగిటివ్‌ మార్కులు ఉండవు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే లక్షకు పైగా ఉద్యోగులతో పాటు వివిధ శాఖల్లోని ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు, ఇంక్రిమెంట్ల ప్రయోజనం కలగనుంది. కాగా, ప్రభుత్వ నిర్ణయం పట్ల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఫెడరేషన్‌ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

పదోన్నతులు, ఇంక్రిమెంట్ల కోసం శాఖాపరమైన పరీక్షలు రాసే ఉద్యోగులకు.. ఆయా పరీక్షల్లో ఇకపై నెగిటివ్‌ మార్కులు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఉత్తీర్ణత విషయంలో ఇప్పుడున్న 35 మార్కులను 40శాతానికి పెంచుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, ఈ నిబంధన 1965 నుంచి 2016 వరకు అమల్లో ఉండేది. 

అయితే, 2017లో నెగిటివ్‌ మార్కుల విధానం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో 35% మార్కులకు తగ్గించారు. ఇటీవల కాలంలో ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఏపీపీఎస్సీ కార్యదర్శి దీనిపై రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పాత విధానాన్ని తిరిగి అమల్లోకి తెచ్చింది. 

ఇదిలావుంటే, ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు, ఇతర ఆరోపణలకు సంబంధించి నడుస్తున్న శాఖాపరమైన విచారణలను వీడియో కాన్ఫరెన్సు(వీసీ) ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle