newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కలకలం

14-05-202114-05-2021 07:48:02 IST
Updated On 14-05-2021 08:15:49 ISTUpdated On 14-05-20212021-05-14T02:18:02.195Z14-05-2021 2021-05-14T02:17:57.091Z - 2021-05-14T02:45:49.227Z - 14-05-2021

తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కలకలం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కేసులు రావడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు తెలంగాణలో కొత్తగా కేసులు రావడంతో అధికారులు అలర్ట్ అవుతూ ఉన్నారు. నిర్మల్‌ జిల్లాలోని భైంసాలో ముగ్గురు బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి బారిన పడడం అధికారులను టెన్షన్ పెడుతూ ఉంది. ముగ్గురు రోగుల్లో ఒకరు చనిపోవడం కూడా అధికారులను టెన్షన్ పెడుతూ ఉంది.

ఈ ఘటన కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిని హైదరాబాద్‌లోని ఆసుపత్రికి  తరలించారు. తెలంగాణ వైద్య విద్య విభాగం డైరెక్టర్‌ రమేశ్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మూడు బ్లాక్ ఫంగస్‌ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులు ప్రైవేట్‌ ఆసుపత్రి నుంచి వచ్చాయన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ కేసులను ప్రైవేటు ఆసుపత్రుల వారు గాంధీకి పంపేందుకు యోచిస్తున్నారని తెలిపారు. కొవిడ్‌ సోకిన ప్రతిఒక్కరికీ బ్లాక్‌ ఫంగస్‌ సోకదని.. కొందరు మాత్రమే ఈ వ్యాధి బారిన పడతారన్నారు.

మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 2 వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.  బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారిలో 50 శాతం మంది ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. బ్లాక్ ఫంగస్ బాధితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తుండటంతో, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను బ్లాక్ ఫంగస్ చికిత్స కేంద్రాలుగా మార్చారు. బ్లాక్ ఫంగస్ చికిత్స ఖర్చుతో కూడుకున్నదని అయితే వీలైనంత తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

కరోనా సోకిన వారిలో, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. తడి ఉపరితలాల నుంచి ఎక్కువగా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారికి రెండు మూడ్రోజుల్లో బ్లాక్​ ఫంగస్​ లక్షణాలు కనిపిస్తున్నాయి. తొలుత సైనస్​లో చేరి తర్వాత కండ్లపై ఇది దాడి చేస్తుంది. తర్వాత 24 గంటల్లో బ్రెయిన్​ వరకు వెళ్తుంది. ఆ తర్వాత బ్రెయిన్​ డెడ్​ అయి చనిపోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన వారిలో ముఖం వాపు, తలనొప్పి, జ్వరం, కళ్ల వాపు, అవయవాల్లో నల్లటి మచ్చలు, ముక్కు ఒక వైపు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్లాక్​ ఫంగస్​ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు.. దీన్ని ముందే గుర్తించి యాంటీ ఫంగల్ ట్రీట్​మెంట్​ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చు.

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

   44 minutes ago


చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

చేపలు పట్టేటప్పుడు ఓ మహిళపై మొసలి దాడి.. సగం తిన్న మొసలి

   20 hours ago


థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

థర్డ్ వేవ్ తో పిల్లలకి ప్రమాదం లేదు..

   13-06-2021


కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చింది: డాక్టర్ రాకేశ్ మిశ్రా

   12-06-2021


పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

పాన్ కార్డు కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే జరిమానా

   12-06-2021


ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

ఈ రెండురోజులు అలర్ట్ గా ఉండాలి..

   11-06-2021


అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయి

   10-06-2021


ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 ర్యాలీ: టెన్త్ అర్హతతో

   10-06-2021


గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

గోక్షుర ఆయుర్వేద ప్రయోజనాలు.. వాటిలో శృంగార వాంఛ కూడా ఒకటి

   10-06-2021


రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

రు. 150 కోట్ల మొబైల్ యాప్ మోసం.. 11 మంది అరెస్ట్

   10-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle