జమ్మూలో బర్డ్ ప్లూ దెబ్బకు 150 కాకులు బలి
08-01-202108-01-2021 13:21:55 IST
2021-01-08T07:51:55.884Z08-01-2021 2021-01-08T07:47:29.176Z - - 24-01-2021

జమ్మూ లోని ఉదంపూర్ జిల్లాలో గురువారం 150 కాకులు చనిపోవడం అధికారులను కలవరపర్చింది. చనిపోయిన కాకులనుంచి నమూనాలను సేకరించి పరీక్షించడానికి పంపారు. అయితే జమ్మూలో పక్షులు చనిపోవడానికి కారణం శీతల గాలులు కావచ్చని ఉదంపూర్ పశుసంవర్థక శాఖ చీఫ్ డాక్టర్ ఇంద్రజిత్ సింగ్ పేర్కొన్నారు. చనిపోయిన కాకుల నుంచి శాంపిల్స్ తీసి పరీక్షించడానికి పంపాము. శీతల గాలుల విజృంభణ వల్లే పక్షులు మూకుమ్మడిగా చనిపోయి ఉండవచ్చు. అయితే ఈ పరిణామాన్ని తేలిగ్గా తీసుకోకుండా అవి బర్డ్ ప్లూ వల్ల చనిపోయాయేమో తెలుసుకోవడానికి వాటి శాంపిల్స్ సేకరించి పంపాము అని డాక్టర్ సింగ్ చెప్పారు. ఇదిలా ఉండగా, కర్నాటక లోని దక్షిణ కన్నడ జిల్లాలోనూ ఆరు కాకులు చనిపోయిన ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. వీటి నమూనాలను కూడా పరీక్షకు పంపారు. అంతకు ముందు కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ బర్డ్ ఫ్లూ సోకినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఫౌల్ట్రీ కోళ్లు, కాకులు, వలస పక్షుల్లో మరింతగా బర్డ్ ఫ్లూ సోకకుండా నిరోధక చర్యలు పాటించాలని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే హర్యానాలోని పంచకులలోని కోళ్ల ఫారాల్లో అసాధారణంగా కోళ్లు మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తతా హెచ్చరిక చేసింది. చూస్తుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బర్డ్ ప్లూ వ్యాధి వ్యాపిస్తున్నట్లే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నెమళ్లతో సహా వందలాది పక్షులు, కోళ్లు చనిపోవడం గమనార్హం.

గన్ గురిపెట్టి.. ముత్తూట్ ఫైనాన్స్ నుండి 7కోట్ల విలువైన బంగారం చోరీ
16 hours ago

హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
22-01-2021

డ్రాగన్ ఫ్రూట్ బన్ గయా 'కమలం'
22-01-2021

మూడంగుళాల ఎత్తు పెరగడానికి రూ. 55 లక్షల ఖర్చు..
21-01-2021

పిడకలు అమ్మడం, రేటు కాదు.. దాని రివ్యూ ఇంట్రస్టింగ్
21-01-2021

మందు బాబులు.. వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇది గమనించుండ్రి..!
20-01-2021

అత్తకు గుడి కట్టిన కోడళ్ళు.. ప్రతి నెలా భజనలు, కీర్తనలు
20-01-2021

కరోనా నుండి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో ఒకరు చనిపోతున్నారట..!
18-01-2021

అవినీతి కేసులో సీబీఐ అధికారుల సస్పెండ్..
17-01-2021

ఇండోనేషియాలో బారీ భూకంపం.. 42 మంది మృతి
17-01-2021
ఇంకా