newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

పొంచి ఉన్న కొత్త ఉపద్రవం.. బర్డ్ ఫ్లూతో వేలాది పక్షుల వధ

06-01-202106-01-2021 13:04:17 IST
2021-01-06T07:34:17.746Z06-01-2021 2021-01-06T07:34:02.499Z - - 20-01-2021

పొంచి ఉన్న కొత్త ఉపద్రవం.. బర్డ్ ఫ్లూతో వేలాది పక్షుల వధ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పటికే కరోనా కొత్త వైరస్ గురించి భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో దానికి తోడుగా అనేక రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్ ఉనికి బయపడటంతో తీవ్ర కలకలం చెలరేగుతోంది. పక్షులకు ప్రాణాంతకమైన ఈ హెచ్‌5ఎన్‌1 వైరస్‌ కారణంగా రాజస్తాన్, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో గణనీయమైన సంఖ్యలో వివిధ రకాల పక్షులు చనిపోతున్నాయని ఆయా రాష్ట్రాల పాలనా యంత్రాంగం నిర్ధారించింది. హరియాణాలో కొద్దిరోజులుగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడం, హిమాచల్‌ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి కారణంగా అడవి బాతుల  వంటి వలస పక్షులు చనిపోయినట్లు సమాచారం.. రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో కాకులు, కేరళలో బాతులు చనిపోయినట్టు వివిధ వార్తాసంస్థలు తెలిపడంతో మరో మహమ్మారి దేశంపై దాడి చేయడానికి పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.

కేరళలో పెంపుడు కోళ్లు, బాతుల సామూహిక వధ

ఈ బర్డ్ ఫ్లూ ప్రభావం దేశంలోనే మొట్టమొదటి సారిగా కేరళ రాష్ట్రంలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో పొడసూపింది. దీన్ని విపత్తుగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అలప్పుజ జిల్లాలోని కుట్టనాడ్‌ ప్రాంతంలో నేదుముడి, తకాళి, పల్లిప్పడ్, కరువత్తా తదితర నాలుగు పంచాయతీలలో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కేరళలో రాష్ట్ర ప్రభుత్వం దీనిని విపత్తుగా ప్రకటించింది. ఈ కేసులు గుర్తించిన ప్రాంతాలకు ఒక కిలోమీటర్‌ పరిధిలో ఉన్న పెంపుడు కోళ్లు, బాతులను బుధవారం సాయంత్రం కల్లా చంపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను ఏర్పాటు చేసింది. 

ఒక్క కుట్టనాడ్‌ ప్రాంతంలోనే 34 వేల పెంపుడు పక్షులను చంపాల్సి ఉండగా, కొట్టాయం జిల్లా నీందూర్‌ పంచాయతీలో 3 వేల పక్షులను ఇప్పటికే చంపినట్లు యంత్రాంగం తెలిపింది. ఈ పంచాయతీలో 1,700 బాతులు వైరస్‌ బారిన పడి చనిపోయాయి. అలప్పుజ జిల్లా కలెక్టర్‌ ఈ ప్రాంతంలో మాంసం, గుడ్ల వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధిస్తూ ఆయా వ్యాపార కేంద్రాల మూసివేతకు ఆదేశించారు.  

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వారం రోజుల్లో 155 కాకులు వైరస్‌ కారణంగా చనిపోయాయి. అయితే, ఈ వైరస్‌ ఇప్పటివరకు పౌల్ట్రీలో సంక్రమించలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాజస్తాన్‌ నుంచి పక్షుల ద్వారా వైరస్‌ సంక్రమించినట్టు వచ్చిందని యంత్రాంగం అనుమానిస్తోంది. పొరుగునే ఉన్న రాజస్తాన్‌లోని దాదాపు 16 జిల్లాల్లో 625 పక్షులు చనిపోయినట్టు యంత్రాంగం వెల్లడించింది. ఝాల్వార్, కోటా, బారన్‌ జిల్లాల్లో వైరస్‌ జాడలు కనిపించాయి. 

హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో గల పాంగ్‌ డ్యామ్‌ సరస్సులో బర్డ్‌ ఫ్లూ కారణంగా 2,700 వలస పక్షులు చనిపోయాయి. ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ సోకడం వల్లే ఈ పక్షులు చనిపోయినట్టు నిర్ధారణయింది. ఇది పక్షులపై, కోళ్ల పరిశ్రమపై ఇంకా తన ప్రభావం చూపలేదని, కానీ అన్నింటికీ సిద్ధమై ఉన్నామని రాజస్థాన్ పశు పెంపకం శాఖ మంత్రి లాల్ చంద్ కటారియా పేర్కొన్నారు. 

రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, కేరళలో బర్డ్‌ఫ్లూ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిక జారీ చేశాయి. ఆయా రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోవడంతో ఇతర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తమిళనాడు, కర్ణాటక, పంజాబ్‌ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. కేరళను కలిపే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, తనిఖీలు చేపట్టినట్లు తమిళనాడు తెలిపింది. మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌ యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఈ వైరస్‌ మనుషులకు సోకినట్లు ఆధారాలు లేవని బాధిత రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle