newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

హైద‌రాబాద్ బిర్యానీ తింటున్నారా.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌

22-01-202122-01-2021 16:09:15 IST
Updated On 22-01-2021 15:43:47 ISTUpdated On 22-01-20212021-01-22T10:39:15.541Z22-01-2021 2021-01-22T10:05:19.620Z - 2021-01-22T10:13:47.130Z - 22-01-2021

హైద‌రాబాద్ బిర్యానీ తింటున్నారా.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైద‌రాబాద్ బిర్యానీ ఎంత ఫేమ‌స్సో ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది చెప్పండి. అయితే.. ఎక్క‌డ బిర్యానీ.. ఏ బిర్యానీ అన్న‌ది కూడా పాయింటే. అయితే.. కొత్త కొత్త‌గా వ‌చ్చిన బిర్యానీ సెంట‌ర్ల కంటే.. పాత‌కాలం నుంచి.. ఫేమ‌స్ గా ఉన్న బిర్యానీ సెంట‌ర్ల లెక్కే వేరు. కాక‌పోతే.. ఆ లుక్కు మాత్రం బాలేదు అంటున్నారు ఆఫీస‌ర్లు. బావ‌ర్చీ, ప్యార‌డైజ్ బిర్యానీల‌తో పాటు.. మ‌రికొన్ని బిర్యానీ సెంట‌ర్లు కూడా ఈ మ‌ధ్య బాగా ఫేమ‌స్ అయ్యాయి. అయినా స‌రే.. బావ‌ర్చీ బిర్యానీ క్రేజే వేరు. బ‌య‌టి నుంచి హైద‌రాబాద్ కి ఎవ‌రు వ‌చ్చినా ముందు బిర్యానీ టేస్ట్ చేయాలి అనుకుంటారు. లోక‌ల్ గా కూడా.. అన్ని ఫుడ్ ఐట‌మ్స్ కంటే.. బిర్యానీకి కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాటిలో బావ‌ర్చీ లెక్కే వేరు. 

అయితే.. స‌డ‌న్ గా ట్విస్టులిచ్చే ఆఫీస‌ర్లు మాత్రం బావ‌ర్చీపై ప‌డుతుంటారు. ఎక్కువ క్రేజ్ ఉండ‌డం వ‌ల్ల కూడా ఫుడ్ ఇన్ స్పెక్ట‌ర్లు ఎప్పుడు దాడులు చేసినా.. బావ‌ర్చీ హైలైట్ అవుతుంది. ఇప్పుడు కూడా అదే జ‌రిగింది. బావ‌ర్చీకి పాతిక వేలు ఫైన్ కూడా వేయ‌డంతో ఇంకాస్త హాట్ అప్డేట్ అయింది. తింటున్న వారు.. తిన్న వారు.. తినాలి అనుకుంటున్న వారు బావ‌ర్చీ గురించి ఆలోచిస్తున్నారు. విష‌యం ఏంద‌య్యా అంటే.. బావ‌ర్చీలో నీట్ నెస్ ని.. అధికారులు చెప్పిన రూల్స్ ప్ర‌కారం ఫాలో కావ‌డం లేద‌ట‌. అలాగే.. బావ‌ర్చీలో వాడే మాంసం కూడా అధికారులు ముద్ర వేసిన మాంసం తీసుకోవ‌డం లేద‌ట‌. అందుకే.. ఇన్ స్పెక్ష‌న్ చేసిన అధికారులు.. బావ‌ర్చీకి పాతిక వేలు ఫైన్ వేశారు. దీంతో.. మ‌రోసారి బావ‌ర్చీ బిర్యానీ సెంట‌ర్ హైద‌రాబాద్ ఫుడ్ జోన్ లో ఇంట్ర‌స్టింగ్ టాపిక్ అయింది.

బావ‌ర్చీతో పాటు.. మరికొన్ని రెస్ట‌రెంట్ల‌పై కూడా స‌డ‌న్ అటాక్స్ చేసిన అధికారులు.. అక్క‌డ కూడా ఫైన్ వేశారు. ఆ సెంట‌ర్ల‌పైనా సేమ్ టు సేమ్ రీజ‌న్. నీట్ నెస్ అండ్ నాన్ వెజ్ విష‌యంలో రూల్స్ ఫాలో కావ‌డం లేదు అంటున్నారు. ఆ సెంట‌ర్లు కూడా బావ‌ర్చీ ఏరియాలోనే ఉండ‌డంతో.. ఆ ఏరియాలో బిర్యానీ తినే వారు కాస్త ఆలోచించాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. అధికారులు కూడా చూసి తినండీ అంటున్నారు. అయినా జ‌నం ప‌ట్టించుకుంటున్నారా చెప్పండి. ఆ టేస్టే వేరు.. ఆ లెక్కే వేరు అంటూ.. ప్లేట్ల‌కి ప్లేట్లు లాగించేస్తున్నారు. అదే క‌దా హైద‌రాబాద్ బిర్యానీ ప‌వ‌ర్ అంటే. 

8 ఏళ్ల బాలుడ్ని మింగిన మొసలి.. పొట్ట‌కోసి బ‌య‌టికి తీశారు

8 ఏళ్ల బాలుడ్ని మింగిన మొసలి.. పొట్ట‌కోసి బ‌య‌టికి తీశారు

   10 hours ago


అదృష్టమంటే అతడిదే.. 24 కోట్ల రూపాయలు లాటరీలో సొంతం..!

అదృష్టమంటే అతడిదే.. 24 కోట్ల రూపాయలు లాటరీలో సొంతం..!

   12 hours ago


తిమింగలం కక్కుతో మారిన మహిళ తలరాత.. కోట్లు సొంతం

తిమింగలం కక్కుతో మారిన మహిళ తలరాత.. కోట్లు సొంతం

   05-03-2021


రోడ్డుపై ఆగి ఊగుతున్న కారు.. లోప‌లున్న జంట‌కి ఫైన్

రోడ్డుపై ఆగి ఊగుతున్న కారు.. లోప‌లున్న జంట‌కి ఫైన్

   05-03-2021


హైద‌రాబాద్ కంటే.. కాకినాడ‌, కరీంన‌గ‌ర్ బెస్ట్ అట‌

హైద‌రాబాద్ కంటే.. కాకినాడ‌, కరీంన‌గ‌ర్ బెస్ట్ అట‌

   05-03-2021


కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

   04-03-2021


హ‌త్య‌కు కార‌ణం అమెరికా ప్ర‌యాణమే.. రెండు ప్రాణాలు బ‌లి

హ‌త్య‌కు కార‌ణం అమెరికా ప్ర‌యాణమే.. రెండు ప్రాణాలు బ‌లి

   04-03-2021


బార్స్ ఇస్తున్న‌య్ ఆఫ‌ర్స్

బార్స్ ఇస్తున్న‌య్ ఆఫ‌ర్స్

   03-03-2021


బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్

బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్

   02-03-2021


కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి

కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ కార్యకర్త మృతి

   01-03-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle