newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆటోలో బంగారం బ్యాగ్.. దిగిన మ‌హిళ‌.. ఆటో జంప్.. రీజ‌న్ వింటే షాక్

02-04-202102-04-2021 11:43:56 IST
Updated On 02-04-2021 10:47:30 ISTUpdated On 02-04-20212021-04-02T06:13:56.163Z02-04-2021 2021-04-02T05:04:44.132Z - 2021-04-02T05:17:30.471Z - 02-04-2021

ఆటోలో బంగారం బ్యాగ్.. దిగిన మ‌హిళ‌.. ఆటో జంప్.. రీజ‌న్ వింటే షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌కాశం జిల్లాలో జ‌రిగింది ఈ సీన్. ఓ మ‌హిళ ఆటో ఎక్కింది. ఇది కామ‌నే క‌దా. బానే ఎక్కి కూర్చుంది. ఆమె చేతిలో బంగారం ఉన్న బ్యాగ్ ఉంది. బంగారం అంటే.. బంగారు ఆభ‌ర‌ణాలు ఉన్న బ్యాగ్. ఆమె జాగ్ర‌త్త చూస్తుంటే అందులో బంగారం ఉన్న విష‌యం అందరికీ అర్దం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే.. అందులో నాలుగు ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ చేసే బంగారం ఉంది. అన్ని బంగారు న‌గ‌లు బ్యాగ్ లో ఉంటే.. ఒంట‌రి మ‌హిళ కాస్త భ‌య ప‌డుతుంది క‌దా. ఇది కామ‌నే. ఆటో అత‌ను ఆమెను ఆటో ఎక్కించుకున్నాడు. కిరాయి మాట్లాడుకున్నాడు.. అడ్ర‌స్ అడిగాడు వెళ్తున్నాడు. త‌ను కూడా ఆమెను బానే అబ్జ‌ర్వ్ చేశాడు. 

కానీ.. ఈ దిక్కుమాలిన ఎండకి కాళ్లు గ‌ట్టి నీడకేస్తే కానీ స‌ల్ల‌బ‌డ‌దు క‌దా. ఏప్రిల్ లోనే మే నెల ఎండలు ఉండే. ఏం చేస్తం చెప్పండి. ఏం చ‌చ్చిందో ఏమో.. కాస్త స‌ల్ల‌గా ఏదైనా తాగుదాం అనిపిస్తుంది క‌దా. ఆటోలో ఎక్కిన మ‌హిళ‌కి కూడా కొబ్బ‌రి బోండాలు చూసి తాగాలి అనిపించింది. ఆటో కాస్త ఆప‌య్యా అంటే ఆపేశాడు. ఆమె దిగింది. కొబ్బ‌రి బోండాల షాపు ద‌గ్గ‌రికి జ‌రిగింది. ఆటో మాత్రం రోడ్డు మీదే ఉంది. కానీ.. ఆమె మాత్రం బ్యాగుతో దిగ‌లేదు. ఆటో ఇక్క‌డే ఉంది క‌దా అనుకుంది. కానీ.. ఆమె దిగిన మ‌రుక్ష‌ణ‌మే ఆటో జంప్. ఆమె వెన‌క్కి చూసేలోగా ఆటో పోతూనే ఉంది. పాపం ఆ మ‌హిళ మాత్రం ఏం చేస్తుంది చెప్పండి. అరిచి కేక‌లు వేసింది.. ఆటో దారి మ‌ళ్లించాడు డ్రైవ‌ర్. ఏం చేయాలో అర్దం కాలేదు. టెన్ష‌న్ ప‌డుతూ.. భ‌య‌ప‌డుతూ బాధ ప‌డుతూ.. పోలీస్ స్టేష‌న్ కి వెళ్లింది మ‌హిళ‌. వెళ్లి విష‌యం చెప్పింది. ఆటోలో నాలుగు ల‌క్ష‌ల విలువైన బంగారం ఉంది అన‌గానే.. పోలీసులు కూడా సీరియ‌స్ గానే తీసుకున్నారు.

శ్రీవారి హుండీలోకి ఎక్కువ మొత్తంలో ఎవరెవరు డబ్బు వేస్తున్నారా అని చూశారు.. ఆ తర్వాత..!

ఎస్సై ఇమీడియ‌ట్ గా రియాక్ట్ అయ్యి.. ఆటోని ప‌ట్టేశారు. కాసేప‌ట్లో దొరికిపోయింది ఆటో. ఇక ఆ డ్రైవ‌ర్ ప‌రిస్థితి చూడాలి. ఆమెకు కూడా భ‌యంగానే ఉంది. ఆటోలోని బ్యాగుని చూసి.. బంగారం ఉందా లేదా అనుకుంది. ఆమె బ్యాగులోని బంగారు న‌గ‌లు చూసి.. హ‌మ్మ‌య్య అనుకుంది ఆవిడ‌. ఆటో డ్రైవ‌ర్ ఏమో.. ఓరినాయ‌నో అనుకున్నాడు. ఇందులో బంగారం ఉందా అని షాక్ తిన్నాడు. ఎందుకంటే.. ఆ ఆటో డ్రైవ‌ర్ కి అందులో బంగారం ఉన్న విష‌యం తెలీదు. మ‌రి ఆటో వేసుకుని ఎందుకు పారిపోయావ్ అంటే.. అత‌ను ఓ ఆన్స‌ర్ చెప్పాడు. సార్.. ఇక్క‌డ పోలీసులు ఆపుతున్నారు సార్. నా బండికి అన్ని కాగితాలు స‌రిగా లేవు సార్. ప‌ట్టుకుంటే ఫైన్ రాస్తార‌ని.. ప‌క్క‌కెళ్లి ఆపుదాం అనుకున్నా సార్ అన్నాడు. అంతే. ఎస్సై కూడా షాక్.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle