అక్కా పొంగిద్దామా
07-04-202107-04-2021 09:14:06 IST
Updated On 07-04-2021 10:13:33 ISTUpdated On 07-04-20212021-04-07T03:44:06.661Z07-04-2021 2021-04-07T03:37:45.637Z - 2021-04-07T04:43:33.453Z - 07-04-2021

టైం ఎంతైందక్కా.. తొమ్మిదైందే... ఏందీ.. తొమ్మిదా... అవును తొమ్మిదే.. తొంబై తొమ్మిది కాదు. ఏందక్కా ఈ ఎండలు. పొద్దున్నే తొమ్మిది అయిందో లేదో.. ఈ సూర్యుడికి ఏం పుట్టింది. ఇట్ట మీద పడిపోతున్నాడు. ప్రేమ చెల్లే.. ప్రేమ. మన మీద సూర్యుడికి ఎంత ప్రేమో కదా. ఈ సూర్యుడ్ని కాళ్లుగట్టి నీడకేస్తే గానీ.. కాస్త మన మేకప్ లకి ప్రొటెక్షన్ ఉంటుంది లేదంటే.. బయటికెళ్లి వచ్చేలోగా మొహాలు మాడిపోతున్నయ్. అందుకే చెల్లే.. డేటింగులు మీటింగులు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నమ్.. కావాల్నంటే.. సూర్యుడు సర్రున గూట్ల పడ్డాక.. కలుద్దాంలే అనుకుంటున్నం. అవునక్కా.. ఈ సూర్యుడి నుంచి కాపాడాలంటే.. ఓ వారం పాటు.. వానలు కురిస్తే బావుండు కదా. లేదు లేదు చెల్లే... వానలు కురవడం కష్టం. ఎందుకక్కా.. మన మేయర్ విజయలక్ష్మి ఉన్నారు కదా చెల్లే.. అవును ఉన్నారక్కా.. ఆమె వానలే రావద్దు అని.. పూజలు పునస్కారాలు చేయకపోయినా.. నిండు మనసుతో ఓ ఐదేళ్లు పాటు వానలు రావద్దు అని మొక్కుతోంది. సో.. వానలు కష్టమే. మరి ఎట్లక్కా.. మనకి దిక్కేంది.. ఒళ్లు మండిపోతోంది.. ఏం చేయాలక్కా.. ఏం లే చెల్లె.. నువ్వొక ఐదొందలు.. నేనొక ఐదొందలు వేస్కుందాం.. మంచి పరిష్కారం ఉంది. వామ్మో ఐదొందలా అక్కా..మేకప్ కి అయితే.. వేలు వేలు పోస్తవ్.. ఐదొందల్ ఇవ్వలేవా చెల్లే.. సరే అక్కా ఇస్తలే.. చెప్పు. మంచిగ చెరొక ఐదొందలువేస్కుని.. నాలుగు బీర్లు.. తెచ్చుకుందాం చెల్లే. బీర్లా అక్కా.. మనిద్దరమే అయితే ఎట్టా చెప్పు.. నా ఫ్రెండ్స్ ని కూడా పిలుద్దాం. నలుగురం కలిసి.. నాలుగువేలేసుకుని.. ఓ కేస్ తెచ్చుకుందామా.. స్టఫ్ కూడా మంచిగ తెచ్చుకోవచ్చు. సరే చెల్లే.. బాగా డెవలప్ అయ్యావ్. అంతా ఫ్రెండ్స్ మహిమ అక్కా. ఇదండీ.. హైదరాబాద్ లో కొంతమంది అమ్మాయిల డిస్కషన్. ఇలాంటి డిస్కషన్ లు మామూలు టైంలో కూడా బాగానే ఉంటున్నా.. ఎండాకాలం కదా.. ఇప్పుడు ఈ డిస్కషన్లు ఎక్కువ జరుగుతున్నాయట. ఇక ఆటోమేటిక్ గా సేల్స్ కూడా పెరిగిపోతయ్ కదా మరి. ఎండాకాలం కావడంతో.. బాడీ కాస్త కూల్ అవ్వాలి అంటే బీరే శరణ్యం అనుకునే వారి సంఖ్య ఫుల్ గా పెరుగుతోందంట. అందుకే.. బీర్ల సేల్స్ ఓ రేంజ్ లో పెరుగుతున్నాయంట. మార్చిలో ఏకంగా 30 లక్షల బీర్లు అమ్మేశారట. అంటే.. ఇవన్నీ అమ్మాయిలు, ఆడాళ్లే తాగుతున్నారా అని అనుకోకండేం. కాదు కాదు లెండి.. మగవారి సంఖ్యే ఎక్కువ. కాకపోతే.. గతం కంటే.. ఉమెన్ పార్టిసిపేషన్ కూడా కాస్త ఎక్కువైందంట. అంతే. మార్చిల్నే 30 లక్షలంటే.. ఏప్రిల్ లో ఇంకో పది లక్షలు.. మే నెలలో ఇంకో పది లక్షలు పెరగొచ్చు. అంటే.. మే నెలలో 50 లక్షల పైనే సేల్ ఉండొచ్చని.. బీరు లవర్స్ లెక్కలేస్తున్నారు. తాగేస్తున్నారా.. తాగకుండా వేస్తున్నారా అనకండి. తాగకుండా వేస్తున్న లెక్కలే ఇవి.

ముగ్గురి లవ్వూ ఒకే అమ్మాయి.. గ్రౌండ్ లో తేల్చుకున్నారు
19 hours ago

ప్రధాని అయినా.. కరోనా ఆంక్షలను పట్టించుకోకుంటే ఫైన్ కట్టాల్సిందే..!
15 hours ago

లంకె బిందెలు దొరికితే మనం తీసుకోవచ్చా
21 hours ago

క్వీన్ ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత.. అధికారిక ప్రకటన
17 hours ago

ఒక్క మనిషి కరోనా రక్షణకు 618 కోట్లు
09-04-2021

ఓయూలో హృదయ కాలేయం
09-04-2021

ఓ మొగుడు..ఇద్దరు ప్రియులు..బావిలో శవం
09-04-2021

కరోనా మహమ్మారి ప్రభావం.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ
08-04-2021

కిరీటం లాగేసింది... రచ్చ రచ్చ చేసింది
08-04-2021

వసూళ్లందు.. స్కూలు ఫీజుల వసూలు వేరు
07-04-2021
ఇంకా