newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

ఒకటి కాదు.. రెండు వ్యాక్సిన్లు అని చెబుతున్న రష్యా..!

15-10-202015-10-2020 12:59:14 IST
Updated On 15-10-2020 13:04:42 ISTUpdated On 15-10-20202020-10-15T07:29:14.035Z15-10-2020 2020-10-15T07:29:10.536Z - 2020-10-15T07:34:42.928Z - 15-10-2020

ఒకటి కాదు.. రెండు వ్యాక్సిన్లు అని చెబుతున్న రష్యా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కరోనా మీద ప్రపంచం యుద్ధం చేస్తోంది. వ్యాక్సిన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు. ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటు లోకి వస్తాయని భావించినా.. అది వీలు పడడం లేదు. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించకుండా వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి తీసుకుని రావడం కూడా ప్రమాదమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇప్పటికే ట్రయల్స్ జరుగుతూ ఉండగా.. వ్యాక్సిన్ లను తీసుకున్న వాలంటీర్లకు తేడాలు కనిపించిన వార్తలు మనం విన్నాం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వ్యాక్సిన్ రావాలంటే ఇంకా కొంచెం సమయం పెట్టేలాగే ఉంది. కానీ వ్యాక్సిన్ విషయంలో రష్యా దూకుడు మాత్రం కొనసాగుతూనే ఉంది.  

ఇప్పటికే 'స్పుత్నిక్-వి' వ్యాక్సిన్ విషయంలో సంచలన ప్రకటన చేసిన రష్యా.. ఇప్పుడు మరో టీకా కూడా రాబోతోందని చెబుతోంది.  'స్పుత్నిక్-వి'లాగే ఇది కూడా ఎంతో ప్రభావశాలి అని రష్యా చెబుతోంది. సైబీరియాకు చెందిన వెక్టార్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ టీకాకు రష్యా రెగ్యులేటరీ అనుమతి ఇచ్చినట్టు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ప్రభుత్వ సమావేశంలో ఈ విషయాన్ని పుతిన్ వెల్లడించారు. రెండో టీకా అందుబాటులోకి రానుండడంపై హర్షం వ్యక్తం చేశారు. గత నెల ప్రారంభంలోనే ఈ టీకా తొలి దశ హ్యూమన్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకున్నట్టు చెప్పిన పుతిన్, ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను అభినందించారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle