newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

మంత్రి కేటిఆర్ కు కృతఙ్ఞతలు తెలిపిన ఆనంద్ మహీంద్రా

17-01-202217-01-2022 18:38:01 IST
2022-01-17T13:08:01.518Z17-01-2022 2022-01-17T13:07:58.834Z - - 25-05-2022

మంత్రి కేటిఆర్ కు కృతఙ్ఞతలు తెలిపిన ఆనంద్ మహీంద్రా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రతిష్టాత్మక ‘ఫార్ములా ఈ’వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ రేసు కోసం హైదరాబాద్‌ నగరం వేదికగా ఇవాళ ఖరారైంది. ఈ తరుణంలో సొంత రేసింగ్‌ కార్లను (మహీంద్రా రేసింగ్‌ కంపెనీ) స్వదేశంలో పరుగులు పెట్టించబోతున్నందుకు కృతజ్ఞతగా ఆనంద్‌ మహీంద్రా కేటీఆర్‌కు థ్యాంక్స్‌ చెబుతూ ఒక ట్వీట్‌ చేశారు. సొంత గడ్డపై తమ రేసింగ్‌ కార్లను ఉరుకులు పెట్టబోతున్నాయి.. చిరకాల కల నెరవేరబోతోంది. ఈ కలను నెరవర్చేదిశగా అడుగు వేసిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా.    ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో- మంత్రి కేటీఆర్‌ సంయుక్తంగా ABB FIA ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణ గురించి సోమవారం ప్రకటించారు. పనిలో పనిగా మహీంద్రా రేసింగ్ మొదటి నుంచి అందిస్తున్న మద్దతును సైతం అల్బెర్టో లాంగో ప్రస్తావించారు. ఇదిలా ఉంటే ఫార్ములా వన్‌ తరహాలో ఇ-వన్‌ ఛాంపియ్‌షిప్‌ కూడా గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నదే. ఈ రేసింగ్‌ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ప్రత్యేక రేసింగ్‌ ట్రాక్‌ అక్కర్లేని ఈ ‘ఇ వన్‌​ ఫార్ములా’ ఛాంపియన్‌షిప్‌ పోటీలు 2014 నుంచి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వ్యవస్థాపక బృందంలో మహీంద్రా రేసింగ్‌ కంపెనీ భాగస్వామిగా కూడా ఉంది. తాజాగా తొమ్మిదో సీజన్‌కి సంబంధించిన పోటీలకు సౌదీ అరేబియాలోని దిరియా నగరం వేదికగా నిలిచింది. ఆ తర్వాత నిర్వహించబోయే ఛాంపియన్‌షిప్‌కి హైదరాబాద్‌ నగరం ఆతిధ్యం ఇ‍చ్చేందుకు సిద్ధమవుతోంది.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle