newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇస్లాం పరీక్షలో హిందూ యువకుడు టాప్

18-11-202018-11-2020 10:28:54 IST
Updated On 18-11-2020 10:44:21 ISTUpdated On 18-11-20202020-11-18T04:58:54.374Z18-11-2020 2020-11-18T04:58:50.115Z - 2020-11-18T05:14:21.543Z - 18-11-2020

ఇస్లాం పరీక్షలో హిందూ యువకుడు టాప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఇతర మతాలను గౌరవించడం, ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇవ్వడం మనదేశం లోనే సాధ్యం. అందుకే హిందూ పరీక్షల్లో ముస్లింలు, ఇస్లాం పరీక్షల్లో హిందువులు మంచి మంచి ర్యాంకులను సాధిస్తూ ఉంటారు. కొద్ది నెలల కిందట ముస్లిం అమ్మాయి.. భగవద్గీత శ్లోకాలను ఏ మాత్రం పొల్లు పోకుండా చెప్పి మొదటి ర్యాంకును సాధించిన సంగతి తెలిసిందే..! ఇప్పుడు ఇస్లాం పరీక్షలో హిందూ యువకుడు టాప్ చేయడం విశేషం.

కశ్మీర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని ఇస్లాం మత విద్యను నేర్చుకోవడానికి నిర్వహించిన అఖిల భారత ప్రవేశ పరీక్షలో ముస్లిమేతర విద్యార్థి మొదటి‌ ర్యాంకు సాధించాడు. రాజస్తాన్‌కు చెందిన శుభమ్‌ యాదవ్‌ టాప్‌ ర్యాంకు సాధించాడు. హిందూ ముస్లింలు పరస్పరం ఇతర మతాల గురించి తెలుసుకోవాలనే లక్ష్యంతోనే తాను బాగా చదివానని శుభమ్ చెప్పుకొచ్చాడు. 2015లో ఏర్పాటైన కశ్మీర్‌ యూనివర్సిటీలో ఒక ముస్లిమేతరుడు టాప్‌ ర్యాంకు సాధించడం ఇదే తొలిసారి. అల్వార్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి శుభమ్ యాదవ్.

ఢిల్లీ యూనివర్సిటీలో ఫిలాసఫీ గ్రాడ్యుయేట్ అయిన 21 సంవత్సరాల శుభమ్‌ ఇస్లాంను మరింత లోతుగా తెలుసుకోవాలని అనుకుంటున్నానని వెల్లడించాడు. ‘‘ఇస్లాం మతంపై అతివాద ముద్ర పడింది. ఆ మతం గురించి  సమాజంలో ఎన్నో దురభిప్రాయాలు ఉన్నాయి. దీంతో సమాజంలో చీలికలు వచ్చాయి. అవన్నీ పోవాలంటే రెండు మతాల వారు పరస్పరం అవగాహన పెంచుకోవాలి’’అని శుభమ్‌ అభిప్రాయపడ్డారు. సివిల్ సర్వెంట్ అవ్వాలని తాను అనుకుంటూ ఉన్నానని.. ఇస్లాం గురించి తెలుసుకోవడం కూడా తన చదువులకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాడు. ఇస్లాం గురించి చదువుతాను అని చెప్పగానే.. తన తండ్రి కూడా మద్దతు ఇచ్చాడని శుభమ్ యాదవ్ వెల్లడించాడు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle