గన్ గురిపెట్టి.. ముత్తూట్ ఫైనాన్స్ నుండి 7కోట్ల విలువైన బంగారం చోరీ
23-01-202123-01-2021 10:46:07 IST
Updated On 23-01-2021 09:51:51 ISTUpdated On 23-01-20212021-01-23T05:16:07.132Z23-01-2021 2021-01-23T03:24:13.485Z - 2021-01-23T04:21:51.773Z - 23-01-2021

ముత్తూట్ ఫైనాన్స్.. ఎంతో మంది బంగారాన్ని పెట్టి వడ్డీకి డబ్బులు తీసుకుని వస్తూ ఉంటారు. తాజాగా ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీని టార్గెట్ చేసిన దుండగులు గన్ గురి పెట్టి ఏకంగా 25 కేజీల బంగారాన్ని దోచుకుని వెళ్లిపోయారు. అది కూడా పట్టపగలే ఈ చోరీ చోటు చేసుకుంది. దీని విలువ సుమారు రూ. 7.5 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నారు. తమిళనాడు పట్టణం హోసూరులో ఈ భారీ బంగారం దోపిడీ జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్‌లో దుండగులు చొరబడి రూ.7 కోట్లకు పైగా విలువ చేసే నగలు, నగదును దోచుకెళ్లారు. హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌లోకి శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఆరుగురు దుండగులు మాస్క్‌లు, హెల్మెట్లు ధరించి చొరబడ్డారు. కత్తులు, తుపాకులతో సిబ్బందిని బెదిరించి 25 కేజీల బంగారు నగలు, రూ.96 వేల నగదును బ్యాగుల్లో నింపుకుని పరారయ్యారు. శుక్రవారం ఉదయం సిబ్బంది బ్రాంచ్‌ను తెరిచారు. బ్రాంచ్ తెరిచిన కొద్దిసేపటికే కస్టమర్ల రూపంలో హెల్మెట్లు ధరించిన అయిదుగురు దుండగులు లోపలికి ప్రవేశించారు. మొదట వాచ్ మెన్ ను టార్గెట్ చేశారు.. అతడ్ని కొట్టి లోపలకు తీసుకువెళ్లారు. దుండగులు లోపలి వచ్చిన సమయంలో ఆఫీసులో నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వారిని తుపాకీతో బెదిరించి కట్టేశారు. అనంతరం లాకర్ తాళం తీసుకుని సుమారు 25కేజీలకు పైగా బంగారాన్ని, రూ. 96 వేల నగదును దోచుకెళ్లారు. ఇతర ఉద్యోగులు, సిబ్బంది ఆఫీసుకు వచ్చాక షాక్ అయ్యారు. కట్టేసి ఉన్న నలుగురిని విడిపించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బంగారు ఆభరణాల విలువ సుమారు రూ. 7.5 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దుండగులు హిందీలో మాట్లాడారని, ఉత్తరాది వారిగా అనుమానిస్తున్నట్లు సంస్థ మేనేజర్ తెలిపారు. ఈ దొంగల ముఠాను పట్టుకునేందుకు పది ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు కోయంబత్తూరు వెస్ట్ జోన్ ఐజీ పేరయ్య తెలిపారు. దోపిడీ దొంగలు కర్ణాటకకు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.

8 ఏళ్ల బాలుడ్ని మింగిన మొసలి.. పొట్టకోసి బయటికి తీశారు
8 hours ago

అదృష్టమంటే అతడిదే.. 24 కోట్ల రూపాయలు లాటరీలో సొంతం..!
10 hours ago

తిమింగలం కక్కుతో మారిన మహిళ తలరాత.. కోట్లు సొంతం
05-03-2021

రోడ్డుపై ఆగి ఊగుతున్న కారు.. లోపలున్న జంటకి ఫైన్
05-03-2021

హైదరాబాద్ కంటే.. కాకినాడ, కరీంనగర్ బెస్ట్ అట
05-03-2021

కాక్‌పిట్‌లో పైలట్‌పై పిల్లి దాడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
04-03-2021

హత్యకు కారణం అమెరికా ప్రయాణమే.. రెండు ప్రాణాలు బలి
04-03-2021

బార్స్ ఇస్తున్నయ్ ఆఫర్స్
03-03-2021

బీరు తాగుతూ కారు డ్రైవింగ్.. కియా పరిశ్రమ ముందు ఘోర యాక్సిడెంట్
02-03-2021

కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్వాడీ కార్యకర్త మృతి
01-03-2021
ఇంకా