newssting
Radio
BITING NEWS :
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా నష్టపోయి 14,883 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. * కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర - ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో హై అలర్ట్. తెలంగాణ సరిహద్దుల్లో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు. ములుగు జిల్లాకు వచ్చే వలస కూలీల విషయంలో అప్రమత్తమైన అధికారులు. పని ప్రదేశాల్లో మాస్క్ లేని కూలీలకు నో ఎంట్రీ. * ఎస్వీబీసీ ట్రస్ట్ కు భారీ విరాళం. రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో గ్రూప్ అధినేత సంజయ్ పస్సి. టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి డీడీ అందజేత. * జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడి దాడి. అధిక శబ్దం చేస్తూ వెళ్తున్న బైక్ ను అడ్డుకున్న పోలీసులు. బైక్ ను ఆపినందుకు స్నేహితులతో కలిసి ట్రాఫిక్ సీఐ ముత్తు, సిబ్బందిపై దాడి. నిందితుడు దర్వేజ్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * మాదాపూర్ కు చెందిన వ్యాపారిని కిడ్నాప్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అమర్నాథ్ ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ అనంతరం అమర్నాథ్ భార్యకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. అనంతరం 80 ఫోన్ కాల్స్ చేసిన గ్యాంగ్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అరెస్ట్. * ఏపీలో రేపట్నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన. మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్న నిమ్మగడ్డ.

ఆడియన్స్ ని ఆకట్టుకుంటోన్న జాంబీరెడ్డి కరోనా సాంగ్

16-01-202116-01-2021 16:15:06 IST
Updated On 16-01-2021 16:23:34 ISTUpdated On 16-01-20212021-01-16T10:45:06.968Z16-01-2021 2021-01-16T09:09:31.422Z - 2021-01-16T10:53:34.873Z - 16-01-2021

ఆడియన్స్ ని ఆకట్టుకుంటోన్న జాంబీరెడ్డి కరోనా సాంగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశపు తొలి జాంబి చిత్రంగా ప్రేక్షకులముందుకు వస్తోంది జాంబీరెడ్డి మూవీ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్నాడు. ఈ మూవీలో బాల నటుడిగా పేరు తెచ్చుకున్న తేజ సజ్జ హీరోగా పరిచయమవుతున్నాడు. కాగా ఈ మూవీలో ఆనంది..దక్ష నగార్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన చిత్ర యూనిట్.. 'జాంబీ రెడ్డి' ఫస్ట్ బైట్ - బిగ్ బైట్ తో సినిమాపై అంచనాలు కలిగించారు. ఈ క్రమంలో తాజాగా చిత్రంలోని 'గో కరోనా' సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

'ఇంట్లోనే ఉండమంటే ఊరుకుంటమా.. రోడ్లన్నీ ఖాళీగా ఉంటే రాక ఉంటమా.. ఎవడెన్ని చెప్తా ఉన్నా మేము వింటమా.. మా వీపు పగిలే వరకు మానుకుంటమా' అంటూ సాగిన ఈ పాటకు మార్క్ కె రాబిన్ ట్యూన్ ఇచ్చారు. గో కరోనా సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో జరిగిన ఇన్సిడెంట్స్ తో ఈ 'గో కరోనా' సాంగ్ ఉండనుంది. చప్పట్లు కొట్టమంటే డప్పులు కొట్టామని.. దీపాలు వెలిగించమంటే క్రాకర్స్ కాల్చారని.. వైరస్ ని లెక్కచేయకుండా వైన్ షాపుల ముందు బారులు తీరారని.. ఇలా అన్ని విషయాలను ఇందులో ప్రస్తావించారు. దీనికి మామా సింగ్ లిరిక్స్ అందించదంతో పాటు ర్యాప్ పాడారు. ఈ పాటను అనుదీప్ - శ్రీకృష్ణ - మార్క్ కె రాబిన్ కలిసి ఆలపించారు.

మొత్తం మీద గో కరోనా సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. 'జాంబీ రెడ్డి' చిత్రానికి స్క్రిప్ట్స్ విల్లే స్క్రీన్ ప్లే అందించగా.. అనిత్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. సాయిబాబు ఎడిటింగ్ వర్క్ చేశారు. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రఘుబాబు - పృథ్వీరాజ్ - జబర్దస్త్ శ్రీను - హేమంత్ - హరితేజ - అన్నపూర్ణమ్మ - కిరీటి - రమరఘు కీలక పాత్రలు పోషించారు. ఇండియాలో జాంబీల కాన్సెప్ట్ తో వస్తున్న ఫస్ట్ సినిమా 'జాంబీ రెడ్డి' ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. హీరోగా తేజ ఏ మేరకు సక్సెస్ అవుతాడో.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle