newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

త్రివిక్ర‌మ్ తో ఈ డైరెక్ట‌ర్ కి అన్యాయం జ‌రుగుతోందా

16-01-202116-01-2021 11:15:53 IST
Updated On 16-01-2021 11:10:32 ISTUpdated On 16-01-20212021-01-16T05:45:53.635Z16-01-2021 2021-01-16T05:06:46.734Z - 2021-01-16T05:40:32.850Z - 16-01-2021

త్రివిక్ర‌మ్ తో ఈ డైరెక్ట‌ర్ కి అన్యాయం జ‌రుగుతోందా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏం జ‌రుగుతోంది. అస‌లు ఏం జ‌రిగింది. ఎలా జ‌ర‌గ‌బోతోంది. ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు. కానీ.. ఒక స్టార్ ఉంటే.. మిగ‌తా వాళ్ల లైటింగ్ అంతా డిమ్ లోకి వెళ్లిపోతుంది. ఎందుకంటే స్టార్ తో వ‌చ్చే లైటింగ్ ఎక్కువ కదా. ఇప్పుడు కూడా తెలుగు ఇండ‌స్ట్రీలో ఓ యంగ్ డైరెక్ట‌ర్ విష‌యంలో అదే జ‌రుగుతున్న‌ట్లు అనిపిస్తోంది. త్రివిక్ర‌మ్ పేరు బ‌య‌టికి రావడంతో.. యంగ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్ర పేరు మాయం అవుతోంది. 

యాక్చువ‌ల్ గా మొన్న‌టి వ‌ర‌కు జ‌రిగింది వేరు. విన్న‌ది వేరు. సాగ‌ర్ చంద్ర అనే డైరెక్ట‌ర్ అప్ప‌ట్లో ఒక‌డుండే వాడు అనే బంప‌ర్ హిట్ మూవీ తీశాడు. ఆ సినిమాలో ఎంట‌ర్ టైన్ మెంట్ యాంగిల్ నుంచి.. రొమాంటిక్ యాంగిల్ దాకా.. యాక్ష‌న్ సీక్వెన్సుల నుంచి.. సోష‌ల్ మెస్సేజ్ ల దాకా అన్నీ ఉన్న‌య్. హీరోయిజం ఎలివేష‌న్ లో కూడా ఎక్క‌డా తగ్గ‌లేదు. జ‌స్ట్ హీరోలు ఇద్ద‌రూ పెద్ద‌గా స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్లు కాదు అనే త‌ప్ప‌.. అందులో స్టార్ డ‌మ్ కి ఎలాంటి ప్రాబ్ల‌మ్ ఉండ‌దు. అంతా హీరోయిక్ మూవీ.. అండ్ అన్నీ ఉన్న సినిమా. ఆ చిన్న సినిమాలో.. పెద్ద స్టార్ల‌ని ఊహించుకున్నా ఎక్క‌డా త‌క్కువ కాదు. అలాంటి సినిమా క‌ర్త క‌ర్మ క్రియ అన్నీ సాగ‌ర్ చంద్ర‌. అంటే.. అద్భుత‌మైన క్రియేట‌ర్ అద్భుత‌మైన టెక్నీషియ‌న్ అనే విష‌యంలో ఎలాంటి డౌటూ లేదు. 

త‌నే అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌న్ అనే సినిమాని టేకప్ చేశాడ‌ని.. తెలుగులోకి మారుస్తున్నాడ‌ని.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం.. త‌న స్టైల్ కోసం.. త‌న మేన‌రిజ‌మ్స్ కోసం అన్నీ మార్పులూ చేర్పులూ చేస్తున్నాడు అని విన్నాం. డైరెక్ష‌న్ వేరే వాళ్లు చేస్తార‌ని.. సాగ‌ర్ చంద్రకి పెద్ద స్టార్ల‌ని డీల్ చేసిన ఎక్స్ పీరియ‌న్స్ లేదు కాబ‌ట్టి.. ఎక్కువ సినిమాలు చేసిన ఎక్స్ పీరియ‌న్స్ లేదు కాబ‌ట్టి.. పెద్ద డైరెక్ట‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ని డైరెక్ట్ చేస్తాడు అనుకున్నాం. కానీ.. స‌డ‌న్ గా డైరెక్ష‌న్ కూడా సాగ‌ర్ చంద్రే చేస్తాడు. ఆ స్టోరీ మార్చింది.. అంతా తానే కాబ‌ట్టి.. త‌న‌కే ప‌ట్టు ఉంటుంది అని.. అత‌న్నే డైరెక్ట‌ర్ గా తీసుకొస్తున్నాం అన్నారు. అంతా ఓకే.. యంగ్ డైరెక్ట‌ర్ కి బంప‌ర్ ఛాన్స్ ద‌క్కింది అనుకున్నాం.

అంతా వెల్ అండ్ గుడ్. సూప‌ర్ పేప‌ర్ అస‌లు. కానీ.. ఇప్పుడు స‌డ‌న్ గా.. త్రివిక్ర‌మ్ పేరు బ‌య‌టికొచ్చింది. త‌నేదో డైలాగ్ లు యాడ్ చేస్తున్నాడు అన్నారు మొన్న‌టి దాకా. ఇప్పుడేమో అంతా త్రివిక్ర‌మే అంటున్నారు. మాట‌లు రాసినంత మాత్రాన‌.. అంతా తానై పోతాడా. క్యాస్టింగ్ విష‌యం కానీ.. టెక్నీషియ‌న్స్ విష‌యంలో కానీ.. త్రివిక్ర‌మ్ ఫుల్ స‌పోర్ట్ చేయొచ్చు. పెద్దాడు కాబ‌ట్టి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ వెల్ విష‌ర్ కాబ‌ట్టి.. ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌ర‌గొచ్చు.

కానీ.. ఇప్పుడు మొత్తం త్రివిక్ర‌మే.. ఓన్లీ డైరెక్ష‌న్ ఒక్క‌టే సాగ‌ర్ చంద్ర చేస్తున్నాడు.. అది కూడా త్రివిక్ర‌మ్ ఓకే చెప్ప‌మ‌న్న చోట ఓకే చెబుతాడు. క‌ట్ చెప్ప‌మ‌న్న చోట క‌ట్ చెబుతాడు అన్న‌ట్లు క్రియేట్ అయింది సీన్. చూస్తుంటే.. ఇదంతా ఏదో స్ట్రాట‌జీలా ఉంది అనే టాక్ కూడా బ‌య‌టికి వ‌స్తుంది. మార్కెటింగ్ యాంగిల్ లో అంతా త్రివిక్ర‌మే చేశాడు అంటే.. ఆ రేంజ్ వేరే ఉంటుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ రేంజ్ కి.. త్రివిక్ర‌మ్ రేంజ్ యాడ్ అయితే.. బ్యాలెన్సింగ్ గా ఉంటుంది అని.. త్రివిక్ర‌మ్ పేరు ఫుల్లుగా వాడేస్తున్నారు అనే టాక్ ఉంది. అంతా స‌రే.. కానీ.. ఇక్క‌డ సాగ‌ర్ చంద్ర మాయం అయిపోతున్నాడు అనే పాయింట్ ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. టాలెంట్ ఉన్న ఓ యంగ్ డైరెక్ట‌ర్ ని డ‌మ్మీని చేస్తున్నారు అనే విష‌యం ఎవ‌రికీ అర్దం కావ‌డం లేదు. వింటున్న‌ది అంతా నిజ‌మేనా.. మార్కెటింగ్ స్ట్రాట‌జీ కోసం ఇలా జ‌రుగుతుందా అనే డౌట్స్ బానే ఉన్న‌య్.

సినిమా ఏకీ నంబ‌ర్.. రెమ్యున‌రేష‌న్ ఏకీ క్రోర్

సినిమా ఏకీ నంబ‌ర్.. రెమ్యున‌రేష‌న్ ఏకీ క్రోర్

   19 hours ago


విజ‌య‌శాంతిలా ఇష్యూ చేస్తున్న స‌మంత

విజ‌య‌శాంతిలా ఇష్యూ చేస్తున్న స‌మంత

   21 hours ago


అన్న‌ద‌మ్ముల బాక్సాఫీస్ ఫైట్.. నెగ్గేది ఎవ‌రు..? త‌గ్గేది ఎవ‌రు..?

అన్న‌ద‌మ్ముల బాక్సాఫీస్ ఫైట్.. నెగ్గేది ఎవ‌రు..? త‌గ్గేది ఎవ‌రు..?

   07-03-2021


ఈ సినిమా వాళ్ల‌కి దొబ్బేసే అల‌వాటు ఎప్పుడు పోతుంది

ఈ సినిమా వాళ్ల‌కి దొబ్బేసే అల‌వాటు ఎప్పుడు పోతుంది

   07-03-2021


జాతిర‌త్నంతో అనుష్క రొమాన్స్

జాతిర‌త్నంతో అనుష్క రొమాన్స్

   07-03-2021


భీష్మ డైరెక్ట‌ర్ ని ఎలా బురిడీ కొట్టించాడు.. మొత్తం క‌థ

భీష్మ డైరెక్ట‌ర్ ని ఎలా బురిడీ కొట్టించాడు.. మొత్తం క‌థ

   05-03-2021


నాని సినిమాపై హాట్ బేబీ కంప్లైంట్.. ఆపేయాలన్న బాంబే హైకోర్టు

నాని సినిమాపై హాట్ బేబీ కంప్లైంట్.. ఆపేయాలన్న బాంబే హైకోర్టు

   05-03-2021


ప్ర‌దీప్ సినిమాకి అన్ని కోట్లా.. అందుకే సినిమాలకి ఇంత‌ క్యూ

ప్ర‌దీప్ సినిమాకి అన్ని కోట్లా.. అందుకే సినిమాలకి ఇంత‌ క్యూ

   04-03-2021


బాల‌య్య బాబూ.. ప్లీజ్ ఓకే చెప్పండి

బాల‌య్య బాబూ.. ప్లీజ్ ఓకే చెప్పండి

   03-03-2021


హీరో ఏజ్ 50.. హీరోయిన్ ఏజ్ 20.. క్యార‌వ్యాన్ లో ఏం జ‌రుగుతోంది

హీరో ఏజ్ 50.. హీరోయిన్ ఏజ్ 20.. క్యార‌వ్యాన్ లో ఏం జ‌రుగుతోంది

   03-03-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle