newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

నిన్న వైఎస్ జగన్ - నేడు జయప్రద..!

30-09-202030-09-2020 20:13:48 IST
2020-09-30T14:43:48.178Z30-09-2020 2020-09-30T14:42:40.292Z - - 20-10-2020

నిన్న వైఎస్ జగన్ - నేడు జయప్రద..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ప్రధాని మోడీకి లేఖ రాయడం తెలిసిందే. హీరో అర్జున్ బాలుకు భారతరత్న ఇవ్వాలని.. దీని కోసం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ  సినీ పరిశ్రమ మొత్తం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీంతో బాలుకు భారతరత్న డిమాండ్ ఊపందుకుంది. కోలీవుడ్ లో సైతం బాలుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఉంది. భాషలకు అతీతంగా బాలును ఓన్ చేసుకున్నారు.

 టాలీవుడ్ లో ఆర్పీ పట్నాయక్, చంద్రసిద్ధార్ధ, చైతన్య ప్రసాద్ తదితరులు బాలుకు భారతరత్న ఇవ్వాలని ఆ అవార్డ్ ఇస్తే భారతరత్నకే గొప్పతనం మరింత పెరుగుతుందన్నారు.ఏపీ సీఎం  వై.ఎస్ జగన్ బాలుకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ మోడీకి లేఖ రాయడం పై కమల్ హాసన్ స్పందిస్తూ.. జగన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. ఇప్పుడు సీనియర్ హీరోయిన్ జయప్రద రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీలకు లేఖ రాశారు. బాలుకు భారతరత్న ఇవ్వాలని లేఖలో కోరారు.

 దాదాపు 45 వేల పాటలు పాడిన బాలును భారతరత్నతో గౌరవించడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని లేఖలో పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు.

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle