newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

నాగ్ - లారెన్స్ కాంబినేషన్ లో మూవీ రానుందా..?

29-10-202029-10-2020 19:58:09 IST
Updated On 30-10-2020 07:52:36 ISTUpdated On 30-10-20202020-10-29T14:28:09.872Z29-10-2020 2020-10-29T14:27:48.539Z - 2020-10-30T02:22:36.979Z - 30-10-2020

నాగ్ - లారెన్స్ కాంబినేషన్ లో మూవీ రానుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో మరచిపోలేని సినిమాల్లో మాస్ ఒకటి. ఈ సినిమాకి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. లారెన్స్ ఉన్న దర్శకత్వ ప్రతిభను గుర్తించింది నాగార్జునే. మాస్ తర్వాత నాగార్జున - లారెన్స్ కలిసి మరో సినిమా చేసారు. అదే డాన్. ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. నాగార్జునకి మంచి విజయాన్ని అందించింది. హీరోను మాస్ గా స్టైలీష్ గా ఎలా చూపించాలో లారెన్స్ కి బాగా తెలుసు. అందుకనే నాగార్జునని చాలా స్టైలీష్ గా చూపించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు లారెన్స్.

మాస్, డాన్ తర్వాత నాగ్ - లారెన్స్ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే... నాగ్ వేరే సినిమాల్లో బిజీగా ఉండడం... లారెన్స్ వరుసగా హర్రర్ మూవీస్ చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. లారెన్స్ ని నాగార్జునతో సినిమా గురించి అడిగితే... ఖచ్చితంగా నాగార్జునబాబుతో సినిమా చేస్తాను. ఈసారి మరింత మాస్ గా, మరింత స్టైలీష్ గా చూపిస్తానన్నారు. ఇదిలా ఉంటే... ఈ రోజు లారెన్స్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నాగార్జున ట్విట్టర్ లో స్పందిస్తూ... లారెన్స్ చేస్తున్న బాలీవుడ్ మూవీ లక్ష్మీ బాంబ్ సక్సస్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

వాస్తవ ఘటనకు సజీవ దృశ్యం ' టేక్ ఆఫ్'

దీనికి లారెన్స్ స్పందిస్తూ... అంతా మీ ఆశీర్వాదం వలనే నాగార్జున బాబు అంటూ ధన్యవాదాలు తెలియచేసాడు. ఈ విధంగా నాగార్జున - లారెన్స్ మధ్య జరిగిన ట్విట్టర్ టాక్ చూసిన అభిమానులు మాస్ 2 లేదా డాన్ 2 తీయాలి అని కోరుతున్నారు. మరి.. లారెన్స్ నాగ్ తో కానీ చైతు, అఖిల్ తో కానీ సినిమా ప్లాన్ చేస్తాడేమో చూడాలి.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle