రామ్ గోపాల్ వర్మ ఇక సినిమాల దుకాణం సర్దేయాల్సిందేనా..?
08-05-202208-05-2022 07:25:54 IST
2022-05-08T01:55:54.081Z08-05-2022 2022-05-08T01:55:50.834Z - - 08-08-2022

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ట్విట్టర్ లో పోస్ట్ లు ఎంతలా సంచలనం సృష్టిస్తాయో తెలిసిందే. అయితే 'శివ' చిత్రంతో తెలుగు సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆయనకు దారుణంగా అవమానం జరిగింది. ఆయన తెరకెక్కించిన తాజాగా మూవీ 'మా ఇష్టం'. ఇద్దరు లేడీ లెస్బియన్ ల కథతో ఈ సినిమాని ఆయన రూపొందించారు. వివాదాస్పద కథాంశం కావడంతో దీని చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. ఏకంగా పీవీఆర్ సినిమాస్ గ్రూప్ థీయేటర్స్ వర్మ చిత్రాన్ని ప్రదర్శించలేమంటూ బహిష్కరించాయి. వర్మ ఈ మధ్య నాకు నచ్చినట్టే తీస్తానని చూస్తే చూడండి లేదంటే మీ ఖర్మ అని బాహాటంగానే అనడం, పైగా వర్మ సినిమాల్లో కంటెంట్ బూతద్దం పెట్టి చూద్దామన్నా కనిపించకపోవడంతో ప్రేక్షకులు ఆసక్తిని చూపించడం లేదు. ఇక ఈ సినిమాకు హైదరాబాద్ లో దొరికిన థియేటర్ ఒక్కటే. అది కూడా రెండు ఆటల ఒప్పందంతో కావడం గమనార్హం. ఈ రెండు ఆటలకు కూడా ఓ ట్విస్ట్ వుంది. మే 12న సూపర్ స్టార్ మహేష్ నటించిన 'సర్కారు వారి పాట' రిలీజ్ కాబోతోంది. అంత వరకు మాత్రమే వర్మ 'మా ఇష్టం' రెండు షోలు ప్రదర్శన. ఆ తరువాత నుంచి అది కూడా వుండదు. మెయిన్ సిటీలోనే ఇలా వుంటే ఇతర సిటీలల్లో వర్మ సినిమా పరిస్థితి మరీ దారుణంగా మారిందంటున్నారు. పేరు లేని డైరెక్టర్ లు తీసే సినిమాలకు రెండు మూడు థియేటర్లు లభిస్తున్న ఈ రోజుల్లో ట్రెండ్ సెట్టర్ సినిమాలని తీసిన దర్శకుడు వర్మ చిత్రానికి ఒక్క థియేటర్ మాత్రమే లభించి అందులో రెండు ఆటలకు మాత్రమే పర్మీషన్ లభించడం ఆయనకు దక్కిన దారుణ అవమానం కాక మరేంటీ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. దీంతో వర్మ పని అయిపోయిందని చెబుతున్నారు. ఒకప్పుడు వర్మ సినిమా అంటే ఆ క్రేజే వేరు. ఆ హంగామానే వేరుగా వుండేది. తొలి రోజు సినిమా చూడాలని అభిమానులు ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్లకు తరలి వచ్చేవారు. కానీ పరిస్థితి మారింది. వర్మ సినిమాకు క్రేజ్ పూర్తిగా పడిపోయింది. ఒక్క థియేటర్ అందులో రెండు షోలు.. అది కూడా కేవలం ఆరు రోజులకు పడిపోవడంతో వర్మ ఇక దుకాణం సర్దేయాల్సిందే అంటున్నారు.

ఆమె అద్భుతమైన డ్యాన్సర్ ....!
14-05-2022

బ్లాక్బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సర్కారువారి పాట
12-05-2022

ఆ నాలుగు థియేటర్లలో 'సర్కారు వారి పాట' 6 షోలు
11-05-2022

రెండు సిల్వర్ ట్రోఫీలు దక్కించుకున్న బాలయ్య `అన్ స్టాపబుల్` షో
11-05-2022

విజయ్ సినిమాలో శ్రీకాంత్..!
11-05-2022

ఆచార్య ఫ్లాప్ లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాత్ర కూడా
10-05-2022

ప్రభాస్ కు జోడీగా మాళవిక ..!
09-05-2022

తీవ్ర నష్టాలలో ఉన్న ఆచార్య డిస్టిబ్యూటర్లకి మెగాస్టార్ అభయం ఇస్తారా..?
09-05-2022

కాజల్ కు షాక్ ఇచ్చిన నెటిజన్లు ..!
08-05-2022

మహేశ్ బాబు మంచి ఫీల్డర్.. సంగీత దర్శకుడు తమన్ కామెంట్
08-05-2022
ఇంకా