భార్య గ్లామర్ ఇమేజ్ ని బిజినెస్ కోసం.. సక్సెస్ అయ్యేనా?
05-12-202005-12-2020 20:42:12 IST
Updated On 06-12-2020 09:21:50 ISTUpdated On 06-12-20202020-12-05T15:12:12.139Z05-12-2020 2020-12-05T15:12:05.553Z - 2020-12-06T03:51:50.159Z - 06-12-2020

టాలీవుడ్ చందమామ..స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గ్లామర్ ని ఆమె భర్త గౌతమ్ కిచ్లు తన బిజినెస్ ల కోసం ఉపయోగించుకోనున్నారట. అదేంటి అనుకుంటున్నారా..తన చిరకాల మిత్రుడు కం బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని కాజల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. హనీమూన్ ముగియగానే కాజల్ తదుపరి షెడ్యూల్స్ పై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆచార్య చిత్రీకరణ కోసం కాజల్ వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు.. కాజల్ అగర్వాల్ తన భర్త కిచ్లుకి చెందిన ఇ-కామర్స్ సంస్థ `డిస్కర్న్ లివింగ్` కి ముఖచిత్రంగా మారనుందన్న సమాచారం అందింది. ఈ సంస్థ త్వరలోనే కాజల్ తో బ్రాండ్ పబ్లిసిటీకి సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించబోతోందిట. ఆ మేరకు వివరాల్ని కాజల్ అగర్వాల్ స్వయంగా వరుస ట్వీట్లలో తెలియజేశారు. డిస్కెర్న్ లివింగ్ అనేది ముంబైకి చెందిన ఇ-కామర్స్ సంస్థ. ఇది ఇంటీరియర్ డిజైన్ గృహాలంకరణలో ప్రత్యేకత కలిగి ఉన్న సంస్థ. కాజల్ ఇటీవల తమ సంస్థకు చెందిన ప్రకటన కోసం షూటింగ్ లోనూ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయని టాక్. ఇదిలావుండగా కాజల్ త్వరలో హైదరాబాద్ లో ఆచార్య సెట్స్ లో చేరనుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి- కాజల్ హీరోహీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా మరో మరో కీలక పాత్రలో చిరంజీవి తనయుడు..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించనున్నారు. ప్రస్తుతం చరణ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ షూట్ తో బిజీగా ఉన్నాడు. గమనం ట్రైలర్.. ఎమోషన్ పండింది.. ఆసక్తి పెంచింది..! 4 ఏళ్ళ నుంచి అన్ని ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. అయితే పెళ్ళి తర్వాత గ్లామర్ పాత్రలు కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలపై ఫోకస్ చేయబోతుంది కాజల్. ప్రస్తుతం ఈమె తెలుగులో చిరంజీవి ఆచార్యతో పాటు మంచు విష్ణు మోసగాళ్లు సినిమాలో నటిస్తుంది. తమిళనాట భారతీయుడు 2లో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చింది కాజల్. అయితే ఇప్పటి వరకు కెరీర్లో ఎప్పుడూ టచ్ చేయని హార్రర్ పాత్రలో కాజల్ కనిపించబోతుందని తెలుస్తుంది. డీకే దర్శకత్వంలో ఈ సినిమా రానుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కథ విన్న చందమామ ఓకే చెప్పేసింది కూడా. ఇందులో కాజల్ కిచ్లుతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా నటించబోతున్నారు. ఇవన్నీ పక్కనపెడితే కాజల్ గ్లామర్ గౌతమ్ కి బిజినెస్ కి ఏ మేరకు యూజ్ అవుతుందో చూడాలి.

ధర్మస్థలి ఇలా ఉండబోతోంది.. ఆసక్తిని పెంచేస్తున్న 'ఆచార్య'
an hour ago

సైనా నేహ్వాల్ బయోపిక్..డిజిటల్ రిలీజ్ కి రెడీ
24 minutes ago

బుట్టబొమ్మకు బుట్టనిండా డబ్బులు కావాలట
3 minutes ago

మిథాలీ రాజ్ బయోపిక్ కోసం తాప్సీ ట్రైనింగ్..కష్టే ఫలి
an hour ago

బికినీ వేసి బుట్ట చేత పట్టుకున్న విదేశీ బ్యూటీ..వైరల్ గా పిక్
2 hours ago

శృతిహాసన్ బర్త్ డే..సలార్ హీరోయిన్ గా ఫిక్స్
4 hours ago

గూస్ బంబ్స్ వచ్చేలా పుష్ప పోస్టర్..రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన బన్నీ
5 hours ago

ఎడారిలో పుషప్స్..దటీజ్ తాప్సీ
21 hours ago

మాస్టర్ టీం కి అమెజాన్ షాక్...ఏం జరిగింది..
21 hours ago

ఎద సంపదతో ఎదలను కోసేస్తుందే..
9 hours ago
ఇంకా