newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంటర్ (FNCC) రీ- ఓపెనింగ్ ఎప్పుడు..?

29-09-202029-09-2020 13:42:11 IST
2020-09-29T08:12:11.198Z29-09-2020 2020-09-29T08:12:07.291Z - - 30-10-2020

ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంటర్ (FNCC) రీ- ఓపెనింగ్ ఎప్పుడు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

క‌రోనా మ‌హ‌మ్మారీ భ‌యాల‌తో సినీప‌రిశ్ర‌మ స‌న్నివేశం తెలిసిన‌దే. అయితే ఇప్పుడిప్పుడే స్టార్లు షూటింగుల‌కు రెడీ అవుతుంటే త్వ‌ర‌లోనే థియేట‌ర్లు తెరిపించేందుకు కేంద్రం నుంచి మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల కానున్నాయ‌ని తెలుస్తోంది. అయితే... సినిమా ప్రముఖులు ఏర్పాటు చేసుకున్న ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కరోనా కారణంగా మూతపడింది. సాయంత్రం అయ్యిందంటే... సినీ ప్రముఖులు చేరేది ఇక్కడికే. ఇప్పుడు ఇది మూతపడడంతో ఎవరి ఇంట్లో వాళ్లే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం పర్మిషన్స్ ఇస్తుండడంతో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కూడా రీ ఓపెనింగ్ కి రెడీ అవుతుంది.

తాజాగా ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంటర్ (FNCC) రీ- ఓపెనింగ్ కి స‌న్నాహాలు చేస్తున్నారని తెలిసింది. అక్టోబర్ ఒకటవ తేదీ  2020 నుండి అల్పాహారం, ఎగ్జిక్యూటివ్ లంచ్, టేక్-అవే ఫుడ్, సండే బఫే, స్పోర్ట్స్ విభాగం, స్పా & గెస్ట్ రూమ్ ల సేవలతో ఎఫ్‌.ఎన్.‌సి.సి తెరిచి ఉంటుంది.  కోవిడ్ -19 కు వ్యతిరేకంగా సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ ఐడీ కార్డ్ ఉన్న స‌భ్యుల‌ను మాత్రమే అనుమ‌తించ‌నున్నారు. ప్రవేశానికి ఫేస్ మాస్క్ .. టెంప‌రేచ‌ర్ థ‌ర్మ‌ల్ తనిఖీ ఏర్పాట్లు ఉంటాయి. అతిథులు మాత్రం ఖచ్చితంగా అనుమతించరు అని తెలియచేసారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle