newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

పాపం వినాయక్.. బాగా ఫీలయ్యాడట..!

10-10-202010-10-2020 11:10:47 IST
2020-10-10T05:40:47.964Z10-10-2020 2020-10-10T05:40:46.390Z - - 21-10-2020

పాపం వినాయక్.. బాగా ఫీలయ్యాడట..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

డైనమిక్ డైరెక్టర్ వినాయక్.. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 తెరకెక్కించిన తర్వాత సరైన సినిమా చేయలేదు. కెరీర్ లో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో ఎవరూ ఊహించని విధంగా మెగాఫోన్ పక్కన పెట్టి యాక్టర్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. శీనయ్య అనే సినిమాలో మెయిన్ లీడ్ గా నటించడానికి ఒప్పుకోవడం.. షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది కానీ.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆగింది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఈ సినిమాని ప్రారంభించారు.

కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆగింది. ఇదిలా ఉంటే.. వి.వి. వినాయక్ చిరుతో లూసీఫర్ రీమేక్ చేయనున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు చేసారు. చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే... ఆచార్య తర్వాత చిరంజీవి వినాయక్ తో లూసీఫర్ రీమేక్ స్టార్ట్ చేస్తారో..? మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ చేస్తారా..? అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఆచార్య షూటింగ్ ని వచ్చే నెలలో స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే నెక్ట్స్ ఏ సినిమా చేయాలి అనేది ఫైనల్ చేస్తారని సమాచారం. అయితే.. వినాయక్ పుట్టినరోజు ఈ నెల 9న. ఈ సందర్భంగా చిరు తనతో చేయనున్న మూవీని ఎనౌన్స్ చేస్తారని వినాయక్ ఆశించారట.

అయితే... ఆచార్య తర్వాత ఎవరితో సినిమా చేయాలనేది చిరు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అందుచేత వినాయక్ తో లూసీఫర్ రీమేక్ ని ఎనౌన్స్ చేయలేదు కానీ.. వినాయక్ మాత్రం తన పుట్టినరోజు సందర్భంగా ఎనౌన్స్ చేస్తారనుకున్నారట. అలా జరగకపోవడంతో బాగా ఫీలయ్యారని సమాచారం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle