newssting
Radio
BITING NEWS :
ఏపీలో జరుగుతున్న విగ్రహాల విధ్వంసాల వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రకటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. డీజీపీ వ్యాఖ్యలపై సోము వీర్రాజు అభ్యంతరం, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు. 200 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్, మంగళగిరి పీఎస్ కు తరలింపు. * కృష్ణాజిల్లా కంచికచర్లలో హవాలా నగదు కలకలం. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్న కోటి రూపాయల నగదు స్వాధీనం, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * తిరుపతిలో టీడీపీ ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు. ర్యాలీకి నిబంధనలు పాటించలేదని అనుమతి రద్దు చేసిన పోలీసులు. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారని ప్రశ్నించిన చంద్రబాబు. * హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ ఆధ్వర్యంలో సెలబ్రేటింగ్ అమెరికా కార్యక్రమం ప్రారంభం. * కూకట్ పల్లిలో దారుణం. టీవీ చూస్తున్న కన్నకొడుకుని దారుణంగా హతమార్చిన తండ్రి. ఈ నెల 18న కొడుకు చరణ్ కు నిప్పుపెట్టిన తండ్రి. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం చరణ్ మృతి. * హుజూరాబాద్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురిని హతమార్చిన భర్త. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్.

తెగ వైరలవుతున్న విరాటపర్వం పోస్టర్ లుక్

14-01-202114-01-2021 08:52:58 IST
2021-01-14T03:22:58.364Z14-01-2021 2021-01-13T19:24:19.692Z - - 21-01-2021

తెగ వైరలవుతున్న విరాటపర్వం పోస్టర్ లుక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నక్సలైట్లపై ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. ఇదే నేపథ్యంలో ఇప్పుడు మరోమూవీ ప్రేక్షకులముందుకి రానుంది. ఆ చిత్రమే విరాటపర్వం. ఈ మూవీ ఆద్యంతం నక్సలైట్స్..అడవులు ఇలానే సాగుతుందట. అంతేకాదండోయ్ లవ్ కూడా ఉందట ఈ స్టోరీలో. ఈ చిత్రం నుండి కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసిందీ చిత్ర బృందం. ఈ పోస్టర్ చూస్తోంటే ఓ ప్రేమజంట కనిపిస్తున్నారు. ఈ ప్రేమ జంట కుహూగానం గమ్మత్తుగా ఉంది. అడవిలో పచ్చందాల నడుమ గుట్టుగా సాగుతున్న ప్రేమాయణంలా కనిపిస్తోంది. ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవితో.. భళ్లాలుడు రానా లవ్ వ్యవహారం `విరాఠపర్వం` పోస్టర్ లో స్పష్ఠంగా కనిపిస్తోంది.

అడవిలో అన్నతో సాయి పల్లవి ప్రేమాయణం ఏమిటో! అనే సందేహం కలుగుతోందా? దేనికైనా ఓ పర్పస్ ఉంటుంది. పైగా అన్నలు నక్సల్స్ కి 80-90లలో ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు.ఊళ్లో విప్లవభావాలున్న యువతరం అన్నల్లో చేరేవారు. వాళ్లకు అదే ఊరిలో గాళ్స్ లోనూ ఫ్యాన్స్ ఉండేవారు. ఇప్పుడు అలాంటి ఓ ప్రేమకథనే తెరపై చూపిస్తున్నారా దర్శకుడు వేణు ఉడుగులనే దీనికి సమాధానం చెప్పాలి. రానా- సాయిపల్లవి జంట ఎంతో నేచురల్ గా లవ్ లీగా కనిపిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ -SLV సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కాగా విరాటపర్వం చిత్రంలో జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో నక్సలిజం కాన్సెప్ట్.. 90ల నాటి బ్యాక్ డ్రాప్ ఆద్యంతం ఉత్కంఠ గా సాగనున్నాయి. రానా బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ వైరల్ గా ఆకట్టుకుంది. ఈ మూవీ రిలీజ్ తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే ఉంటుందని అభిమానులు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. నక్సలైట్ డ్రెస్ లో రానా..సాదా సీదా లంగావోణీలో సాయిపల్లవి అదిరిపోయారు.వారిద్దరు చక్కటి స్మైల్ కూడా వీక్షకులని ఆకట్టుకుంటోంది. సినిమా ఎలా ఉంటుందో తెలియదుగాని పోస్టర్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.

తన డేటింగ్ లవ్ స్టొరీ చెప్పి నవ్వించిన అక్షయ్

తన డేటింగ్ లవ్ స్టొరీ చెప్పి నవ్వించిన అక్షయ్

   3 hours ago


ఆరడుగుల హీరోలతో సాయిపల్లవి.. హైట్ నో మ్యాటర్

ఆరడుగుల హీరోలతో సాయిపల్లవి.. హైట్ నో మ్యాటర్

   4 hours ago


వ‌ద‌లం బొమ్మాళీ వ‌ద‌లం.. దండాలు పెట్టినా వ‌ద‌లం డ్ర‌గ్స్ బేబీ

వ‌ద‌లం బొమ్మాళీ వ‌ద‌లం.. దండాలు పెట్టినా వ‌ద‌లం డ్ర‌గ్స్ బేబీ

   6 hours ago


అజయ్ దేవ్ గన్ కి రాజమౌళి సాయం.. హైదరాబాద్ లో మేడే షూట్

అజయ్ దేవ్ గన్ కి రాజమౌళి సాయం.. హైదరాబాద్ లో మేడే షూట్

   16 hours ago


మహేశ్ బాబు గ్లామర్ సీక్రెట్.. 'Dr రష్మీ శెట్టి'

మహేశ్ బాబు గ్లామర్ సీక్రెట్.. 'Dr రష్మీ శెట్టి'

   18 hours ago


నెట్ ప్లిక్స్ లో ఫస్ట్ ఆంథాలజీ.. ఆకట్టుకుంటోన్న  పిట్టకథలు టీజర్

నెట్ ప్లిక్స్ లో ఫస్ట్ ఆంథాలజీ.. ఆకట్టుకుంటోన్న పిట్టకథలు టీజర్

   16 hours ago


పెదనాన్న హెయిర్ సరిచేసిన ప్రభాస్.. వీడియో వైరల్

పెదనాన్న హెయిర్ సరిచేసిన ప్రభాస్.. వీడియో వైరల్

   21 hours ago


'A' మోనాల్.. లవ్..బ్రేకప్ పై క్లారిటీ

'A' మోనాల్.. లవ్..బ్రేకప్ పై క్లారిటీ

   19 hours ago


కమల్ లెగ్ సర్జరీ సక్సెస్.. వారం రోజులు బెడ్ రెస్ట్

కమల్ లెగ్ సర్జరీ సక్సెస్.. వారం రోజులు బెడ్ రెస్ట్

   a day ago


త‌మ‌న్ తానా తందానా.. కాపీ ఘాటు బానే త‌గిలిన‌ట్లుంది

త‌మ‌న్ తానా తందానా.. కాపీ ఘాటు బానే త‌గిలిన‌ట్లుంది

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle