newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

లెజెండరీ స్పిన్నర్ పాత్రలో విజయ్ సేతుపతి..

08-10-202008-10-2020 16:01:30 IST
2020-10-08T10:31:30.745Z08-10-2020 2020-10-08T10:05:01.195Z - - 21-10-2020

లెజెండరీ స్పిన్నర్ పాత్రలో విజయ్ సేతుపతి..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓ పక్క హీరో..మరోపక్క విలన్ గా తన నటనతో సత్తా చాటుతున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి. రీసెంట్ గా ఆయన ఓ బయోపిక్ లో నటించేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పాత్రలో మెరవనున్నాడు విజయ్ సేతుపతి. ఎటువంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే విజయ్ .. ముత్తయ్య పాత్రకు ఏ మేరకు న్యాయం చేయగలడో వేచి చూడాలి.

త‌న స్పిన్ మాయాజాలంతో ప్ర‌పంచ క్రికెట్‌లో ప‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలంక లెజెండ‌రీ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్. ఆయ‌న జీవితంపై ఓ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా చిత్ర బృందం మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది. బ‌యోపిక్‌లో త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర పోషిస్తాడ‌ని, మూవీకి సంబంధించిన అఫీషియ‌ల్ అప్ డేట్ త్వ‌ర‌లోనే రానుంద‌ని ప్ర‌క‌టించారు చిత్ర మేకర్స్. 

ప్ర‌‌పంచ క్రికెట్ లో ప‌లు రికార్డులు త‌న పేరుపై లిఖించుకున్న ముర‌ళీధర‌న్ వ‌‌న్డేలతోపాటు టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసాడు. వ‌న్డేల్లో ముర‌ళీ 534 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 800 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు నిర్మించ‌బోయే చిత్రం పేరు 800కు ఈ రికార్డే స్ఫూర్తి అని తెలుస్తోంది. 2011లో రిటైర్మెంట్ ప్ర‌క‌టించాక వివిధ టీ20 టోర్నీల్లో ముర‌ళీ ఆడాడు. అనంత‌రం కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ప్ర‌స్తుతం అతను ఐపీఎల్ జ‌ట్టు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు స్పిన్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. 

ముర‌ళీ బౌలింగ్ శైలితోపాటు మ్యాన‌రిజ‌మ్స్‌ను విజ‌య్ సేతుప‌తి ఔపాస‌న పడుతున్నాడు. అత‌ను పాత్ర‌తో ప‌క్కాగా మెప్పిస్తాడ‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ముర‌ళి స్నేహితుడు, ప్ర‌ముఖ క్రికెట‌ర్ క‌మ్ కామెంటేట‌ర్ ర‌సెల్ ఆర్నాల్డ్ పాత్ర‌లో క‌మెడియ‌న్ యోగి బాబు మెర‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాగా,  ముర‌ళీధ‌ర‌న్‌కు భార‌త్‌తో ఎంతో అనుబంధ‌ముంది. త‌మిళ‌నాడుకు చెందిన యువ‌తినే త‌ను వివాహ‌మాడాడు. ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్ కోసం క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఈ చిత్రంతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న పీరియడ్ మూవీ 'సైరా నరసింహారెడ్డి'లో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ సేతుపతి పాత్ర, లుక్ రివీల్ చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' మోషన్ పోస్టర్ ని కూడా  విడుదల చేసింది. ఇందులో విజయ్ రాజా పాండి అనే పాత్రలో కనిపించబోతున్నాడు విజయ్ సేతుపతి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle