ఈ వర్మకి కరోనాతో పెళ్లి చేస్తే బాగేమో
25-03-202125-03-2021 10:00:26 IST
Updated On 25-03-2021 09:33:52 ISTUpdated On 25-03-20212021-03-25T04:30:26.056Z25-03-2021 2021-03-25T03:50:38.831Z - 2021-03-25T04:03:52.893Z - 25-03-2021

ఈ ఆర్జీవీ ఉన్నాడే. తాగే ఇంటర్వ్యూలకి వస్తాడాయే. ఈ మాత్రం మాటలు అనడా చెప్పండి. ఎన్ని విన్నాం. ఎన్ని చూశాం. అయినా.. ఇష్యూస్ తో డేటింగ్ చేసే రామ్ గోపాల్ వర్మకి.. అస్సలు బోర్ కొట్టడం లేదా. ప్రతి వ్యక్తికీ తాము చేసే పనితో బోర్ కొడుతుంది. మరి వార్మ పని వివాదాలు, గొడవలు లేపడం.. ఏవేవో తొర్రి కామెంట్స్ చేయడం మామూలేగా. ఎప్పుడూ అదేనా. బోర్ కొట్టదా ఈ మనిషికి. ఈ మనిషికి కరోనాతో పెళ్లిచెయ్య. ఏందో వర్మ.. రీసెంట్ గా కూడా ఇలాంటి కామెంట్లే చేశాడు. టైం దొరగ్గానే.. వర్మ ఎదురుగా కూర్చుంటారు కదా స్వప్న. కూర్చుని ఊరికే ఉంటారా.. కెమెరాలు ఆన్ చేస్తారు.. ఏవేవో మాట్లాడుతుంటారు. అఫ్ కోర్స్.. వాళ్లిద్దరూ కలిసి కూర్చుంటే ఆ కాంబినేషన్ కి ఎదురేలేదు. పీకి పాకాన పెట్టాలంటే వీళ్లిద్దరూ కూర్చోవాల్సిందే. ట్రెడిషన్స్ కి సంప్రదాయాలకీ మర్యాద ఇస్తున్నట్లే మాట్లాడే స్వప్న.. వర్మ నుంచి ఎలాంటి విషయాలు రాబడుతుందో తెలిసిందే కదా. చాలా మంది బ్రెయిన్ పని చేయని వారికి మోకాళ్లు సవరించి బ్రెయిన్ వాష్ చేస్తుంటాడు వర్మ. ఆ రాంగోపాల్ వర్మ బ్రెయిన్ వాష్ కి ఈ స్వప్న బాండ్ సర్ఫ్ అందిస్తూ.. యాంకర్ ప్లేస్ లో కూర్చుంటారామె. ఇలాగే.. లేటెస్ట్ గా కూర్చున్నారు. అండర్ వరల్డ్ గురించి డీప్ గా వెళ్లారు. అదే ప్రాసెస్ లో రామాయణంలో అంటే.. కాస్త నీతి బోధలు ఉన్నాయి కానీ.. మహా భారతంలో ఎక్కడున్నాయి అంటాడు వర్మ. అదేంటీ.. మహాభారతం కూడా దేవుడిదే కదా అంటే. కాదు కాదు.. అది పవర్ పాలిటిక్స్ కి సంబంధించిన స్టోరీ.. మహాభారతం కూడా అండర్ వరల్డ్ లాంటిదే అంటాడు వర్మ. అంటే.. అక్కడ కూడా పవర్ కోసమే కదా కొట్టుకుంటారు అన్నదమ్ములు. సో.. పవర్ ఉన్నోళ్లదే రాజ్యం అనే ఏ రాజుల కాలం నాటి స్టోరీ అయినా.. అండర్ వరల్డ్ లాంటిదే.. పెద్ద తేడా ఏంటి అనేది వర్మ ఇంటెన్షన్. అయితే.. ఇందులో భాగంగా.. ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ బయటికొచ్చింది. దావూద్ కి వారసులు ఉన్నారా అంటూ స్వప్న అడిగితే.. ఆయన కూతురు మలేరియాతో చనిపోయింది అంటాడు వర్మ. ఆ మాటకి.. స్వప్న రియాక్షన్ సూపర్ అసలు. అంత పెద్ద డాన్ కూతుర్ని.. చిన్న దోమొచ్చి చంపేసిందా అంటారు స్వప్న. నిజమే కదా.. ఎంత పెద్ద డాన్ అయినా.. ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినా.. లైఫ్ అంటే నీటి మీద బుడగలాంటిదే కదా అనిపిస్తుంది ఆమె రియాక్షన్ చూశాక.

బాలయ్య బాబు నంబర్ వన్
33 minutes ago

వకీల్ సాబ్.. ఫైనల్ రిపోర్ట్
14 hours ago

నెలకి 8 కోట్లు రెమ్యునరేషన్
19 hours ago

డేంజర్ గా మారిన బండ్ల గణేశ్ ఆరోగ్యం
14-04-2021

మనీ హెయిస్ట్ 5వ సీజన్ రిలీజ్ డేట్ పై క్లారిటీ
14-04-2021

ఐసీయూలో బండ్ల గణేష్.. రెండో సారి కరోనా..!
14-04-2021

అఖండ అరాచకం.. బాలయ్య-బోయపాటి మాస్ మాయ..!
13-04-2021

వచ్చే ఆదివారం ఓటీటీలో వకీల్ సాబ్ మూవీ..ఏ ఓటీటీనో తెలుసా
13-04-2021

వకీల్ సాబ్ సినిమా చూస్తూ చనిపోయిన యువకుడు..!
13-04-2021

అప్పుడు గొప్పలు.. ఇప్పుడు తిప్పలు
13-04-2021
ఇంకా