newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

నాని మూవీకి వెరైటీ టైటిల్

21-11-202021-11-2020 17:24:55 IST
2020-11-21T11:54:55.891Z21-11-2020 2020-11-21T11:54:51.847Z - - 02-12-2020

నాని మూవీకి వెరైటీ టైటిల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకి నిన్ను కోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే... ఈరోజు నాని కొత్త సినిమా టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని ఇటీవల అఫిషియల్ గా ఎనౌన్స్ చేసారు. అయితే.. ఈ మూవీ టైటిల్ ను ఈ రోజు ప్రకటించారు.

ఈ సినిమాలో మ‌ల‌యాళ భామ న‌జ్రియా ఫ‌హాద్ క‌థానాయిక‌. ఇక ఈ చిత్రానికి అంటే.. సుంద‌రానికి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ ఖ‌రారు చేస్తూ… ఓ చిన్న పాటి ఆడియో టీజ‌ర్ కూడా విడుద‌ల చేశారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే... ఆఫీసులో గుస‌గుస‌లు వినిపిస్తుంటాయ.. చివ‌ర్లో నాని వెరైటీ గెటప్ లో ఎంట్రీ ఇవ్వడం పాచిక‌లు వేయ‌మందువా.. అంటూ శ‌కుని మామ డైలాగ్‌… మొత్తంగా ఈ వీడియో చూస్తుంటే... ఈ సినిమా ఓ ఫ‌న్నీ ప్యాకేజీలా ఉంది. ఈ టీజ‌ర్ చూశాక‌.. సినిమా ఎంటర్ టైనింగ్ ఉండబోతుందో అర్ధం అవుతుంది.

ఈ మూవీని అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వివేక్ సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాని టక్ జగదీష్ సినిమాతో పాటు శ్యామ్ సింగ్ రాయ్ మూవీ కూడా చేస్తున్నాడు. అయితే.... అంటే.. సుందరానికి సినిమాని 2021లోనే విడుదల చేయనున్నారని సమాచారం.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle