newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

వంశీ పైడిపల్లి.. ఈసారైనా మెప్పిస్తాడా..?

25-10-202025-10-2020 16:53:30 IST
Updated On 25-10-2020 17:46:13 ISTUpdated On 25-10-20202020-10-25T11:23:30.692Z25-10-2020 2020-10-25T11:23:25.200Z - 2020-10-25T12:16:13.647Z - 25-10-2020

వంశీ పైడిపల్లి.. ఈసారైనా మెప్పిస్తాడా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

డైరెక్టర్ వంశీ పైడిపల్లి... సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి మూవీని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా మహేష్ కి కమర్షియల్ సక్సస్ తో పాటు మంచి పేరు తీసుకువచ్చింది. దీంతో మహేష్.. వంశీ పైడిపల్లితో మరో సినిమా చేయాలి అనుకున్నారు. కథ రెడీ చేసుకో.. మరో సినిమా చేద్దామన్నారు. వంశీ కథ రెడీ చేయించాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాలి అనుకున్నారు. త్వరలో షూటింగ్ చేద్దమనగా... మహేష్ వంశీ చెప్పిన కథ వింటే.. నచ్చలేదు. అంతే.. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. మహేష్‌ పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమాని ఎనౌన్స్ చేసాడు.

అప్పటి నుంచి వంశీ కథ పట్టుకుని హీరోల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు కానీ... ప్రాజెక్ట్ సెట్ కావడం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో వంశీ సినిమా చేయనున్నట్టు.. ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే... ఆతర్వాత ఆ వార్త వాస్తవం కాదన్నారు. తాజాగా ఈ కాంబినేషన్ గురించి వార్తలు వస్తున్నాయి. చరణ్ కోసం వంశీ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాను రెడీ చేసాడట. చరణ్ కథ విని ఓకే చెప్పాడని... త్వరలో చిరంజీవికి వంశీ కథ చెప్పనున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. అలాగే ఆచార్య సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే ఆచార్య సినిమా షూటింగ్ లో చరణ్‌ జాయిన్ కానున్నాడని తెలిసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే... చరణ్‌ - వంశీ పైడిపల్లి కాంబినేషన్ సెట్ అవ్వడం ఖాయం. మరి... ప్రాజెక్ట్ సెట్ అవుతుందో లేదో చూడాలి.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle