newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ఆచార్య కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పురాతన దేవాలయం సెట్

29-09-202029-09-2020 15:39:02 IST
2020-09-29T10:09:02.604Z29-09-2020 2020-09-29T10:08:59.104Z - - 25-10-2020

ఆచార్య కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పురాతన దేవాలయం సెట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రియేటీవ్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య.  ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రని పోషిస్తున్నారు. కాగా  గత కొంతకాలంగా `ఆచార్య` చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ మెగాభిమానుల్ని యంగేజ్ చేస్తున్నా.. షూటింగ్ సాగకపోవడంతో ఆ విషయంలో అంతా అసంతృప్తిగానే ఉన్నారు. మహమ్మారీ దెబ్బకు షూటింగులు బంద్ అవ్వడం నిరాశపరిచింది. ఇది `ఆచార్య` లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఊహించని అవాంతరంగానే మారింది. కొరటాల నేడో రేపో అనేంత పట్టుదలగా  ఉన్నా పరిస్థితులు సహకరించడం లేదు.

ఇప్పుడిప్పుడే కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ నుంచి పరిస్థితులు కొంచెం కొంచెంగా సద్ధుమనుగుతున్నాయి. దాంతో  ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి అనుమతితో  షూటింగ్ కి సిద్ధమవుతోంది ఆచార్య చిత్ర యూనిట్. ఇప్పటికే  రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పురాతన దేవాలయం సెట్ ని నిర్మించారు. అయితే ఆరంభం చిరంజీవి షూటింగులో పాల్గొనరని సమాచారం. ఇతరులపైనే ఈ  చిత్రీకరణ పూర్తి చేయనున్నారు. ఇక సెట్స్ లో మహమ్మారీ సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోనున్నారు.

ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ అనీ, ప్రకృతి వనరులను కాపాడుకోవడం కోసం ఒక వ్యక్తి చేసే పోరాటంగా సాగుతుందని ఆచార్య కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి  చెప్పారు. ఈ సినిమాలో దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన అంశం కూడా వుండే అవకాశం వుందన్నారు. ఆచార్య సినిమాకు మణిశర్మ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కూడా చిరు తెలిపారు. 

కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాజల్ అగర్వాల్  హీరోయిన్ గా నటిస్తుంది. చిరంజీవితో కాజల్ కి ఇది రెండవ చిత్రం.  ఆచార్య’ విడుద‌ల ఈ ఏడాది ద్వితీయార్థం చివ‌రలో ఉండొచ్చంటున్నారు. లేకుంటే వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లోనే విడుద‌ల చేస్తార‌నే టాక్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది ఈ వార్త. ఈ చిత్రంలో నటించేందుకు రామ్ చరణ్.. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దగ్గర పర్మిషన్ కూడా తీసుకోవడం విశేషం. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle