newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

బిగ్ బాస్4: వాళ్లంతా గేమ్ ఆడటానికి రాలేదు.. 3 నెలలు డేటింగ్ కి వచ్చారు..

30-09-202030-09-2020 18:59:42 IST
Updated On 30-09-2020 19:14:56 ISTUpdated On 30-09-20202020-09-30T13:29:42.111Z30-09-2020 2020-09-30T13:29:39.991Z - 2020-09-30T13:44:56.408Z - 30-09-2020

బిగ్ బాస్4: వాళ్లంతా గేమ్ ఆడటానికి రాలేదు.. 3 నెలలు డేటింగ్ కి వచ్చారు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మూడు వారాలు పూర్తి చేసుకొని ముందుకి వెళ్తుంది. వారానికొకరు ఎలిమినేట్ అవుతూ, ఇంకొకరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలికి వస్తున్నారు. ఇప్పటికే షో నుంచి డైరెక్టర్ సూర్యకిరణ్, కరాటే కళ్యాణి, దేవి నాగవల్లిలు ఎలిమినేట్ అయ్యారు. కంటెస్టెంట్లలో తొలిరోజు నుంచి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా కనపడిన దేవి నాగవల్లి ఊహించని విధంగా మూడో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక ఆ కంటెస్టెంట్స్ కొన్ని ఇంటర్వూస్ ఇస్తారు. కొంతమంది ఈ ఇంటర్వ్యూలలో వివాదాలకు దారి తీసే విషయాలు కూడా చెప్తారు. ఇటీవలే కరాటే కళ్యాణి బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఇప్పుడు దేవి నాగవల్లి కూడా బిగ్ బాస్ పై, బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది.

 దేవి నాగవల్లి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నామినేషన్ లో తనకు ఎక్కువగా ఓట్లు వచ్చినా, నాకంటే తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నా నన్ను కావాలని ఎలిమినేట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతే కాక హౌస్ లో ఉన్న కొందరు కంటెస్టంట్స్ గురించి కూడా కామెంట్స్ చేసింది. హౌజ్ లో కొందరు గేమ్ ఆడటానికి కాకుండా 3 నెలలు డేటింగ్ కు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారని తెలిపింది. తాను అలా అనడానికి కూడా రీజన్ ఉంది. బిగ్ బాస్ లో వచ్చిన వాళ్లలో కొంతమంది తమకు జంట వెతుక్కొని కలివిడిగా ఆడుతున్నారు. రొమాంటిక్ సన్నివేశాలు కూడా చేస్తున్నారు. ఇవి చూసే దేవి నాగవల్లి ఈ కామెంట్స్ చేసింది. 

గత సీజన్ల నుంచి కూడా బిగ్ బాస్ లో ఇదే జరుగుతుంది. తాజాగా ఈ సీజన్ లో కూడా రెండు, మూడు జంటలుగా ఉన్నారు కొంతమంది కంటెస్టెంట్స్. వీళ్లల్లో అఖిల్..మోనాల్, అభిజిత్..స్వాతి, మెహబూబ్..హారిక, సోహైల్..అరియనా ఇలా ప్రతి ఒక్కరు తమ జోడీని వెతుక్కొని వాళ్ళతో కలిసి ఎంటర్టైన్ చేస్తున్నారు. కొన్ని సార్లు ఇది గేమ్స్ లో ప్రాబ్లెమ్ గా కూడా మారుతుంది. దేవి నాగవల్లి చెప్పింది నిజమే అని అందరు అనుకుంటున్నారు.      


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle