newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

అక్కినేని హీరోల ప్లాన్ బాగుంది.. ఏంటో తెలుసా..?

29-09-202029-09-2020 13:44:54 IST
Updated On 29-09-2020 13:55:22 ISTUpdated On 29-09-20202020-09-29T08:14:54.909Z29-09-2020 2020-09-29T08:14:52.728Z - 2020-09-29T08:25:22.742Z - 29-09-2020

అక్కినేని హీరోల ప్లాన్ బాగుంది.. ఏంటో తెలుసా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్టార్ హీరోలు.. టాప్ డైరెక్టర్స్ ని లాక్ చేస్తుంటారు. దీంతో చాలా మంది హీరోలకు సరైన డైరక్టర్ దొరకక ఇబ్బంది పడుతుంటారు. అందుకనే అక్కినేని హీరోలు డైరెక్టర్స్ ని తెలివిగా లాక్ చేస్తున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే... అక్కినేని కాంపౌండ్ లో ఎంట్రీ ఇచ్చి ఒక సినిమా చేసిన డైరెక్టర్ కి మరో రెండు ఛాన్స్ లు ఇస్తున్నారు. అవును.. నాగార్జునతో సినిమా చేస్తే... ఆ డైరెక్టర్ కి చైతన్య, అఖిల్ తో సినిమా చేసే ఛాన్స్ ఇస్తున్నారు. నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయనా సినిమా చేసిన కళ్యాణ్ కృష్ణకు అక్కినేని కాంపౌండ్ మరో ఛాన్స్ ఇచ్చింది.

నాగచైతన్యతో కళ్యాణ్ కృష్ణ రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చేసాడు. మళ్లీ నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయనా సిక్వెల్ బంగార్రాజు ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్ కుమార్ అక్కినేని హీరోలతో మనం సినిమా చేసాడు. ఆతర్వాత అఖిల్ తో హలో సినిమా చేసాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోయినా ఇప్పుడు చైతన్య విక్రమ్ కుమార్ తో థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే... వెంకీ అట్లూరి అఖిల్ తో మిస్టర్ మజ్ను అనే సినిమా చేసాడు.

ఈ మూవీ ఫరవాలేదు అనిపించింది. ఇప్పుడు ఈ డైరెక్టర్ తో చైతన్య ఓ సినిమా చేయనున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఎనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. ఈవిధంగా అక్కినేని కాంపౌండ్ లోకి డైరెక్టర్ ఎంటరైతే నాగార్జున, చైతన్య, అఖిల్.. ఈ ముగ్గురు హీరోలతో సినిమా చేసే ఛాన్స్. అక్కినేని హీరోల ప్లాన్ బాగుంది కదా..!

టాలీవుడ్ కి దారి చూపిస్తున్న అక్కినేని హీరోలు..


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle