సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాగిణి.. ఇప్పటికైనా బెయిల్ వచ్చేనా?
05-12-202005-12-2020 16:26:06 IST
Updated On 05-12-2020 16:35:19 ISTUpdated On 05-12-20202020-12-05T10:56:06.103Z05-12-2020 2020-12-05T10:52:57.577Z - 2020-12-05T11:05:19.683Z - 05-12-2020

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ తర్వాత కోలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేగింది. అంతేనా ఈ మేరకు పలువురు హీరోయిన్స్ ని కూడా అదుపులోక తీసుకుని వారిని విచారించారు పోలీసు అధికారులు. ఈ లిస్ట్ లో హీరోయిన్ రాగిణి పేరు కూడా ఉంది. దాంతో డ్రగ్స్ లింకులు శాండల్ వుడ్ పరిశ్రమలో కలకలం రేపాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి పలు కీలక విషయాలను రాబట్టారు. శాండిల్ వుడ్ తారలు రాగిణి ద్వివేది.. సంజనలకు డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో వారిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే.

ప్రస్తుతం వీరిద్దరి అగ్రహారం సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి నుంచి సీసీబీ పోలీసులు కీలక సమాచారం సేకరించారు. డ్రగ్స్ కేసులో దాదాపుగా 90 రోజులుగా రాగిణి ద్వివేది జైలులో ఉంటున్నారు. ఎలాంటి ఆధారాలు సాక్ష్యాలు లేకుండా జైలులో నిర్బంధించిన తనకు బెయిల్ ఇవ్వడం లేదని.. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ హీరోయిన్ రాగిణి ద్వివేది సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ రాగిణి సుప్రీంకోర్టును కోరింది. పబ్లిసిటీ కోసమే తనను అరెస్ట్ చేశారని.. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని.. అధికారులకు డ్రగ్స్ దొరకలేదని పిటీషన్ లో పేర్కొంది. రాగిణి దాఖలు చేసిన పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.

ఈ కేసులో రాగిణికి ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదో తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. దాంతో రాగిణికి కొత ఊరట వచ్చినట్టయింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో సినీ హీరోయిన్లు రాగిణి.. సంజన.. నిర్మాత శివ ప్రకాష్ లు పలుమార్లు దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటీషన్లను కోర్టు బెంగళూరు కోర్టు తోసిపుచ్చింది. దాంతో రాగిణి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మరి సుప్రీం ఆదేశాలకు మేరకు కర్ణాటక ప్రభుత్వం ఏం చెబుతారో చూడాలి. ఈ డ్రగ్స్ కేసులో పలువురు బాలీవుడ్ స్టార్స్ ని కూడా విచారించిన విషయం తెలిసిందే.



రిచాకి గెస్ట్ రోల్ ఆఫర్ చేసిన హరీష్.. రీ ఎంట్రీ ఇస్తుందా?
34 minutes ago

సూసైడ్ చేసుకోవాలనుకున్న డైరెక్టర్ కమ్ యాక్టర్
2 hours ago

నిధి అగర్వాల్ ఆరబోత.. ఇంత రెచ్చిపోతే ఎలా
3 hours ago

డైరెక్టర్ గా కంగనా.. మహారాణి దిద్దాగా అవతారం
4 hours ago

ఆడియన్స్ ని ఆకట్టుకుంటోన్న జాంబీరెడ్డి కరోనా సాంగ్
5 hours ago

ఫస్ట్ టైం మ్యూజిక్ వీడియోలో సోనూ.. ఫ్యాన్స్ హ్యాపీ
7 hours ago

మహేశ్ బాబు భార్య పోస్టుపై బుంగమూతి పెట్టుకున్న నిర్మాత
6 hours ago

త్రివిక్రమ్ తో ఈ డైరెక్టర్ కి అన్యాయం జరుగుతోందా
10 hours ago

ఒకే చోట పాన్ ఇండియా స్టార్స్.. సలార్ కి పూజ
15-01-2021

పోర్న్ స్టార్ గా మారనున్న ఎస్తేర్..
15-01-2021
ఇంకా