తమన్ తానా తందానా.. కాపీ ఘాటు బానే తగిలినట్లుంది
20-01-202120-01-2021 14:51:52 IST
Updated On 20-01-2021 11:16:39 ISTUpdated On 20-01-20212021-01-20T09:21:52.937Z20-01-2021 2021-01-20T05:37:21.287Z - 2021-01-20T05:46:39.585Z - 20-01-2021

ఏం సంగతి. ఏం పరాష్కాలా. ఏం ఊరుకుంటుంటే ఊరుకూరికే మీద పడుతున్నారు. చూస్తూ ఊరుకుంటున్నా కదా అని.. మాటి మాటికీ కామెంట్లు చేస్తే ఇక ఒప్పుకునేది లేదు. ఎందుకొచ్చిన గోలలే.. ఎందుకొచ్చిన గోలలే అంటూ సర్దుకుంటూ పోతుంటే.. ఆగేలా లేరు కదా. అర్రే.. ఒక్కసారి అన్నరంటే అన్నర్ లే అనుకుందాం. పోనీ రెండు సార్లు అన్నరంటే అన్నర్ లే అనుకుందాం. అరే.. చేసిన ప్రతి సినిమాకీ ఇదే గోలా. కాపీ కాపీ కాపీ అంటూ ఉంటే.. కాఫీ తాగినా తలనొప్పి తగ్గడం లేదు. ఇంకోసారి గిన్క.. ఇట్లనే నక్రాల్ జేస్తె ఊర్కునేదే లేదు. ఇవండీ.. తమన్ ఇంటెన్షన్లు. ఇన్ని మాటలు అన్లేదు కానీ.. ఆ మాటల ఉద్దేశానికి మాస్ మ్యూజిక్ కాకుండా.. సాఫ్ట్ మ్యూజిక్ కొట్టాడు. కానీ.. ఇంటెన్షన్ మాత్రం అదే సుమీ. ఇంతకు ముందు.. కాపీ క్యాట్ కాపీ క్యాట్ అంటున్నా.. సైలెంట్ గా ఉండే వాడు తమన్. ఎక్కడో ఒకచోట ఇన్స్పైర్ అయితే తప్పేంటి అనే వాడు. కానీ జనాలేమో.. ఈ ట్యూన్ అక్కడి నుంచి ఎత్తుకొచ్చాడు.. ఆ ట్యూన్ అక్కడి నుంచి ఎత్తుకొచ్చాడు. కొన్ని చోట్ల మార్చి కొట్టాడు.. కొన్ని చోట్ల మాత్రం యాజ్ టీజ్ గా దించేశాడు అనే వాళ్లు. కాపీ ఏదో.. ఒరిజినల్ ఏదో కూడా కంపార్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లోకి తెచ్చే వారు. అవన్నీ చూస్తూ కూర్చుంటున్న తమన్.. ఇప్పుడు మాత్రం కయ్యి కయ్యిమంటున్నాడు. బాలూ లాస్ట్ సాంగ్ వైరల్.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్ నేనిప్పటి దాకా వంద సినిమాలకి పైనే మ్యూజిక్ కొట్టా. ఎంతోమంది డైరెక్టర్ లతో పని చేశా. ఎంతోమంది టెక్నీషియన్స్ తో వర్క్ చేశా. ప్రపంచ భాషల సినిమాలన్నీటినీ కాసి ఒడపోసి.. ఇంకాస్త నీట్ గా జల్లెడ పట్టిన క్రియేటర్లతో వర్క్ చేస్తున్నా.. అలాంటి వారే కాపీ అనడం లేదు. సినిమాలు తీసేవాళ్లంతా మామూలోళ్లేం కాదు కదా. వారికి అన్ని భాషల సినిమాల మీదా నాలెడ్జ్ ఉంటుంది కదా. కాపీ అయితే వాళ్లే చెబుతారు కదా. మ్యూజిక్ అంటే ఒక్కరితోనే వచ్చేది కాదు. టీమ్ అంతా వర్క్ చేస్తాం. ఎంతో మంది ఇన్వాల్వ్ అవుతారు. ఎవరూ కాపీ అనడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం కాపీ కాపీ అంటున్నారు. ఇంత వరకు ఏ కంపెనీ అయినా.. నావి కాపీ అంటూ.. కంప్లైంట్ చేసిందా అంటున్నాడు తమన్. మ్యూజిక్ మీద ఏ మాత్రం నాలెడ్జ్ లేని వాళ్లే.. సోషల్ మీడియాలో నాన్సెన్స్ చేస్తున్నారు అంటూ ఘాటుగానే రెస్పాండ్ అయ్యాడు తమన్. రీసెంట్ గా వచ్చిన క్రాక్ మూవీలో కూడా ట్యూన్స్ కాపీ కొట్టాడు అనేవి ట్రెండింగ్ అవుతున్నాయ్ కదా.. అందుకే.. కోపం వచ్చి ఉంటుంది.

భీష్మ డైరెక్టర్ ని ఎలా బురిడీ కొట్టించాడు.. మొత్తం కథ
05-03-2021

నాని సినిమాపై హాట్ బేబీ కంప్లైంట్.. ఆపేయాలన్న బాంబే హైకోర్టు
05-03-2021

ప్రదీప్ సినిమాకి అన్ని కోట్లా.. అందుకే సినిమాలకి ఇంత క్యూ
04-03-2021

బాలయ్య బాబూ.. ప్లీజ్ ఓకే చెప్పండి
03-03-2021

హీరో ఏజ్ 50.. హీరోయిన్ ఏజ్ 20.. క్యారవ్యాన్ లో ఏం జరుగుతోంది
03-03-2021

పవన్ సినిమా అయితే.. అంత చిన్న పాత్ర చేయాలా..?
02-03-2021

సన్నీలియోన్ కి మళ్లీ పెళ్లి.. గుంటూరు కుర్రాడు
02-03-2021

కంగనాకు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ
02-03-2021

నెట్ ఫ్లిక్స్ కి నాగ్ షాక్..అంత నమ్మకం ఏంటి..డేర్ స్టెప్ ఏంటి
01-03-2021

అన్నకి వ్యతిరేకంగా తమ్ముడు
01-03-2021
ఇంకా