newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

ఎన్టీఆర్ స్టేజు ఎక్కగానే సీఎం.. సీఎం.. అంటూ అరుపులు..!

22-03-202122-03-2021 11:19:19 IST
Updated On 22-03-2021 11:40:35 ISTUpdated On 22-03-20212021-03-22T05:49:19.496Z22-03-2021 2021-03-22T05:49:15.943Z - 2021-03-22T06:10:35.526Z - 22-03-2021

ఎన్టీఆర్ స్టేజు ఎక్కగానే సీఎం.. సీఎం.. అంటూ అరుపులు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ వరుస ఓటములను అందుకుంటూ ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీకి తిరిగి పూర్వ వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడి వల్లే సాధ్యమని తెలుగుదేశం కార్యకర్తలు కూడా భావిస్తూ ఉన్నారు. అందుకే ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో ఎన్టీఆర్ ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. చంద్రబాబు నాయుడును నడి రోడ్డు మీదనే అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొని రావాలంటూ కోరారు. చంద్రబాబు నవ్వుతూ సైలెంట్ అయిపోయారు. 

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ 'తెల్లవారితే గురువారం' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యారు. ఎన్టీఆర్ మాట్లాడుతుండగా "సీఎం, సీఎం" అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తూ ఉత్సాహం వెలిబుచ్చారు. తారక్ ఓవైపు కీరవాణి తనయులు శ్రీసింహా, కాలభైరవ గురించి మాట్లాడుతుండగా, అభిమానులు మాత్రం సీఎం నినాదాలతో హోరెత్తించారు. కీరవాణి కుటుంబసభ్యుల గురించి మాట్లాడుతున్నప్పుడు సీఎం అంటూ అభిమానులు అరవడంతో ఎన్టీఆర్ ను కాస్తంత అసహనానికి గురిచేసింది. ఆయన వెంటనే ప్రసంగం ఆపి... "ఆగండి బ్రదర్, ఆగమని చెప్తున్నాను కదా" అంటూ మందలించే ప్రయత్నం చేశారు. వెంటనే ఆగండి బ్రదర్.. ఆగమని చెప్తున్నానా అంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు తారక్. దాంతో అభిమానులు కూడా ఆయన మాట విన్నారు. అప్పటి వరకు అరిచినా వాళ్లు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ మా అబ్బాయిలు అభయ్, భార్గవ్‌ వారికి ఇష్టం వచ్చిన రంగంలో ఏదైనా సాధించిన రోజు వాళ్ల గురించి నేను మాట్లాడాలంటే ఎంత ఇబ్బందిగానూ, బ్లాంక్‌గానూ ఉంటానో నా తమ్ముళ్లు భైరవ, సింహా సాధించిన విజయం గురించి అలానే ఉంటానని చెప్పుకొచ్చారు. వాళ్లిద్దర్నీ చూసి ఈరోజు నేనెలా ఫీలవుతున్నానో భవిష్యత్తులో అభయ్, భార్గవ్‌లను చూసి ఇంతే ఆనందపడతానేమోనని అన్నారు. నా మంచీ చెడుల్లో, కష్ట సుఖాల్లో, నా ప్రతి నిర్ణయం వెనకాల పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ ఉన్న ఒకే ఒక కుటుంబం కీరవాణి, జక్కన్నలదేనని అన్నారు. కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి హీరోగా నటిస్తున్న ఈ సినిమా మార్చ్ 27న విడుదల కానుంది. 

ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

   10 hours ago


నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

   10 hours ago


హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

   a day ago


Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

   24-07-2021


ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

   24-07-2021


రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?

రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?

   24-07-2021


ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష వివాహం..?

ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష వివాహం..?

   24-07-2021


తమిళనాడు లో అఖండ క్లైమాక్స్ షూటింగ్

తమిళనాడు లో అఖండ క్లైమాక్స్ షూటింగ్

   23-07-2021


బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..

బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..

   23-07-2021


నాలుగో పెళ్లి చేసుకోబోతున్న విజయకుమార్ కూతురు

నాలుగో పెళ్లి చేసుకోబోతున్న విజయకుమార్ కూతురు

   23-07-2021


ఇంకా

Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle