newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

తరుణ్ నుంచి పెళ్లి ప్రపోజల్ వచ్చింది- ప్రియమణి

22-11-202022-11-2020 18:30:13 IST
2020-11-22T13:00:13.452Z22-11-2020 2020-11-22T13:00:09.527Z - - 06-12-2020

తరుణ్ నుంచి పెళ్లి ప్రపోజల్ వచ్చింది- ప్రియమణి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

హల్లో హల్లో ఎస్సూస్ మీ.. ఇప్పుడు కాదు. ఫస్ట్ ఇది క్లియర్ అయిన తర్వాతనే మిగతాది చదవండి. తరుణ్ సైడ్ నుంచి ప్రియమణికి పెళ్లి ప్రపోజల్ వచ్చిన మాట నిజమేనట. కాకపోతే ఇప్పుడు కాదు. ప్రియమణి పెళ్లి చేసుకుంటుందా.. ఉన్న మొగుడ్ని వదిలేస్తుందా.. ఆల్రడీ ఉన్న మొగుడితో దూరంగా ఉంటుందా.. ఇలాంటి డౌట్స్ ఏం వద్దు. ఎందుకంటే ఈ ముచ్చట అప్పటి ముచ్చట. రీసెంట్ గా అలా సరదాగా బయటపెట్టింది ప్రియమణి. 

అఫ్ కోర్స్ అప్పట్లో కూడా అన్నారు. ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో బానే తిరిగింది ఈ న్యూస్. ప్రియమణి తరుణ్ నవ వసంతం అనే సినిమా చేశారు కదా. ఆ టైంలో.. తరుణ్ ప్రియమణి బాగా క్లోజ్ అయ్యారట. అప్పటికి ప్రియమణికి కూడా పెళ్లి కాలేదు కదా. పిల్ల బావుంది. జాంపండులా ఉంది. నా కొడుక్కి ఇచ్చి కట్టబెడితే బావుంటుంది అనుకుందంట తరుణ్ వాళ్ల అమ్మ. అనుకోవడమే కాదు. అడిగేసిందంట కూడా. ఇదిగా పిల్లా ప్రియమణి.. మా వాడ్ని చేసుకోవచ్చు కదా అందంట. మీరిద్దరూ ఆల్రడీ లవ్ చేసుకుంటున్నారని నాకూ తెలిసింది. ఇక పిల్లలు లవ్ చేసుకుంటే పెద్దాళ్లం మాత్రం ఎలా కాదంటాం.. మీ ఇద్దరి జంటా బావుంటుంది. మా వాడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకో.. నాకేం అభ్యంతరం లేదు అందంట తరుణ్ మదర్ రోజా రమణి. కానీ.. ప్రియాంక ఆమె మాటలతో షాక్ అయిందంట. వామ్మో ఆంటీ గారు అలాంటిదేం లేదు. నేను మీ వాడ్ని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు. మేమిద్దరం లవ్ లో కూడా లేము. జనం అంతా అలా అనుకుంటున్నారు అంతే తప్ప. మా మధ్య మంచి ఫ్రెండ్షిప్పే తప్ప.. ప్రేమలేం లేవు. ప్లీజ్ ఆంటీ నన్ను వదిలేయండి అందంట. 

పాపం తరుణ్.. ప్రియమణి అప్పుడే ఒప్పుకుంటే ఇంకోలా ఉండేదేమో.. తనూ ఒప్పుకోక ఆర్తీతో పెళ్లికాక.. ఒంటికాయ సొంటికొమ్ములా ఉండిపోయాడు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle